ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: గతేడాది దేశంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 18-30 మధ్య వయస్కులే అధికంగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా బలవన్మరణానికి పాల్పడిన వారిలో 23.4 శాతం రోజూవారీ కూలీలేనని పేర్కొంది. వీరి తర్వాత 15.4 శాతంతో గృహిణులు రెండోస్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో స్వయం ఉపాధి పొందుతున్న వారు(11.6 శాతం), నిరుద్యోగులు( 10.1 శాతం) ఉన్నట్లు వెల్లడించింది. అదే విధంగా బలవన్మరణానికి పాల్పడుతున్న వారిలో అత్యధిక మంది పురుషులే ఉన్నట్లు పేర్కొంది. ఇక దేశ వ్యాప్తంగా కుటుంబ సమస్యల వల్లే అత్యధికంగా 32.4 శాతం బలవన్మరణాలు సంభవించగా.. అనారోగ్య కారణాల వల్ల 17.1 శాతం మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది.(చదవండి: ‘నువ్వేనా నీ భార్యను చంపింది.. ‘అవును’)
కాగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 18, 916 మంది ఆత్మహత్య చేసుకోగా, 13,493 బలన్మరణాలతో తమిళనాడు రెండోస్థానంలో ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. 12 వేలకు పైగా గణాంకాలతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో నిలవగా.. మధ్యప్రదేశ్(12457), కర్ణాటక (11,288) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... 2019లో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 7675గా ఉంది. వారిలో 2858 మంది కూలీలు కాగా.. 499 మంది రైతులు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 6465 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.(చదవండి: హత్యలు 80 రేప్‌లు 91 కిడ్నాప్‌లు 289)
Comments
Please login to add a commentAdd a comment