కామ గిజ్మోస్ షాపు(ఫొటో: సోషల్ మీడియా)
పనాజి: భారత్‌లో చట్టబద్ధంగా సెక్స్ టాయ్‌లు అమ్ముతున్న తొలి షాప్‌గా గుర్తింపు పొందిన కామ గిజ్మోస్‌కు గోవాలో చేదు అనుభవం ఎదురైంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం కాలన్‌గట్‌లో తెరిచిన ఈ దుకాణాన్ని స్థానిక గ్రామ పంచాయతీ మూసివేయించింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా షాప్ నిర్వహిస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ దినేశ్ సిమేపురస్కార్ తెలిపారు. అదే విధంగా ఇలాంటి బొమ్మలు, వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఇందుకు సంబంధించి తమకు అనేక ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. తమ గ్రామంలో ఇలాంటి షాపును కొనసాగించబోమని స్పష్టం చేశారు.
కాగా సెక్స్ టాయ్‌ల విక్రయంలో పోటీదారులుగా ఉన్న కామకార్ట్, గిజ్మోస్‌వాలా అనే రెండు కంపెనీలు సంయుక్తంగా కామ గిజ్మోస్ అనే కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇక గోవాలో జరిగిన ఘటనపై స్పందించిన కామకార్ట్ సీఈఓ గణేషన్ మాట్లాడుతూ.. ‘‘ట్రేడ్‌లైసెన్స్ కోసం మేం దరఖాస్తు చేసుకున్నాం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ వివాదం ముగిసిపోతుంది. కానీ స్థానిక నేతల నుంచి రోజురోజుకీ ఒత్తిడి పెరిగిపోతోంది. బయటి వాళ్లం గనుకే మమ్మల్ని టార్గెట్ చేశారు. అవాంతరాలు అధిగమించి త్వరలోనే షాపు తెరుస్తాం. ఇప్పటికే ఎంతో మంది పురుషులు, మహిళలు మా ఉత్పత్తుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మేం చట్టబద్ధంగానే ముందుకు వెళ్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. త్వరలోనే గోవాలో కూడా మరో షాపు తెరిచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment