సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో ఓ వ్యక్తిని హిజ్రాలు నిలువు దోపిడీ చేశారు. ఒక రోజు పాటు ఓ హోటల్లో ఉంచుకుని రూ. 4 లక్షలు వసూలు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు షేక్ శ్రీనివాససన్ అశోక్‌నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాలు... ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ శ్రీనివాసన్ (49) గత నెల 30న రాత్రి నగరంలోని ఓ హోటల్లో భోజనం చేసి ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో ఇద్దరు హిజ్రాలు శ్రీనివాసన్‌ను బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు.
ఆటోలో తిప్పుతూ 31 తేదీ రాత్రి వేకువజామున రెసిడెన్సీ రోడ్డులోని హోటల్‌కు తీసుకెళ్లారు. మరో ఇద్దరు హిజ్రాలను పిలిపించుకుని శ్రీనివాసన్‌ను అర్దనగ్నంగా వీడియో తీసి అతడి వద్ద గల గడియారం, ఉంగరం, డెబిట్ కార్డు, బంగారుచైన్, రూ.40 వేల నగదు లాక్కుని బెదిరించి వీడియో వైరల్ చేస్తామని గూగుల్‌పే ద్వారా లక్ష రూపాయలు, డెబిట్‌కార్డు పిన్ నెంబరు తెలుసుకుని రూ.2.90 లక్షలు నగదు డ్రా చేసుకుని ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment