తిరువనంతపురం: కేరళకు చెందిన నవ వధూవరులు రాహుల్, కార్తీక తమ వివాహ వేడుకకు భారత ఆర్మీని ఆహ్వానించారు. నవంబర్ 10న పెళ్లి చేసుకున్న ఈ జంట ఈమేరకు ఓ లేఖను రాసింది. సరిహద్దులో నిరంతరం కాపు కాస్తున్న సైన్యం దేశభక్తి, అంకితభావం, ప్రేమకు తామంతా రుణపడి ఉన్నామని, ఆర్మీ ఉందనే ధైర్యంతోనే దేశప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని లేఖలో పేర్కొంది. తమ జీవితాల్లో ఎంతో ప్రత్యేకమైన పెళ్లి నాడు ఆర్మీ రావాలని, నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరింది.
ఈ జంట రాసిన లేఖను భారత సైన్యం ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. పెళ్లికి ఆహ్వానించినందుకు రాహుల్, కార్తీకకు ధన్యవాదాలు తెలిపింది. నవజంటకు వివాహ శుభాకాంక్షలు తెలిపింది. జీవితాంతం కలిసి ఉండాలని, సుఖంగా జీవించాలని ఆశీర్వదించింది. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేరళ జంట వివాహ ఆహ్వానానికి సైన్యం స్పందించిన తీరును నెటిజన్లు ప్రశించారు.
చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దినసరి కూలీ.. రూపాయి నాణేలతో..
Comments
Please login to add a commentAdd a comment