
ఢిల్లీ: ఇరాన్‌లో జరిగిన జంట పేలుళ్లపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇరాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు సంఘీభావం తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
"ఇరాన్‌లోని కెర్మాన్ నగరంలో జరిగిన బాంబు దాడుల పట్ల మేము దిగ్భ్రాంతి చెందాం. ఈ క్లిష్ట సమయంలో మేము ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం. బాధిత కుటుంబాలు, క్షతగాత్రుల కోసం ప్రార్థిస్తున్నాం" అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 95 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్‌పై దాడి చేసింది ఎవరనేది ఇప్పటికి తెలియదు.
ఇదీ చదవండి: Iran explosions: రక్తమోడిన ర్యాలీ