![Former Bengal CM Admitted To Hospital For Covid Treatment - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/26/Buddhadeb-Bhattacharya.jpg.webp?itok=BYsQuZ7r)
కోల్‌కతా: గత వారంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టచార్జీ(77) మంగళవారం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆక్సిజన్ స్థాయిల్ 90శాతం కంటే దిగువకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. బుద్ధదేవ్ ఇప్పటి వరకూ హోం ఐసోలేషన్‌లో బీపీఏపీ సపోర్టు మీద ఉన్నారన్నారు.
బుద్ధదేవ్ క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి కారణంగా ఆయన తరచుగా ఆస్పత్రిని సందర్శించాల్సి ఉంటుంది. ఈ నెల 18న ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. అయితే ఆమె కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు.
(చదవండి: బిడ్డకు ప్రాణం.. తల్లి మరణం..!)
Comments
Please login to add a commentAdd a comment