నూతన చట్టాలతో నేరాలు తగ్గుతాయి: అమిత్ షా
న్యూఢిల్లీ: సోమవారం నుంచి అమల్లోకి వచి్చన నూతన నేర చట్టాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైన మూడేళ్లలోపు కోర్టులో న్యాయం అందేలా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
బ్రిటిష్ వలస పాలనాకాలం నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్‌ఏ) చట్టాలను అమల్లోకి తెచి్చన సందర్భంగా సోమవారం ఢిల్లీలో అమిత్‌షా పత్రికా సమావేశంలో మాట్లాడారు.
‘‘ కొత్త చట్టాల అమలుతో నేరాలు తగ్గుముఖం పడతాయి. నూతనచట్టాల కింద 90 శాతం వరకు నేరాలు నిరూపించబడి దోషులకు శిక్షలుపడతాయి. జీరో ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదులపై పోలీసుల ఆన్‌లైన్ రిజి్రస్టేషన్, ఎస్‌ఎంఎస్ తదితర విధానంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించి ఘటనాస్థలిని వీడియో తీయడం, బాధితురాలి ఇంటి వద్ద వాంగ్మూలం తీసుకోవడం వంటి ఎన్నో నిబంధనలను కొత్త చట్టాలు తీసుకొచ్చాయి’’ అని షా చెప్పారు.
10 నిమిషాలకే కొత్త చట్టం కింద కేసు
‘‘కొత్త చట్టాలు సోమవారం అర్ధరాత్రి అమల్లోకి వచి్చన 10 నిమిషాలకే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సిటీలో కొత్త చట్టం కింద బైక్ దొంగతనం కేసు నమోదైంది. వలసపాలనాకాలంలో బ్రిటిష్ వాళ్లు నేరాలపై శిక్షకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మేం కొత్త చట్టాల ద్వారా న్యాయానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఈ–ఎఫ్‌ఐఆర్, జీరో ఎఫ్‌ఐఆర్, ఎలక్ట్రానిక్, డిజిటల్ సాక్ష్యాల ద్వారా నేరాలపై ఫిర్యాదును మరింత సులభతరం చేశాం.
సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిన పనిలేకుండా త్వరగా న్యాయం జరిగేలా న్యాయవ్యవస్థకూ కాలపరిమితిని విధించాం. చిన్నారులు, మహిళలపై నేరాలను సున్నితమైనవిగా పరిగణించాం. కొత్త చట్టం ప్రకారం ఈ కేసుల్లో ఏడు రోజుల్లోపు దర్యాప్తు నివేదిక ఇవ్వాల్సిందే. నేర కేసుల్లో దర్యాప్తు ముగిసిన 45 రోజుల్లోపు కేసు తీర్పు చెప్పాల్సిందే. తొలిసారిగా ఒక కేసు విచారణ మొదలైన రోజు నుంచి 60 రోజుల్లోపు అభియోగాలు దాఖలుచేయాలి.
511 సెక్షన్లను 358కి కుదించాం
ఒకేలా ఉన్న వేర్వేరు సెక్షన్లను కలిపేశాం. దీంతో 511 సెక్షన్లకు బదులు 358 సెక్షన్లు మిగిలాయి. ఉదాహరణకు 6వ సెక్షన్ నుంచి 52వ సెక్షన్‌లోని నిబంధనలను ఒకే సెక్షన్‌లోకి మార్చారు. న్యాయం, పారదర్శకత, నిష్పాక్షికత లక్ష్యంగా ఈ మూడు చట్టాలను తెచ్చాం’’ అని షా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment