
గాంధీనగర్ : ‘సవాళ్లను స్వీకరించాలి, పోరాడాలి, ఓడించాలి.. సమస్యల్ని పరిష్కరించాలి అప్పుడే విజయం సాధిస్తాం. 1922-47 కాలంలోని యువకులు స్వాతంత్రం కోసం అన్నింటిని త్యజించారు. దేశం కోసం జీవించండి. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగమై.. బాధ్యతను అలవరుచుకోండి. బాధ్యత ఉన్న వారే జీవితంలో విజయం సాధిస్తారు’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం గుజరాత్, గాంధీనగర్‌లోని పండిత్ దీనదయాల్ పెట్రోలియం యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మోనోక్రిష్టలైన్ సోలార్ ఫొటోవోల్టైక్ పానెల్’, ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ వాటర్ టెక్నాలజీ’లకు భూమి పూజ చేశారు. ( ఇక వారు కూడా ఆపరేషన్లు చేయొచ్చు! )
‘ఇనోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్- టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ ’, ‘ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్ సెంటర్’, స్పోర్ట్స్ కాంప్లెక్స్’ లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేడు దేశంలో ఎనర్జీ విభాగం, ఉద్యోగాలు, ఉద్యోగ కల్పన వేగంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. సహజ వాయువుల వినియోగాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో చమురు శుద్ధి సామర్థ్యాన్ని రెండింతలు పెంచుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment