
సాక్షి, బెంగళూరు : ప్రపంచాన్ని మరోసారి వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం రాత్రి 10 గంటల నుంచి అమలులోకి రానున్న కర్ఫ్యూ నిబంధనలు ఉదయం 6 గంటల వరకూ కొనసాగుతాయి. జనవరి 2వ తేదీ వరకూ ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. (వందేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్..!)
కాగా బ్రిటన్‌లో కొత్త రకం కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. వారం రోజుల్లోనే కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. డిసెంబర్ 31, నూతన సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించింది. తాజా వైరస్ ముప్పుపై బ్రిటన్ నుంచి రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. భారత్ కూడా బుధవారం నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment