కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా దేశమంతటా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ ఈ పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటికే 13 విడతల్లో రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కాగా.. తాజాగా 14వ విడత ఎప్పుడు విడుదల కానుందా అనేదానిపైనే అందరి దృష్టి నెలకొని ఉంది.
2019లో ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. దీని ద్వారా భారతదేశంలోని లక్షల మంది రైతులకు ఆర్థిక మద్దతు లభిస్తోంది. రూ. 6వేల వార్షిక వాయిదా ద్వారా రైతుల ఖాతాలోకి నగదు చేస్తోంది మోదీ సర్కార్. అయితే ఇప్పటికే 13వ విడత రుణమాఫీ పూర్తి కావడంతో 14వ విడత నగదు ఎప్పుడు తమ ఖాతాలో జమ అవుతుందని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పీఎం కిసాన్ తదుపరి విడతను రైతుల బ్యాంకు ఖాతాలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు, ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన రైతులు ఒక్కొక్కరికి ₹2000 చొప్పున 13 చెల్లింపులు పూర్తి అయ్యాయి. అయితే, 14వ విడత నగదు విడుదలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా రైతులు వారి ఖాతాలో నగదు జమ కావాలంటే ఈకేవైసీని తప్పనిసరి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
మొదటగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in లోకి లాగిన్ అవ్వాలి.
అధికారిక వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఫార్మర్స్ కార్నర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
తరువాత పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్‌లో అడిగిన వివరాలు నమోదు చేయండి
వన్-టైమ్ పాస్‌వర్డ్ కోసం గెట్ ఓటిపి అనే బటన్ పై క్లిక్ చేయండి.
మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయగలరు.
అనంతరం మీరు పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment