
ప్రతీకాత్మక చిత్రం
భవానీపట్నా: భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె చితిలోకి దూకి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సియాల్జోడి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరణించిన వ్యక్తిని నీలమణి సబర్ (65)గా గుర్తించారు. భార్య రైబారి (60) అంత్యక్రియలకు తన నలుగురు కుమారులతో పాటు ఆయన హాజరయ్యారు. చితికి నిప్పంటించాక సంప్రదాయం ప్రకారం పక్కనే ఉన్న నీటి మడుగు వద్దకు నలుగురు కుమారులు, బంధువులు స్నానానికి వెళ్లిన తర్వాత నీలమణి చితిలో దూకారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు.