‘మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కోల్పడంలో క్రియాయోగాది అద్భుత పాత్ర’ | Sri Sri Swami Chidananda Giri Specch At Yogoda Satsanga Society | Sakshi
Sakshi News home page

‘మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కోల్పడంలో క్రియాయోగాది అద్భుత పాత్ర’

Feb 26 2023 6:32 PM | Updated on Feb 26 2023 6:36 PM

Sri Sri Swami Chidananda Giri Specch At Yogoda Satsanga Society - Sakshi

ఢిల్లీ:  మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కోల్పడంలో క్రియాయోగా సాధనదే ప్రధాన పాత్ర అని యోగధా సత్సంగ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు శ్రీశ్రీ స్వామి చిదానంద గిరి పేర్కొన్నారు. యోగదా సత్సంగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్మాత్మిక కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి శ్రీశ్రీ స్వామి చిదానంద గిరి ప్రసంగించారు. ‘మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కొల్పడంలో క్రియాయోగ సాధనది అద్భుత పాత్ర. ఒడిదుడుకుల జీవన గమనంలో తీవ్రమవుతున్న ఆందోళన, ఆత్రుత, అసహనం వంటి రుగ్మతలను తొలగించే శక్తి క్రియా యోగాకు ఉంది. ప్రేమ, శాంతి, సహనం, సుహృద్భావం, అవగాహన వంటి సాత్విక గుణాలను వృధ్ధి చేయడంలో క్రియాయోగ పాత్ర విశిష్టమైంది.

క్రియాయోగ సాధన ద్వారా అంతరంగ శుధ్ధి, ఆధ్యాత్మిక వృధ్ధి, లక్ష్య సిధ్ధి సులువుగా సాధ్యం. శరీరం, మెదడు, మనస్సులను అనుసంధానించే క్రియాయోగ ద్వారా అనేక సంక్లిష్టతలు, ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కోవడం సులువు. సానుకూల ఆలోచనా ధోరణిని, భవిష్యత్‌పై భరోసాను కల్పించే క్రియాయోగ, ధ్యానం, గురువుల భోధనల పుస్తకాలు నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. కనుబొమ్మల మధ్య దృష్టి కేంద్రీకరించి శ్వాస మీద ధ్యాసను నిలుపుతూ, దైవత్వంతో తన్మయత్వాన్ని ఆస్వాదిస్తూ సాగే  ఈ ప్రక్రియతో మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చు’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement