బెంగాల్‌ మంత్రి నివాసాల్లో ఈడీ సోదాలు | ED raids at TMC minister house in connection with ration distribution case | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ మంత్రి నివాసాల్లో ఈడీ సోదాలు

Oct 27 2023 5:35 AM | Updated on Oct 27 2023 5:35 AM

ED raids at TMC minister house in connection with ration distribution case - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అటవీ శాఖ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జ్యోతిప్రియో మల్లిక్‌ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు ప్రారంభించారు. బెంగాల్‌లో రేషన్‌ సరుకుల పంపిణీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు కోల్‌కతాలో మంత్రికి చెందిన రెండు నివాసాల్లో సోదాలు ప్రారంభించారు.

ఆయన మాజీ వ్యక్తిగత సహాయకుడి ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. జ్యోతిప్రియో మల్లిక్‌ గతంలో ఆహార శాఖ మంత్రి పనిచేశారు. ఆ సమయంలోనే రేషన్‌ పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో మంత్రితో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. మంత్రి బ్యాంకు ఖాతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, అనుమానాస్పద లావాదేవీలపై ఆయనను ప్రశి్నస్తున్నామని అధికారులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement