న్యూఢిల్లీ: ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 11 మధ్య 736 మంది అఫ్గానిస్తానీల దరఖాస్తులు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని శరణార్థుల విభాగం (యూఎన్‌హెచ్‌సీఆర్)లో నమోదయ్యాయని బుధవారం వెల్లడించింది. ఇవి భారత్‌లో ఉండేందుకు అఫ్గాన్‌వాసులు పెట్టుకున్న దరఖాస్తులని చెప్పింది. భారత్‌లో ఉన్న అఫ్గానిస్తాన్ వాసుల వీసాలు ముగిసిన వారు, తిరిగి వెళ్లాల్సిన వారు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. యూఎన్‌హెచ్‌సీఆర్ వద్ద ఉన్న డేటా ప్రకారం మొత్తం 43,157 మందికి భారత్ నుంచి సాయం అందాల్సిన అవసరం ఉందని, అందులో 15,559 మంది అఫ్గాన్ శరణార్థులని చెప్పింది. 2021లో కొత్తగా భారత్ వచ్చిన వారు విద్యార్థి, వ్యాపారవేత్త, సాధారణ, మెడికల్ వీసాలను ఇచ్చే ప్రక్రియ తిరిగి ప్రారంభమవ్వాలని చూస్తున్నారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదని యూఎన్‌హెచ్‌సీఆర్ తెలిపింది. శరణార్థుల కోసం 24/7 హెల్ప్ లైన్ ప్రారంభించినట్లు తెలిపింది. రోజుకు 130కి పైగా ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment