వారణాసి: భావి భారత పౌరులైన బాలికల భవిష్యత్‌ను నిర్దేశించే వారి విద్యపై, నైపుణ్యాభివృద్ధిపై ప్రజలు ప్రధానంగా దృష్టిసారించాలని ప్రధాని మోదీ హితవు పలికారు. మంగళవారం వారణాసిలో సద్గురు సదాఫల్‌దేవ్ విహంగం యోగా సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాశీలోని ఉమ్రాహాలో ఉన్న స్వర్‌వేద్ మహామందిర్ ఆలయంలో సద్గురు సదాఫల్‌దేవ్, స్వతంత్రదేవ్ మహరాజ్, విజ్ఞాన్‌దేవ్ మహరాజ్‌లకు నివాళులర్పించారు.
‘స్వాతంత్య్ర సంగ్రామంలో సద్గురు సదాఫల్‌దేవ్ వంటి ఎందరో సాధువులు ఎంతగానో తోడ్పాటునందించారు. కానీ, వారి కృషికి చరిత్రలో సరైన గుర్తింపు లభించ లేదు’అని మోదీ వ్యాఖ్యానించారు. ‘భారత్ అద్భుతమైంది. సమయం అనుకూ లించని వేళా సమకాలిన ప్రపంచ గతిని మార్చే అసమాన సద్గురువులు ఇక్కడ నడయాడారు. స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపించిన నేతను ‘మహాత్మా’గా ప్రపంచం కీర్తించిం ది’అని మోదీ గాంధీజీని ప్రస్తావించారు.
‘సబ్‌కా ప్రయాస్’స్ఫూర్తిని అందరూ స్వీకరించాలన్నారు. తమ కుటుంబంతోపాటు సమాజ బాధ్యతను తమదిగా భావించే వారు తోచినంతలో ఒకరిద్దరు నిరుపేద బాలికల విద్య, నైపుణ్యాభివృద్ధి బాధ్యతలను తీసుకో వాలన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న వేళ.. స్వపరిపాలన ఎంత ముఖ్యమో సుపరిపాలనా అంతే ప్రధానమన్నారు. సోమవారం అర్ధరాత్రి దాటా క మోదీ కాశీ సుందరీకరణ పనులను స్వయం గా వెళ్లి పర్యవేక్షించారు. బెనారస్ రైల్వేస్టేషన్ నవీకరణ పనులపై ఆరాతీశారు. సుపరిపా లనపై 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కాశీలో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment