న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ కూడా అక్కడికి చేరుకున్నారు. గుజరాత్ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించడంతో బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులతో కలిసి ప్రధాని మోదీ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. మోదీ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. పార్టీ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచామన్నారు. గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని నిరూపించారన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తుందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు భవిష్యత్తు విజయాలకు సంకేతమన్నారు. హిమాచల్‌లో ఒక శాతం ఓట్లే గెలుపోటములను డిసైడ్ చేశాయని తెలిపారు. హిమాచల్ అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు.
చదవండి: హిమాచల్ ఫలితాలు: కాంగ్రెస్ విజయంపై స్పందించిన ఖర్గే
Comments
Please login to add a commentAdd a comment