వచ్చే నెల 28న సుప్రీంలో ఏపీ రాజధాని కేసు | Supreme Court Sets March 28th To Hear AP Capital Issue | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 28న సుప్రీంలో ఏపీ రాజధాని కేసు

Published Mon, Feb 27 2023 11:15 AM | Last Updated on Mon, Feb 27 2023 2:03 PM

Supreme Court Sets March 28th To Hear AP Capital Issue - Sakshi

ఢిల్లీ: వచ్చే నెల 28వ తేదీన ఏపీ రాజధాని కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఏపీ రాజధాని కేసు త్వరగా విచారించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది మెన్షన్‌ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ తేదీ ఇచ్చింది. ఈ కేసును జస్టిస్‌ కెఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. 

కాగా, గతేడాది నవంబర్‌లో అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, దానిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిలో భాగంగా రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేం. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని సుప్రీం పేర్కొంది. 

రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement