
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 42 కు పెంచాలని కోరుతూకేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నియామకానికి అనుమతించారని లేఖలో పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం హైకోర్టులో 14 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని కిషన్ రెడ్డి కేంద్రమంత్రికి తెలియజేశారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోందని, ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే జడ్జిల సంఖ్యను పెంచాలని కిషన్ రెడ్డి కేంద్రన్యాయ శాఖ మంత్రిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment