అహ్మద్‌నగర్(మహారాష్ట్ర): మహారాష్ట్ర ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి 11 మంది మృత్యువాత పడ్డారు. శనివారం ఉదయం అహ్మద్‌నగర్ సివిల్ హాస్పిటల్‌లోని ఐసీయూలో ఒక్కసారి మంటలు చెలరేగడంతో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు అసలు అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అనే దానిప స్పష్టత లేదు. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కోవిడ్ చికిత్స నిమిత్తం సదరు ఐసీయూ వార్డులో 17 మంది చికిత్స తీసుకుంటున్నారు.
కాగా, సదరు ఆస్పత్రిలో ఐసీయూ యూనిట్‌ను కోవిడ్ రోగుల కోసం ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఘోర ప్రమాదం జరగడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధాన నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఒక ఆసుపత్రిలో అగ్నిప్రమాదం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని మోదీ తన ట్వీటర్ అకౌంట్‌లో పేర్కొన్నారు.
ఆయిల్ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు.. 91 మంది మృతి
Anguished by the loss of lives due to a fire in a hospital in Ahmednagar, Maharashtra. Condolences to the bereaved families. May the injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) November 6, 2021
Comments
Please login to add a commentAdd a comment