
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. శుక్రవారం తాజాగా మరో 77,266 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,500కు చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,057 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 61,529కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 25,83,948కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,42,023గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.90గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న కేసులు 18 లక్షలకు పైగా అధికంగా ఉన్నాయి.
అంతేగాక యాక్టివ్ కేసుల కంటే 3.5 రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. బుధవారానికి ఇది 76.28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.82 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 27 వరకు 3,94,77,848 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం మరో 9,01,338 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు పది లక్షల పరీక్షలు జరిపే దిశగా దేశం పయనిస్తోందని తెలిపింది. గత రెండు వారాల్లోనే ఏకంగా కోటికి పైగా పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది. ప్రతి పది లక్షల మందిలో 28,607 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment