
న్యూఢిల్లీ: ఎర్రకోట హింసాత్మక ఘటనలో పోలీసులు పేర్కొంటున్న మరో మోస్ట్ వాటెండ్ ఎట్టకేలకు చిక్కాడు. గణతంత్ర దినోత్సవం నాటి ఘటనలో మనీందర్ సింగ్‌ను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పీటమ్‌పురాలోని అతని నివాసం నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలకు సబంధించి ఇప్పటికే దీప్ సిద్దూ, ఇక్బాల్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నవంబరు 26 నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే రైతు సంఘాలు, జనవరి 26 న ట్రాక్టర్ ర్యాలీ కి పిలుపునిచ్చాయి. ఢిల్లీ పోలీసులు దీనికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. కానీ కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొట్టి, ర్యాలీ హింసాత్మకంగా మారేలా ప్రేరేపించారు. వారు నినాదాలు ఇచ్చుకుంటూ, బారికేడ్లను తొసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. వీరు పోలీసుల విధులను ఆటంకపరచటమే కాకుండా ఉద్యమాన్ని హింసవైపు ప్రేరేపించి, ఎర్రకోటపై ఖలీస్తాని జెండాను ఎగురవేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దేశ ఖ్యాతిని పలుచన చేశారని విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment