రేషన్ కోసం ప్రత్యేక యాప్ లాంచ్ చేసిన కేంద్రం | Mera Ration App: How To Download, Use And Register In Android Ration App | Sakshi
Sakshi News home page

రేషన్ కోసం ప్రత్యేక యాప్ లాంచ్ చేసిన కేంద్రం

Published Mon, Mar 15 2021 7:14 PM | Last Updated on Mon, Mar 15 2021 7:58 PM

Mera Ration App: How To Download, Use And Register In Android Ration App - Sakshi

కేంద్ర ప్రభుత్వం రేషన్ వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను "మేరా రేషన్" అనే పేరుతో లాంచ్ చేసింది. దేశంలో ‘వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్’ పథకం కోసం ఈ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. రేషన్ కార్డు గలవారు కొత్త ఇంటికి మారిన లేదా ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నప్పుడు దగ్గరలోని రేషన్ కేంద్రాలను ఈ యాప్ సహాయంతో గుర్తించవచ్చు. మొత్తం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పోర్టబులిటీని ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లిన అక్కడ కూడా రేషన్ పొందవచ్చు.

ఈ యాప్ ద్వారా దగ్గరలోని రేషన్ కేంద్రాలలో రేషన్ తీసుకోవడానికి తమకు అర్హత ఉందా లేదా అనే విషయంతో పాటు, ఇప్పటిదాకా తీసుకున్న రేషన్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. దీన్ని జాతీయ సమాచార కేంద్రం(ఎన్ఐసీ) రూపొందించింది. ప్రస్తుతానికి ఈ యాప్ ఇంగ్లిష్, హిందీల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో దీన్ని 14 వేర్వేరు భాషల్లో అందించనున్నారు. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకానికి మీరు అర్హులో కాదో తెలుసుకోవడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. దాని కోసం Eligibility Criteriaను ఎంచుకుని కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాలి. ఒక్కసారి రిజిస్టర్ చేసుకున్నాక మీరు అర్హులైతే మీకు ఆహారధాన్యాలను కేటాయిస్తారు. మీకు మంజూరైన ఆహార ధాన్యాలు, గత ఆరు నెలల్లో తీసుకున్న ఆహారధాన్యాల వివరాలు ఈ యాప్‌లో కనిపిస్తాయి. దీంతో రేషన్ కార్డు దారులు తమకు ఎంత ఆహారధాన్యాలు వచ్చాయో షాప్‌కి వెళ్లి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, యాప్‌లోనే చూసుకోవచ్చు.

చదవండి:

సామాన్యుల కోసం ఎల్ఐసీ సరికొత్త భీమా పాలసీ

ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement