capital city
-
ఇండోనేసియాకు కొత్త రాజధాని.. రాజధానిని మార్చిన దేశాలివే..!
ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి తరలిపోతోంది. బోర్నియో ద్వీపంలో నుసంతర పేరిట కొత్త రాజధాని నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేయింబవళ్లు పనులు కొనసాగిస్తోంది. ఈ కొత్త రాజధాని జకార్తాకు ఈశాన్యంగా 2 వేల కిలోమీటర్ల దూరంలో బోర్నియో ద్వీపంలో పచ్చని అటవీ ప్రాంతమైన కాలిమాంటన్లో కొలువుదీరనుంది. దీన్ని కాలుష్యరహిత, సతత హరిత నగరంగా రూపొందిస్తున్నారు. అయితే దీనిపై పర్యావరణవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త రాజధాని నిర్మాణంతో ఆ ప్రాంతంలో అటవీ సంపద తరిగిపోయి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా పోతుందని, పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని వారంటున్నారు. జకార్తా ఇసుకవేస్తే రాలనంత జనాభాతో కిటకిటలాడుతోంది. రాజధానిలో కోటి మందికి పైగా జనాభా నివసిస్తారు. మెట్రోపాలిటన్ ప్రాంతాన్నీ కలిపితే 3 కోట్ల దాకా ఉంటారు. భరించలేని కాలుష్యం రాజధాని వాసుల్ని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో జకార్తా అగ్ర భాగంలో ఉంటోంది. ఇక అత్యంత వేగంగా కుంగిపోతున్న నగరాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2050 నాటికి జకార్తాలో మూడింట ఒక వంతు సముద్రంలో మునిగిపోతుంది. దీనికి తోడు ఇండోనేసియాకు భూకంపాల ముప్పు ఉండనే ఉంది. అన్నింటి కంటే రాజధాని మార్పుకు మరో ముఖ్య కారణం అడ్డూ అదుపు లేకుండా భూగర్భ జలాల వెలికితీయడం. దీనివల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడి వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఏటా 450 కోట్ల డాలర్లు నష్టం వాటిల్లితోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జకార్తా నుంచి బోర్నియోకు రాజధానిని మార్చేయాలని అధ్యక్షుడు జోకో విడొడొ గతేడాది ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించారు. పర్యావరణవేత్తలు ఏమంటున్నారు? కొత్త నగర నిర్మాణ ప్రాంతం అరుదైన వృక్షజాలం, జంతుజాలానికి ఆలవాలం. ఇప్పుడు వాటి ఉనికి ప్రమాదంలో పడనుంది. నగర నిర్మాణానికి చెట్లను కూడా భారీగా కొట్టేస్తున్నారు. రాజధాని కోసం ఏకంగా 2,56,142 హెక్టార్ల అటవీ భూమిని సేకరిస్తున్నారు. ఇవన్నీ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపేవే. పైగా ఈ అడవుల్లో దాదాపుగా 100 గిరిజన తెగలు నివాసం ఉంటున్నాయి. వారందరికీ పునరావాసం, నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అన్నీ సరిగ్గా అమలయ్యే అవకాశం లేదన్న ఆందోళనలున్నాయి. రాజధానిని మార్చిన దేశాలివే..! గతంలో ఎన్నో దేశాలు పలు కారణాలతో రాజధానుల్ని మార్చాయి... ► రాజధాని దేశానికి నడిబొడ్డున ఉండాలన్న కారణంతో బ్రెజిల్ 1960లో రియో డిజనిరో నుంచి బ్రెసీలియాకు మార్చింది. ► 1991లో నైజీరియా లాగోస్ నుంచి అబూజాకు రాజధానిని మార్చుకుంది. ► 1997లో కజకిస్తాన్ కూడా అల్మటి నుంచి నూర్–సుల్తాన్‌కు రాజధానిని మార్చింది. కానీ ఇప్పటికీ అల్మటీయే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ► మయన్మార్ రంగూన్ నుంచి రాజధానిని నేపిడాకు మార్చింది. కొత్త రాజధాని ఎలా ఉంటుంది? కొత్త రాజధాని నిర్మాణాన్ని అధ్యక్షుడు విడొడొ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక సుస్థిర నగరంలో అందరూ కొత్త జీవితాల్ని ప్రారంభించాలని ఆయన ఆశపడుతున్నారు. ఫారెస్ట్ సిటీ కాన్సెప్ట్‌తో హరిత నగరాన్ని నిర్మించనున్నారు. నగరంలో 65% ప్రాంతంలో ఉద్యానవనాలే ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని స్మార్ట్ నగరంగా కూడా తీర్చిదిద్దనున్నారు. సౌర విద్యుత్, జల సంరక్షణ విధానాలు, వ్యర్థాల నిర్వహణ వంటివన్నీ కొత్త సాంకేతిక హంగులతో ఉంటాయి. ప్రస్తుతానికి ఐదు గిరిజన గ్రామాలను ఖాళీ చేయించి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ ఏడాది 184 ప్రభుత్వ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త రాజధాని నుసంతరను అటవీ నగరం కాన్సెప్ట్‌తో ప్రణాళికాబద్ధంగా కడుతున్నాం. 65% ప్రాంతం పచ్చదనానికే కేటాయిస్తున్నాం. 2024 ఆగస్టు 17 స్వాతంత్య్ర దిన వేడుకలను కొత్త రాజధానిలో జరిపేలా సన్నాహాలు చేస్తున్నాం. – బాంబాంగ్ సుసాంటొనొ, నుసంతర నేషనల్ కేపిటల్ అథారిటీ చీఫ్ అధ్యక్ష భవనం నమూనా కొత్త రాజధాని నిర్మాణ అంచనా వ్యయం: 3,200 కోట్ల డాలర్లు రాజధాని నిర్మాణంలో ప్రైవేటు పెట్టుబడులు: 80% ఈ ఏడాది నిర్మాణం జరుపుకునే భవనాలు: 184 ప్రస్తుతం నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు: 7 వేలు తొలి దశలో తరలివెళ్లే ప్రజలు సంఖ్య: 15 లక్షలు అధ్యక్ష భవనం నిర్మాణం పూర్తయ్యేది: 2024 ఆగస్టు 17 (దేశ స్వాతంత్య్ర దినోత్సవం) రాజధాని నుసంతర నిర్మాణం పూర్తయ్యేది: 2045 ఆగస్టు 17 (దేశ వందో స్వాతంత్య్ర దినం) – సాక్షి, నేషనల్ డెస్క్ -
వచ్చే నెల 28న సుప్రీంలో ఏపీ రాజధాని కేసు
ఢిల్లీ: వచ్చే నెల 28వ తేదీన ఏపీ రాజధాని కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఏపీ రాజధాని కేసు త్వరగా విచారించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది మెన్షన్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ తేదీ ఇచ్చింది. ఈ కేసును జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. కాగా, గతేడాది నవంబర్‌లో అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, దానిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిలో భాగంగా రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేం. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని సుప్రీం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. -
అది పాదయాత్ర కాదు.. ఉత్తరాంధ్రపై దండయాత్ర
గాజువాక: పరిపాలన రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ విద్యార్థులు నినదించారు. పరిపాలన రాజధానికి మద్దతుగా స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో గాజువాకలో బుధవారం ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కాంతారావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో చేపట్టిన పాదయాత్ర పెట్టుబడిదారుల పాదయాత్ర అని, అది చంద్రబాబు బినామీల పాదయాత్ర అని.. అది ఉత్తరాంధ్రపై దండయాత్రగా చెప్పారు. చంద్రబాబు బినామీలు, ఆయన సామాజికవర్గానికి చెందినవారు అమరావతిలో భూములు కొనుగోలు చేశారని, వారి అభివృద్ధి కోసం ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని ఓర్వలేక ఈ ప్రాంత ప్రజలపై చంద్రబాబు దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రను విశాఖలోకి రానిచ్చేదిలేదని, పాయకరావుపేట దగ్గర అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడి నేతలు పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతు ప్రకటించాలని, లేకుంటే ఆయా నేతల ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంతారావు స్పష్టం చేశారు. గీతం విద్యా సంస్థల అధిపతి భరత్ అమరావతికి మద్దతు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, గీతం ద్వారా ఉత్తరాంధ్రలో కోట్లాది రూపాయలు సంపాదించుకుని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడటం హేయమైన చర్యని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నవీన్‌దాస్, సోమశేఖర్, బాలాజీ, ఉదయ్, జాని, చందు, రాఘవ, వివేక్, జగదీష్, సన్ని తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి: బుగ్గన
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఏపీ ఆర్థిక, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా æ అన్ని ప్రాంతాలకు భాగస్వామ్యం ఉండాలన్నారు. పరిపాలన వికేంద్రీకరణ–సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధికి ఇంజన్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను పలు రాష్ట్రాలు రాజ«ధానిలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వికేంద్రీకరణతో అభి వృద్ధికి ఊతమిచ్చాయని తెలిపారు. ఉమ్మడి ఏపీలో మాత్రం అన్ని కేంద్ర సంస్థలను హైదరాబాద్‌లోనే నెల కొల్పడంతో అభివృద్ధి చెందిన ప్రాంతవాసులే విభజన ఉద్యమాన్ని నిర్వహించి సాధించుకున్నారని గుర్తు చేశారు. దీనివల్ల భాషా ప్రతిపదికన ఏర్పడిన ఏపీ 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ విభజన వాదం రాకూడదంటే వికేంద్రీకరణ అవసరాన్ని శివరామకృష్ణన్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. వికేంద్రీకరణ ఎంతో అవసరమన్న కమిటీ.. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1956లో ఆంధ్ర ప్రదేశ్‌గా అవతరించింది. 50–60 ఏళ్లలో ఎన్నో సంఘట నలు జరిగాయి. చరిత్ర అనుభవాల నుంచి మనం నేర్చు కున్న పాఠాలను పరిపాలనలో అన్వయించాల్సిన అవస రం ఉంది. హైదరాబాద్ ఒక మహానగరంగా ఏర్పడినందు వల్లే వేర్పాటువాదం వచ్చిందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సారాంశం. విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఎంతో విలువైనది. రాష్ట్రానికి వికేంద్రీకరణ ఎంతో అవ సరమని, పలు ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాలో అందులో సూచించారు. మూడు పంటలు పండే విలువైన గుంటూరు, తెనాలి భూములను అనవసరమైన వాటికి వృథా చేయవద్దని కమిటీ పేర్కొంది. ఆ అనుభవాల నుంచి నేర్చుకుందాం.. ఇతర రాష్ట్రా లను చూసి మనం నేర్చుకోవా ల్సింది ఎంతో ఉంది. ఉమ్మడి ఏపీలో బీహెచ్ఈఎల్ లాంటి గొప్ప సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. అదే బీహెచ్ఈఎల్ను యూపీకిస్తే హరిద్వార్‌లోని కొండ ప్రాంతంలో నెల కొల్పారు. తమిళనాడు లోనూ తిరుచ్చిలో పెట్టారు. అక్కడ సేలం అభివృద్ధి చెందడానికీ ఇదీ ఓ కారణం. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థను ఇస్తే హైదరాబాద్‌లో పెట్టారు. ఒడిశా దీన్ని కోరాపుట్‌లో ఏర్పాటు చేయగా మహారాష్ట్ర ప్రభుత్వం నాసిక్‌లో ఏర్పాటు చేసింది. ఇదేవిధంగా షోలా పూర్లో టెక్స్టైల్స్, కొల్లాపూర్‌లో ఫౌండ్రీలు, అహ్మద్ నగర్లో ఆటోమొబైల్ సంస్థలు, పుణెలో ఆటో మొబైల్, సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చాయి. ముంబై కాస్మొ పాలిటన్ మహానగరంగా ఎదిగింది. ఇవన్నీ మనం గమనించాలి. మిగతా రాష్ట్రం ఏమైంది? ఐడీపీఎల్ పూర్వ ఉద్యోగుల వల్ల హైదరాబాద్‌లో వివిధ ఫార్మసీ సంస్థలు ఏర్పాటయ్యాయి. కేంద్రం ఇచ్చిన ఐడీపీ ఎల్‌ను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో నెలకొల్పితే బిహార్ ప్రభుత్వం ముజఫర్‌పూర్‌లో ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు ఐడీపీఎల్ ఇస్తే కొండ ప్రాంతం ఉన్న రిషికేశ్‌లో స్థాపించారు. హెచ్ఎంటీ, బీడీఎల్, ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మిథాని, ఎన్ఎండీసీ, ఎన్ఎఫ్సీ, ఎన్జీఆర్ఐ, ఎన్ఎఫ్డీపీ, డీఎంఆర్ఎల్, హెచ్ సీఎల్, బీఎల్ఆర్ఎల్, ఐఐసీటీ, సీసీఎంబీ, డీఆర్డీవో.. ఇలా అన్నీ తీసుకెళ్లి హైదరాబాద్‌లో పెట్టడం వల్ల గొప్ప నగరమైంది. మిగతా రాష్ట్రం ఏమైంది? మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక మాదిరిగా అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగలేదు. ఐఐటీ, ఐఎస్బీ, బిట్స్, టిస్ లాంటి ఉన్నతవిద్యాసంస్థలను హైదరాబాద్‌లోనే నెలకొల్పారు. అన్నీ ఒక్కచోటే కేంద్రీకరించడం వల్ల వేర్పాటువాదం ప్రారంభమైందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది. 2013–14లో విభజన నాటికి ఉమ్మడి రాష్ట్రంలో సాఫ్ట్వేర్ రంగం ఎగుమతుల విలువ రూ.56,500 కోట్లుగా ఉంది. ఇందులో ఒక్క హైదరాబాద్ నుంచే 56 వేల కోట్లు విలువైన వ్యాపారం జరిగింది. విభజన తర్వాతా అదే తప్పిదమా? రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు మళ్లీ అభివృద్ధిని కేంద్రీకతం చేసే బాటలో నడిచారు. శివ రామకృష్ణన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. కృష్ణా జిల్లాలా శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాలి. విజయనగరం జిల్లా గుంటూరుతో సమానంగా ఉండాలి. నెల్లూరుతో తుల తూగేలా చిత్తూరు ఉండాలనే ఆలోచన ఏ పాలకులకైనా వస్తుంది. కానీ చంద్రబాబుకు మాత్రం రాలేదు. బాహు బలి సినిమా మాదిరిగా 7,500 చదరపు కిలోమీటర్లలో రాజధాని ప్రాంతం పెట్టారు. ముంబైను గమనిస్తే థానే, కళ్యాణ్, నవీ ముంబై, ఉల్లాస్‌నగర్, మీరా అన్నీ కలిపినా 4,500 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. గత సర్కారు మిగిల్చిన భారీ అప్పులు, పెండింగ్ బకాయిలతోపాటు రెండేళ్లుగా కోవిడ్‌తో అల్లాడుతున్నాం. వారు (టీడీపీ) అధికారంలో ఉంటే రాజధానిని అభివృద్ధి చేసేవారట. ముంబైకి రెండింతల నగరాన్ని కడతారంట. 33 వేల ఎకరాలను అమాయకుల నుంచి తీసుకున్నది గాక వేల ఎకరాల అటవీ భూమి కూడా కావాలని ప్రతిపాదన పెట్టారు. 50 వేల ఎకరాల్లో రోడ్లు, కాల్వలు, కరెంట్ లాంటి కనీస వసతులకే రూ.లక్ష కోట్లు అవసరమవు తాయి. ఇది ప్రభుత్వం చేయగల పనేనా? 2019లో అధి కారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్ జగన్ నిపుణుల కమిటీని నియమించి నివేదిక కోరారు. బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపుతో అధ్యయనం నిర్వహించారు. రాష్ట్రమంతా అభి వృద్ధి చెందాలని, శ్రీకాకుళంలో మారుమూల గ్రామంలోని రైతు కూడా బాగుండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. బాబు ఆలోచన సరికాదని తేలింది.. వికేంద్రీకరణ తప్పనిసరిగా చేపట్టాలని జస్టిస్ శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీలు స్పష్టం చేశాయి. దీంతో చంద్రబాబు ఆలోచన తప్పని తేలింది. వికేంద్రీకరణలో భాగంగా లోకల్ జోన్లు, బోర్డులు నెలకొల్పి ఉత్తరకోస్తా, కోస్తాంధ్ర, రాయల సీమను అభివృద్ధి చేస్తూనే శాసనసభ అమరావతిలో, సచి వాలయం విశాఖలో, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాయలసీమలో ఉండాలని ప్రభుత్వం భావిస్తే టీడీపీ తప్పుబడుతోంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందరం కలిసి ఉండాలి. కర్నూలు నుంచి నాడు రాజ ధానిని హైదరాబాద్‌కు తరలించిన విషయాన్ని మరవద్దు. భాగస్వాములతోనూ చర్చిస్తాం.. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. భాగస్వాముల తోనూ చర్చిస్తాం. ఎవరైతే ఒక శాతమో, రెండు శాతమో ప్రలోభాలకు లోనయ్యారో వారి ప్రశ్నలకూ సమాధానం చెబుతాం. హేతుబద్ధంగా సమాధానమిస్తాం. అన్ని ప్రాంతాలవారు భాగస్వామ్యలయ్యేలా, రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో నడిపేలా పరిపాలన వికేంద్రీకరణ– సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టాం. -
మరింత మెరుగ్గా వికేంద్రీకరణ బిల్లు
ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సోమవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అనంతరం రాజధాని వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై సభలో సీఎం మాట్లాడుతూ మరింత స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సమతుల అభివృద్ధే ధ్యేయంగా వికేంద్రీకరణ బిల్లును మరింత సమగ్రంగా మళ్లీ సభ ముందుకు తెస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు రాజధాని వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనానికీ ఈ విషయాన్ని ఏజీ శ్రీరామ్ వివరించారు. మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లును మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ విస్తృతంగా తెలియచేసేందుకు... ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా జోడించేందుకు గతంలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుని అన్ని అంశాలతో పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లును త్వరలోనే మళ్లీ సభ ముందుకు తెస్తాం. రాష్ట్ర విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’’ అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఈ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వాటిని ఆవిష్కరించింది కాబట్టే రెండున్నరేళ్లుగా ఏ ఎన్నికల్ని తీసుకున్నా మనసారా దీవిస్తూ వచ్చారు’’ – అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని సమతుల అభివృధ్ధే లక్ష్యంగా వికేంద్రీకరణ బిల్లును సమగ్రంగా మళ్లీ సభ ముందుకు తెస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. వికేంద్రీకరణ బిల్లును ఆమోదిం చిన వెంటనే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈపాటికే సత్ఫలితాలు వచ్చి ఉండేవన్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కన పెట్టి కొంతమందికి అన్యాయం జరుగుతోందనే వాదనను ముందుకు తెచ్చి కొందరు రకరకాల అపోహలు, అను మానాలు, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వికేంద్రీకరణ బిల్లును ఉపసంహ రించుకోవడానికి దారి తీసిన పరిస్థితులను సోమవారం శాసనసభలో సీఎం జగన్ సోదాహరణంగా వివరించారు. కేంద్రీకరణ ధోరణులను నిరసిస్తూ హైదరాబాద్ లాంటి సూపర్ కేపిటల్ వద్దని 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సుస్పష్టమైన చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకే వికేంద్రీకరణ వైపు అడుగులు వేశామని వివరించారు. రాష్ట్ర ప్రజల విస్తృత, విశాల ప్రయోజనాల కోసం వికేంద్రీకరణ బిల్లును సమగ్రంగా రూపొందించి మళ్లీ సభ ముందుకు తెస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ... శ్రీకృష్ణ కమిటీ నివేదిక తుంగలోకి.. 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉంది. ఆ రోజుల్లో హైకోర్టు గుంటూరులో ఉండేది. 1956లో దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసినప్పుడు కర్నూలు నుంచి రాజధానిని, గుంటూరు నుంచి హైకోర్టును హైదరా బాద్‌కు తరలించారు. ప్రజల ఆకాంక్షలు, శ్రీబాగ్ ఒడం బడికను పరిగణలోకి తీసుకుని రాయలసీమకు న్యాయం చేస్తామని అప్పట్లో చెప్పారు. విభజన తర్వాత ఈ ప్రాంతంలో (అమరావతి) రాజధాని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఎంత వివాదాస్పమైందో అందరికీ తెలుసు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను అన్ని రకాలుగా ఉల్లంఘించి రాజధానిపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలుసు. ఈ ప్రాంతం(అమరావతి)లో 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని టీడీపీ హయాంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం ధర్మమేనా? గత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదని ఈరోజు కూడా చెబుతున్నా. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ కూడా. కానీ ఒక్కటి ఆలోచన చేయాలి. ఈ ప్రాంతం అటు విజయవాడకు దగ్గర కాదు.. ఇటు గుంటూరుకు కూడా దగ్గర కాదు. ఇక్కడ నుంచి గుంటూరు తీసుకుంటే 40 కిలోమీటర్లు. విజయవాడ తీసుకుంటే మరో 40 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ, కరె ంట్ లాంటివి ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. 50 వేల ఎకరాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుందని అప్పట్లోనే లెక్కలు వేశారు. రూ.లక్ష కోట్లు అనేది ఈరోజు లెక్కల ప్రకారమే. రూ.లక్ష కోట్లు తెచ్చి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి పదేళ్లు పడుతుందో, ఇంకా ఎక్కువ కాలం పడుతుందో తెలియదు. కానీ ఇవాళ రూ.లక్ష కోట్లు ఖర్చయ్యేది పదేళ్ల తరువాత రూ.ఆరు లక్షల కోట్లో, ఏడు లక్షల కోట్లో అవుతుంది. అంటే కనీసం రోడ్లు వేయడం, డ్రైనేజీల నిర్మాణం, కరెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మనం ఉంటే ఇక్కడ రాజధాని అనే ఊహాచిత్రం సాధ్యమవుతుందా? ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం ధర్మమేనా? ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిందేనా? అసలు మనకంటూ, మన పిల్లలకంటూ ఏదైనా ఉద్యో గాలు వచ్చే పరిస్థితి ఉన్న ఒక నగరం, ఒక ఎస్టాబ్లిష్మెం ట్ ఎప్పటికి వస్తుంది? చదువుకున్న మన పిల్లలు ఉద్యో గాల కోసం ఎప్పుడూ పెద్ద నగరాలైన హైదరా బాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్లాల్సిందేనా? ఎప్పటికీ మన పరిస్థితిలో మార్పు ఉండదా? అనే ఆలోచనల మధ్య రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖపట్నం కనిపించింది. విశాఖలో ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ, కరెంట్‌తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలున్నాయి. సుందరీకరణ, సదుపాయాలను మెరుగు దిద్దితే చాలు ఈరోజు కాక పోయినా ఐదేళ్లకో, పదేళ్లకో హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలతో విశాఖ పోటీ పడే పరిస్థితి కచ్చితంగా ఉంటుంది. అందరికీ మంచి జరగాలనే.. వాస్తవ పరిస్థితిని గుర్తెరిగి రాష్ట్రంలో మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్(కార్యనిర్వాహక రాజధాని), అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్(శాసన రాజధాని), కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్(న్యాయ రాజధాని) ఏర్పాటు చేసి వికేంద్రీకరణతో ప్రజలందరికీ మంచి జరగాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. ఈ పరిస్థితుల మధ్య రెండేళ్లలో ఏమేం జరిగాయో మన కళ్లముందే చూస్తున్నాం. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకర ణను వక్రీకరిస్తూ అపోహలు, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్న నేపథ్యంలో నేను ఈ ప్రకటన చేయాల్సి వస్తోంది. శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టాం. ప్రజల తీర్పుకు అనుగుణంగానే వికేంద్రీకరణ.. గత సర్కారు అనుసరించిన కేంద్రీకృత ధోరణులను ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్త మైంది. మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని, అలాంటి చారిత్రక తప్పి దానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజాతీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానమని బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం. -
అమరావతిలో మాయాబజార్ చూపించారు..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల సంక్షేమం కోసం ఏమాత్రం పట్టని చంద్రబాబు జూమ్ యాప్‌లోనే ఎక్కువగా కనబడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి రైతులను రెచ్చగొచ్చేలా బాబు ప్రయత్నిస్తున్నారని, అమరావతి అభివృద్ధి చెందితే రాష్ర్టం అభివృద్ధి చెందినట్లు కాదా అంటూ సజ్జల ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని సరికాదని నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా అమరావతి అంశం లేవనెత్తలేదని , కేవలం ఆయన స్వప్రయోజనాలకే రాష్ర్టంలో గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల బాబు పాలనలో అమరావతిలో మాయాబజార్ చూపించారని, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే రాజధానిగా అమరావతిని ఎంచుకున్నారు. బాబు నిర్ణయంతో ఎంతోమంది అమరావతి రైతులు నష్టపోయారని తెలిపారు. ('చంద్రబాబును నమ్మితే రాజకీయ సమాధి ఖాయం') -
ఆ బిల్లుల శాసన ప్రక్రియ ముగింపు కోసం వేచి చూస్తున్నాం
సాక్షి, అమరావతి: కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు తరలించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల ఉపసంహరణ బిల్లులకు సంబంధించిన శాసనపరమైన ప్రక్రియ ముగింపు కోసం వేచి చూస్తున్నామని హైకోర్టుకు నివేదించింది. ఆ తరువాత తగిన సమయంలో చట్ట నిబంధనలకు లోబడి తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించింది. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, వీటిని అడ్డుకోవాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ఆందోళన ఆధారంగా దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. దశలవారీ అమలుకు కట్టుబడి ఉన్నాం హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో దశల వారీగా మద్య నియంత్రణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. లాక్డౌన్ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలను నిషేధించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ధర్మాసనం ఎదుట ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపించారు. మద్య నిషేధం దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆదాయం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. తమిళనాడులో మద్యం షాపుల వద్ద అదుపు చేయలేని స్థాయిలో జనాలు ఉండటంతో మద్యం విక్రయాలను ఆపాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చిందని, అయితే రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
మూడు రాజధానులకే ఓటు
మూడు రాజధానులతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలని అఖిలాంధ్ర ప్రజానీకం నినదిస్తోంది. కొందరి రాజకీయ స్వార్థపు మాటలను పట్టించుకోనక్కర లేదని నినదించింది. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణతోనే సామాజిక, ఆర్థిక న్యాయం సాధ్యమవుతుందన్న శివరామకృష్ణన్, జీఎన్ రావు కమిటీలు, బోస్టన్ కన్సల్టెన్సీ నివేదికలను అమలు చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన సూచనలకు వాస్తవ రూపం ఇవ్వాలని విన్నవించింది. ఇటు అనంతపురం మొదలు అటు శ్రీకాకుళం వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు మూడు రాజధానులకు సై అంటూ ఉద్యమించారు.. ప్రతిపక్షనేత చంద్రబాబు కేవలం తన, తన బినామీల ఆస్తుల పరిరక్షణ కోసమే రాజధాని ప్రాంత రైతులను, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాంత అభివృద్ధికే పట్టు పడుతున్న చంద్రబాబు తీరును ఎండగడతామని, బస్సు యాత్రను అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు. పుట్టపర్తి టౌన్: పాలకుల నిర్లక్ష్యంతో రాయలసీమకు మొదటి నుంచీ అన్యాయం జరుగుతోందని రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక పేర్కొంది. పరిపాలన వికేంద్రీకరణకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేసింది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో లోచర్ల పెద్దారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి అ«ధ్యక్షతన బుధవారం రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. దీనికి ఆ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అయితే శ్రీభాగ్ ఒడంబడిక మేరకు కర్నూలుసహా రాయలసీమ ప్రాంతానికి మరింత న్యాయం చేయాలన్నారు. రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక సమావేశానికి హాజరైన నేతలు విశాఖలో మేధావుల ర్యాలీ ద్వారకానగర్ (విశాఖ): విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ మేధావులు, మహిళలు, విద్యార్థులు బుధవారం సాయంత్రం విశాఖలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో.. ఉత్తరాంధ్ర చైతన్య వేదిక కన్వీనర్ బలగప్రకాష్ మాట్లాడుతూ.. అన్ని హంగులు ఉండి పరిమిత వ్యయంతో రాజధాని నిర్మాణానికి అనుకూలమైన ఏకైక నగరం విశాఖ అన్నారు. ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్ శివశంకర్ మాట్లాడుతూ.. విశాఖలో వెంటనే కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి సహకారం ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి చెప్పారు. జీఎన్ రావు కమిటీ నివేదిక వెలువడిన వెంటనే ఎన్జీవో కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చించామని, మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతించాలని ఎన్జీవో సంఘం నిర్ణయించిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్‌ను కోల్పోయి కట్టుబట్టలతో రాష్ట్రానికి వచ్చామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరిగి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని అభిప్రాయపడ్డారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, పాలన వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు నెల్లూరు (బారకాసు): ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు స్పష్టం చేశారు. బుధవారం నెల్లూరు వచ్చిన ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని, అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాల్లో విస్తరింపజేయడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. విశాఖ, కర్నూలు నగరాల్లో పాలన విస్తరించడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఏపీ రాజధాని విషయంలో బీజేపీకి ఒక స్పష్టమైన విధానం ఉందన్నారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారు వుడా మాజీ చైర్మన్ డాక్టర్ రెహమాన్ ధ్వజం మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విషం కక్కుతున్నారని వుడా మాజీ చైర్మన్, విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉండి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన డాక్టర్ ఎస్.ఎ.రెహమాన్ ధ్వజమెత్తారు. వాస్తవాలను కప్పిపుచ్చుకోవడానికి రైతులను పక్కదారి పట్టించి ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆయన బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందన్నారు. ఏమాత్రం ప్రజాదరణ లేని తన కుమారుడిని అధికారంలో కూర్చోబెట్టడానికి కుట్రలు పన్నుతున్నారని, దీని కోసం అమరావతిని పావుగా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు స్వార్థానికి అమరావతి రైతులు బలవుతున్నారని విమర్శించారు. కేవలం గ్రాఫిక్స్‌తో ప్రజలకు జిమ్మిక్కులు చూపించిన చంద్రబాబు ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయడానికి సహాయపడతానని సీఎం వైఎస్ జగన్‌కి లేఖ రాయాలన్నారు. విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా మారితే త్వరలోనే ప్రపంచాన్ని తలదన్నే మహానగరంగా మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మంచి విజన్ కలిగిన నేత అని, అన్ని పథకాలు బడుగు, బలహీన వర్గాలకు చేరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఎల్.ఎన్.పేట: అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ బుధవారం శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కడపలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం కడప కార్పొరేషన్: మూడు రాజధానులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా కడపలో బుధవారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కోటిరెడ్డి సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ వల్లే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు, శవరాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించం చంద్రబాబుకు ఎంపీ నందిగం హెచ్చరిక సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయత్నిస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ హెచ్చరించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతులను రెచ్చగొట్టే చంద్రబాబు దుర్మార్గపు చర్యలు ఇక సాగవని చెప్పారు. ఆయన ఒక ప్రాంత, ఒక కులానికి నాయకుడిగా మిగిలిపోతున్నందుకు సిగ్గు పడాలన్నారు. అడుగడుగునా దుర్మార్గమైన వ్యక్తిగా, ఫ్యాక్షనిస్టుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల ముసుగులో టీడీపీ గూండాలు చేరి ఎమ్మెల్యేలపై హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కారు దిగి ఉంటే వారిని అంతమొందించేందుకు కూడా టీడీపీ గూండాలు వెనకాడే వారు కాదన్నారు. దోచుకున్న సొమ్ము కోసమే పోరాటం రాజధాని రైతులు భూముల కోసం, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అందరూ బాగుండాలని పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం దోచుకున్న సొమ్మును కాపాడుకోవటం కోసమే పోరాటం చేస్తున్నారని ఎంపీ విమర్శించారు. ధర్నా, బంద్ జరిగితే ఒక్క బస్సు, కారయినా తగలబడలేదా అని అడిగే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. రాజధాని రైతులకు సీఎం వైఎస్ జగన్ అన్నివిధాలుగా అండగా ఉంటారని చెప్పారు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు మూడు ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వైజాగ్‌ను అభివృద్ధి చేసి, కర్నూలులో హైకోర్టు పెడితే చంద్రబాబుకు వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. ఒక వ్యక్తి బాధపడితేనే చూస్తూ ఊరుకునే మనస్తత్వం సీఎం వైఎస్ జగన్‌ది కాదని, అలాంటిది 29 గ్రామాల్లోని రైతులు ఏ చిన్న ఇబ్బంది పడినా చూస్తూ ఎలా ఊరుకుంటారని, వారికి తగిన న్యాయం చేస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీలు రాజమహేంద్రవరం: మూడు రాజధానులే ముద్దు... ఎవరి మాటా వినొద్దంటూ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. పరిపాలన వికేంద్రీకరణను స్వాగతిస్తూ ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయా కూడళ్లలో మానవహారాలు చేపట్టారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగవరం మండలం కోటిపల్లిలో ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యండగండి, పామర్రు, తామరపల్లి, సత్యవాడ తదితర గ్రామాల్లో ఈ ర్యాలీ సాగింది. పాశర్లపూడి కొండాలమ్మచింత సెంటర్లో 216వ నంబర్ జాతీయ రహదారిపై స్థానికులు, ప్రభుత్వ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి మూడు రాజధానులకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మూడు రాజధానులను అందరూ స్వాగతించాలి రాజాం: మూడు రాజధానులను అందరూ స్వాగతించాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు కోరారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖకుకేటాయించడం సరైన నిర్ణయమన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని మాధవ బజార్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. -
మూడు రాజధానులు
-
కమిటీ నివేదిక వచ్చాకే స్పందిస్తాం
-
సొంత అజెండాతో సుజనా,కన్నా
-
రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం
సాక్షి, అమరావతి: రాజధాని విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో.. ఇప్పటికప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే.. రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ వేసిన పిటిషన్ అపరిపక్వమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించాకే తగిన విధంగా స్పందిస్తామని, జనవరి 21లోపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీఎన్ రావు కమిటీ, బోస్టస్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలను తమ ముందుంచాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 585ని సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి రామారావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కమిటీ నివేదికను అమలు చేయకుండా చూడాలని.. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటివన్నీ అమరావతిలోనే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రెండు అనుబంధ వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. భూముల అభివృద్ధి, రాజధానిపై నిర్ణయం వేర్వేరు అంశాలు: హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ, జీఎన్ రావు కమిటీ ఏర్పాటు జీవో, తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ జీవోలో ఎక్కడా సీఆర్డీఏ చట్టం ప్రస్తావన లేదన్నారు. దాని ప్రస్తావన లేకుండా రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఈ చట్టంలో ఎక్కడా నిర్ణీత కాల వ్యవధిలోగా భూముల్ని అభివృద్ధి చేసి ఇవ్వాలని లేదని.. రైతుల భూముల్ని అభివృద్ధి చేయడం గురించి మాత్రమే ఉందని పేర్కొంది. రైతుల భూములను అభివృద్ధి చేసి ఇవ్వడం, రాజధాని విషయంలో నిర్ణయాలు తీసుకోవడం వేర్వేరు అంశాలని వ్యాఖ్యానించింది. భూములిచ్చిన రైతులకు వారి భూములను అభివృద్ధి చేసి ఇవ్వడమే ముఖ్యమని, మిగిలిన భూమి విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను మీరెలా తప్పు పట్టగలరని ప్రశ్నించింది. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించకుండా.. తామెలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. ఇంకా బీసీజీ నివేదిక రావాల్సి ఉందని.. ఈ దశలో ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు. మా వాదనలూ వినండి ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలన్న జీఎన్ రావు కమిటీ సిఫార్సులను సమర్ధిస్తూ నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు హైకోర్టులో అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ధర్మాసనం ఈ వ్యాజ్యాలను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
క్యాపిటల్ మాయ
-
రాజధాని నిర్ణయం భేష్
-
క్యాపిటల్ స్కామ్!
-
రాజ్యాంగ సంస్థల వికేంద్రీకరణ చాలా అవసరం
-
వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
-
జకార్తా జలవిలయం!
జకార్తా: ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో శుక్రవారం కీలక ప్రకటన చేశారు. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ..‘దేశ రాజధానిని జకార్తా నుంచి బోర్నియో దీవిలోని కలిమంతన్కు తరలించేందుకు పార్లమెంటు అనుమతి కోరుతున్నాను. రాజధాని అంటే కేవలం ఓ జాతికున్న గుర్తింపు మాత్రమే కాదు. అది దేశం సాధించిన ప్రగతికి చిహ్నం కూడా’ అని విడోడో తెలిపారు. ఏకంగా అధ్యక్షుడే ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి చాలా ముఖ్యమైన కారణముంది. పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా జకార్తా సముద్రంలో శరవేగంగా మునిగిపోతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలుచర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితులే కొనసాగితే, 2050 నాటికి నగరంలోని మూడో వంతు ప్రాంతం సముద్రగర్భంలోకి జారిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో రాజధానిని తరలించాలని ఇండోనేసియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలకుల వైఫల్యమే శాపం.. కోటి మందికిపైగా ప్రజలు నివసిస్తున్న జకార్తా భూకంపాలు అధికంగా సంభవించే జోన్లో ఉంది. చిత్తడినేలపై నిర్మితమైన ఈ నగరానికి సమీపంలో 13 నదులు కలుస్తున్నాయి. పాలకులు జకార్తా నిర్మాణం సమయంలో తాగునీటి సరఫరాపై దృష్టి సారించకపోవడం ఈ నగరం పాలిట శాపంగా మారింది. నీటి సరఫరా జరగకపోవడంతో పరిశ్రమలు, ప్రజలు తమ అవసరాల కోసం బోర్లు వేసి భూగర్భ జలాన్ని విచ్చలవిడిగా తోడేశారు. స్థానిక జలాశయాల్లోని నీటిని కోలుకోలేని రీతిలో వాడేశారు. దీంతో చాలాచోట్ల భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దీనికితోడు రాజధాని కావడంతో పెద్దఎత్తున ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరిగింది. ఈ చర్యల కారణంగా జకార్తాలో భూమి క్రమంగా కుంగడం ప్రారంభమైంది. ప్రస్తుతం జకార్తాలో ఏటా 25 సెం.మీ. మేర భూమి కుంగిపోతోంది. కొన్నిచోట్లయితే నేల సముద్రమట్టానికి 4 మీటర్ల దిగువకు చేరుకుంది. భూతాపం కారణంగా సముద్రమట్టం పెరుగుతోంది. ఫలించని ప్రయత్నాలు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జకార్తాను కాపాడుకునేందుకు ఇండోనేసియా ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. జవా సముద్రం ఆటుపోట్లను అడ్డుకునేలా ఓ పొడవైన గోడతో పాటు కృత్రిమ దీవులను నిర్మించాలని అధ్యక్షుడు జోకో విడోడో ప్రతిపాదించారు. ఇందుకు రూ.2.84 లక్షల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులోభాగంగా ఇప్పటివరకూ 32 కిలోమీటర్ల మేర భారీ సముద్రపు గోడను, 17 కృత్రిమ దీవులను నిర్మించారు. అయితే ఇది సమస్యకు అనుకున్న పరిష్కారం చూపలేకపోయింది. ఈ భారీ సముద్రపు గోడ నుంచి చాలాచోట్ల నీరు ఊరటం ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల ఈ గోడే నేలలోకి కుంగిపోవడం ప్రారంభించింది. దీంతో రాజధానిని తరలించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చేసింది. అయితే జకార్తాలోని మూడోవంతు ప్రాంతం మునిగిపోతే లక్షలాది మంది ఇండోనేసియా ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. వీరందరికీ ఆశ్రయం కల్పించడం ఇండోనేసియా ప్రభుత్వానికి నిజంగానే సవాలుగా మారనుంది. -
ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ ఉత్తమం
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్–2018లో రాష్ట్రానికి 4 పురస్కారాలు లభించాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ రాష్ట్ర రాజధాని నగరంగా హైదరాబాద్ ఎంపికైంది. దక్షిణాదిన అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేటకు పురస్కారం దక్కింది. దేశంలోని 4,203 నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై సర్వే నిర్వహించి రూపొందించిన ‘స్వచ్ఛ సర్వేక్షన్–2018’ ర్యాంకులను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ పురి బుధవారం ఢిల్లీలో ప్రకటించారు. దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్ తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, భోపాల్, చండీగఢ్‌లు రెండు, మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. జాతీయ స్థాయిలో పలు అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 23 నగరాలకు పురస్కారాలు ప్రకటించగా, ఘన వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ రాజధాని నగరం కేటగిరీలో హైదరాబాద్‌కు పురస్కారం వరించింది. లక్ష పైన జనాభా ఉన్న నగరాలు, రాజధాని నగరాలను జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపిక చేయగా, లక్ష లోపు జనాభా ఉన్న నగరాలకు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, ఈశాన్య జోన్ల వారీగా కేంద్రం పురస్కారాలు ప్రకటించింది. దక్షిణ జోన్ పరిధిలో నాలుగు పట్టణాలకు పురస్కారాలు వరించగా, అందులో మూడు రాష్ట్రానికి సంబంధించినవే కావడం గమనార్హం. దక్షిణ జోన్ పరిధిలో అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేట, పౌరుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం అత్యుత్తుమ సిటీగా బోడుప్పల్, ఆవిష్కరణలు, ఉత్తమ విధానాల అమల్లో ఉత్తమ నగరంగా పీర్జాదిగూడలు ఎంపికయ్యాయి. -
హైకోర్టు సీమ కనీస హక్కు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడం కేవలం ఆ ప్రాంతపు అంశం కాదు. ఇది వారి న్యాయబద్ధమైన హక్కు. రాజధాని కోసం కర్నూలును ఎంపిక చేసినప్పుడు, సహజంగానే గుంటూరుకు హైకోర్టు వచ్చింది. ఇందుకోసం ఎవరూ ప్రత్యేకంగా గళం విప్పవలసిన అవసరం రాలేదు కూడా. ఈనాడు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసుకోవడమనేది ఒక ప్రాంతీయపరమైన అంశంగానో, కోస్తా ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకమన్న ధోరణిలోనో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎట్టకేలకు హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నది. గత నాలుగు సంవత్సరాలుగా తరలించకుండా అపడానికి ప్రధాన కారణం అక్కడ సరైన భవనాలు లేకపోవడమే. కానీ ఈరోజు అకస్మాత్తుగా విజయవాడలో భవనాలు ఉద్భవించాయి. ప్రభుత్వం తాత్కాలికంగా గానీ, శాశ్వత ప్రాతిపదికపైన గానీ హైకోర్టు కోసం కొత్తగా భవనాలు నిర్మించలేదు. ఇందుకోసం నాలుగు సంవత్సరాలుగా వెతుకుతున్నా కనిపించని అనువైన భవనాలు ఒక్కసారిగా లభ్యమైనాయి. జూన్, జులై కల్లా హైకోర్టు బదిలీ పక్రియ పూర్తిచేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగు వేస్తున్నది కూడా. దీనికి ప్రధాన కారణం–హైకోర్టు విభజనాంశం నాలుగేళ్లుగా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అవసరంగా మారింది. 2019 లోపల హైకోర్టు తరలి రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేం. ఈ తరుణంలోనే రాయలసీమ మేల్కొనవలసి ఉంది. ఇప్పటికైనా అక్కడి నాయకత్వం కదలి హైకోర్టును సీమలో ఏర్పాటు చేయవలసిన సహేతుకమైన కోరికను వినిపించకపోతే భవి ష్యత్తు తరాలవారు క్షమించరు. ఈ అంశాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక్కసారి ఇందుకు సంబంధించిన చారిత్రక నేప«థ్యాన్ని పరిశీలించాలి. ‘శ్రీబాగ్’ స్ఫూర్తి ఏమైనట్టు? 1920లో జరిగిన నాగ్‌పూర్ కాంగ్రెస్ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనితోనే మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగువారిలో ప్రత్యేక రాష్ట్ర ఆశలు చిగురించాయి. వెంటనే పరస్పర అపోహలు, అపనమ్మకాలు బయటపడ్డాయి కూడా. అంతవరకు చారిత్రకంగా ఒక ప్రత్యేక గుర్తింపు గలిగిన తాము, కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రరాష్ట్రంలో అల్ప సంఖ్యాకులుగా మిగిలిపోతామన్న అపనమ్మకం రాయలసీమ ప్రాంతీయులలో చోటు చేసుకున్నది. ఈ అపనమ్మకాలను రూపుమాపటానికి 16 నవంబర్ 1937న దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నివాసం ‘శ్రీబాగ్’(మద్రాస్)లో కోస్తా, రాయలసీమ పెద్దలు సమావేశమై ఒక ఒప్పం దానికి వచ్చారు. ఈ ఒప్పందం మీద రాయలసీమ తరఫున కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, సుబ్బరామిరెడ్డి, పప్పూరి రామాచార్యులు సంతకాలు చేశారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య, కొండా వెంకటప్పయ్య తదితరులు కోస్తా ఆం్ర«ధ తరఫున సంతకాలు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమలో రాజధాని, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అంగీకారానికి వచ్చారు. అంతేకాదు, ప్రాంతీయ సమతౌల్యాన్ని పాటిస్తూ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను, సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని కూడా అంగీకారానికి వచ్చారు. దాదాపు ఎనభై సంవత్సరాల తరువాత 2014లో శివరామకృష్ణన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కార్యకలాపాలను, సంస్థలను వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరించాలనే సూచించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తాము సూచించిన రీతిలో ఏర్పాటుచేయలేదని సీమ వాసులు మద్రాస్ విశ్వవిద్యాలయంలో భాగంగా ఉండటానికి 1926 నాటికే మొగ్గు చూపిన సంగతిని విస్మరించలేం. రాజధాని ఏర్పాటు– కొన్ని సత్యాలు ఈ చారిత్రక నేపథ్యంలో 1953లో పొట్టి శ్రీరాములు బలిదానం తరువాత జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. రాజధాని విషయంలో ముందుగానే ఒక అంగీకారానికి రావాలని ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రకాశం పంతులుకు సూచించారు కూడా. నెహ్రూ నుంచి ఈ రకమైన సూచన వెలువడడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం నెహ్రూకు ఇష్టంలేదు. ప్రప్రథమంగా ఆయన అంగీకరించిన భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్న వైవిధ్యంతో పాటు రాయలసీమ, కోస్తా ప్రాంతాల మధ్య ఉన్న విభేదాల గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అంశాన్ని వీరు అంత సులభంగా పరిష్కరించుకోలేరని ఆయనకు పరిపూర్ణమైన నమ్మకం. ఒకవేళ నాయకులు రాజ ధాని ఏర్పాటు గురించి ఏకాభిప్రాయానికి రాలేకపోతే భాషాప్రయుక్తరాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి అవరోధం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం మద్రాసులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. టంగుటూరి ప్రకాశం ఆత్మకథ ‘నా జీవనయాత్ర’లో ఆనాటి పరిణామాలను తెన్నేటి విశ్వనాథం కన్నులకు కట్టినట్టు పొందుపరిచారు (ప్రకాశం ఆత్మకథ చివరి భాగాలను తెన్నేటి విశ్వనా«థం పూర్తి చేశారు). మద్రాసులో ప్రకాశం ఏర్పాటు చేసిన సమావేశంలో కృషక్ పార్టీ నుంచి గౌతు లచ్చన్న, కమ్యూనిస్టు పార్టీ నుంచి నాగిరెడ్డి పాల్గొన్నారు. విశాఖపట్నాన్ని రాజధానిని చేయాలన్న తన ప్రతిపాదనను తెన్నేటి విశ్వనాథం ప్రకాశం సూచనతోనే విరమించుకున్నారు. గోదావరి జిల్లాల నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదు. గుంటూరు, విజయవాడ ప్రాంతం కోసం కమ్యూనిస్టులు పట్టుబట్టారు. తిరుపతిలో రాజధానిని ఏర్పాటు చేయాలనీ, లేకపోతే చిత్తూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలో ఉండిపోయే ప్రమాదం ఉందనీ గౌతు లచ్చన్న గట్టిగా అభిప్రాయపడ్డారు. కడపలోని భవనాల ఫోటోలు చూపి, కడప కోటిరెడ్డి కడపను రాజధానిని చేయాలని పట్టుబట్టారు. రాష్ట్ర ఏర్పాటులో ప్ర«ధాన భూమికను పోషిస్తున్నందువల్ల ఏ ప్రాంతాన్ని అందుకు ప్రతిపాదించ వద్దని నీలం సంజీవరెడ్డిని ముందుగానే ప్రకాశం కోరారు. అన్నిటికీ మించి రాయలసీమ ప్రజాప్రతినిధులందరూ ఒక పిటిషన్ రాసి సంతకాలు చేసి తమ దగ్గర పెట్టుకున్నారు. దాని సారాంశం ఏమిటంటే; రాజధాని రాయలసీమలో పెట్టకపోతే తమ ప్రాంతాన్ని మద్రాసు రాష్ట్రంలోనే ఉంచాలని. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఈ నిర్ణయాన్ని ప్రకాశం పంతులు గారికి వదిలేస్తూ అఖిలపక్షం తీర్మానించింది. ఆయన వారందర్నీ మధ్యాహ్నం 03.00 గంటలకు సమావేశమవుదామని చెప్పి, ఆ వేళకు తిరిగి సమావేశం కాగానే గౌతు లచ్చన్నను కాగితం, కలం తీసుకొని కర్నూలు పేరు రాయమని ఆదేశించారు. ఇట్లా ఆనాడు కర్నూలు రాజధానిగా నిర్ణయమైంది. ఆ నిర్ణయం జరుగకపోతే రాయలసీమ ప్రజాప్రతినిధులు మద్రాసు రాష్ట్రంలో ఉండటానికే మొగ్గుతారని ప్రకాశం గారికి తెలుసు. రాజధాని సమస్య చాలా జటిలమని తెలిసే నెహ్రూ మొదట ఆ అంశం తేల్చుకోవాలని ఆంధ్ర నాయకులకు సూచించారు. వాస్తవానికి రాయలసీమ వాసులు మద్రాసు రాష్ట్రంలో ఉండటానికే మొగ్గు చూపినట్టయితే భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనకు పునాది లేకుండా పోతుంది. అది తెలిసిన ప్రకాశం దార్శనికతతో నిర్ణయం తీసుకొని స్వతంత్ర భారతంలో ఆంధ్రరాష్ట్రం తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించడానికి అవకాశం కల్పించారు. తరువాత గుంటూరులో హైకోర్టు ఏర్పాటయింది. ఇప్పుడు అమరావతికి వద్దాం. ఆ నగర నిర్మాణం ఏ రకంగా జరిగిందో పరిశీలిద్దాం. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు చేయడానికి తగిన సూచనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఈ కమిటీ సూచనలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాజధాని నిర్మాణ ప్రక్రియ జరిగిపోయింది. ఇంత చరిత్ర కలిగిన అంశాన్ని, చాలా తేలికగా, వ్యూహాత్మక సర్దుబాట్లతో, చర్చ కూడా లేకుండా ప్రస్తుత రాజకీయ నాయకత్వం అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్య వల్ల కోస్తా ప్రాంతానికి కూడా పెద్ద ప్రయోజనం లేదు. ఒక వర్గ స్థిరాస్తి, వాణిజ్య ప్రయోజనాలకు కొమ్ముకాసే విధంగా ఈ రాజధాని నిర్మాణం సాగుతున్నది. అదే మంచి సంప్రదాయం మన దేశంలోనే ఇతర రాష్ట్రాలను పరిశీలించండి! అక్కడ కూడా రాజధాని, హైకోర్టు వేర్వేరు ప్రాంతాలలోనే కనిపిస్తాయి. దాదాపు తొమ్మిది రాష్ట్రాల వారు ఇలా రాజధానినీ, హైకోర్టునూ వేర్వేరు ప్రాంతాలలో నిర్మించుకున్న వాస్తవాన్ని గమనిస్తాం. భారతదేశ సెంట్రల్ ప్రావిన్స్ ప్రాంతంలోని కొన్ని సంస్థానాలను విలీనం చేయగా ఏర్పడినదే మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈ నేపథ్యాన్ని బట్టే ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగానే ప్రాంతాల మధ్య సరైన అవగాహన కోసం రాజధానిని భోపాల్ నగరంలోను, హైకోర్టును జబల్పూర్లోను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రానికి రాజధాని లక్నో. కాగా హైకోర్టును అలహాబాద్‌లో ఉంచారు. ఉత్తరాంచల్ రాష్ట్రంలో రాజధాని డెహ్రాడూన్‌లో, హైకోర్టు నైనిటాల్లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాజధాని నయా రాయ్‌పూర్‌లో, హైకోర్టు బిలాస్పూర్లోను ఉన్నాయి. మద్రాసు ప్రెసిడెన్సీలోని మలయాళ భాష మాట్లాడే ప్రాంతాలు, ట్రావెన్కోర్ సంస్థానం విలీనం చేయగా ఏర్పడినదే కేరళ. ఈ చిన్న రాష్ట్రానికి రాజధాని తిరువనంతపురంలోను, హైకోర్టు కొచ్చిలోను ఉన్నాయి. సంస్థానాల ఏకీకరణ ద్వారా ఏర్పడిన రాజస్తాన్‌లో కూడా రాజధాని జైపూర్‌లో, హైకోర్టు జోధ్పూర్లోను ఉన్నాయి. గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు తమ రాజధానులను ఎక్కడ ఏర్పాటు చేయాలో చాలాకాలం చర్చించాయి. గుజరాత్, ఒడిశాలకు రాజధానులు గాంధీనగర్, భువనేశ్వర్. వాటి హైకోర్టులు అహమ్మదాబాదు, కటక్‌లలో ఉన్నాయి. ఇటువంటి చారిత్రక సత్యాలను విస్మరించి సంకుచిత దృష్టితో తీసుకోనే నిర్ణయాలు రాష్ట్ర ప్రజల మధ్య అగాధాలు సృష్టిస్తాయి. తరతరాలకు సరి పోయే తలనొప్పులను సృష్టించి పెడతాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడం కేవలం ఆ ప్రాంతపు అంశం కాదు. ఇది వారి న్యాయబద్ధమైన హక్కు. రాజధాని కోసం కర్నూలును ఎంపిక చేసినప్పుడు, సహజంగానే గుంటూరుకు హైకోర్టు వచ్చింది. ఇందుకోసం ఎవరూ ప్రత్యేకంగా గళం విప్పవలసిన అవసరం రాలేదు కూడా. ఈనాడు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసుకోవడమనేది ఒక ప్రాంతీయపరమైన అంశంగానో, కోస్తా ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకమన్న ధోరణిలోనో ఆలోచించాల్సిన అవసరం లేదు. సహజమైన, న్యాయబద్ధమైన (ఆ్చట్ఛఛీ ౌn ఉ్ఞuజ్టీy ఊ్చజీటn్ఛటట) నిర్ణయంగానే స్వాగతించాలి. నాయకులలో ఇటువంటి దార్శనికత లోపిస్తే భవిష్యత్తంతా సమస్యలతో నిండిపోతుంది. వ్యాసకర్త మాజీ ఐఏఎస్ అధికారి, ఐవైఆర్ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
కొత్త రాజధానికి ‘ద్వీప’కాంతులు
♦ గోల్ఫ్ కోర్టు, రిసార్టులు.. ♦ ద్వీపానికి వెళ్లేందుకు మూడు బ్రిడ్జిలు.. రోడ్డుకు ఇరువైపులా ఐకానిక్ టవర్లు సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన భవానీ ద్వీపం సమీపంలో ఉన్న మరో ద్వీపాన్ని అభివృద్ధి చేసి దాన్ని రాజధాని నగరానికి అనుసంధానం చేయనున్నారు. సింగపూర్ ప్రభుత్వ కంపెనీలిచ్చిన మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే ఈ ద్వీపం ఆధారంగా కొత్తగా రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించేందుకు సీఆర్డీఏ వ్యూహరచన చేసింది. ఈ నెల 22న రాజధానికి శంకుస్థాపన చేసే ప్రాంగణం కూడా ఈ ద్వీపానికి అనుసంధానమైన రోడ్డుకు పక్కనే ఉండేలా ఏర్పాటు చేశారు. శంకుస్థాపన చేసే ఉద్ధండ్రాయునిపాలెం గ్రామానికి ఎదురుగా కృష్ణానదిలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక చిన్న ద్వీపం ఉంది. భవానీ ద్వీపానికి ఇది రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. నదిలో పలుచోట్ల ఉన్న చిన్న, చిన్న ద్వీపాల్లోని మట్టిని తెచ్చి దీన్ని ఇంకా పటిష్టం చేసి దీర్ఘచతురస్రాకారంలోకి మార్చుతారు. అలా ఈ ద్వీపాన్ని తయారు చేసి అందులోని 10-12 ఎకరాల విస్తీర్ణంలో గోల్ఫ్ కోర్టు, ఫుడ్‌కోర్టులు, రిసార్టులు, హోటళ్లు నెలకొల్పాలని సంకల్పించారు. విజయవాడ వైపు నుంచి ఈ ద్వీపంలోకి వెళ్లేందుకు బోటు మార్గం, రాజధాని నుంచి బ్రిడ్జిల మీదుగా రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ద్వీపం చుట్టూ ఆకర్షణీయమైన రిటెయినింగ్ వాల్‌ను నిర్మిస్తారు. ద్వీపం నుంచి బ్రిడ్జ్ కమ్ రోడ్డు ఈ ద్వీపం నుంచి రాజధాని వైపు కరకట్ట వరకూ మూడు బ్రిడ్జిలు నిర్మించేందుకు రూపకల్పన చేశారు. ద్వీపం మధ్య భాగం నుంచి ఉద్ధండ్రాయునిపాలెం వరకూ బ్రిడ్జి, అక్కడి నుంచి రాజధాని డౌన్‌టౌన్ వరకూ రహదారిని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ బ్రిడ్జి కమ్ రోడ్డు నాలుగు వరుసలుగా ఉంటుంది. ఈ బ్రిడ్జి రాజధానిలో ప్రవేశించే చోటే ప్రస్తుతం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో శంకుస్థాపన ప్రాంతాన్ని ఈ రోడ్డుకు జంక్షన్‌గా మార్చి దాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ జంక్షన్‌కు కొంచెం అవతల రోడ్డుకిరువైపులా 25 నుంచి 40 అంతస్తుల ఐకానిక్ టవర్లు నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. ద్వీపం మధ్యభాగం నుంచి నిర్మించే బ్రిడ్జితోపాటు దానికి రెండువైపులా మరో రెండు బ్రిడ్జిలను కరకట్ట వరకూ నిర్మిస్తారు. అంటే ద్వీపం నుంచి రాజధాని ప్రాంతానికి మూడు బ్రిడ్జిలుంటాయి. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిలను నిర్మించే అవకాశం ఉంది. -
అమ్మకానికి ఆంధ్రా
► రాజధాని నిర్మించమంటూ చైనా చుట్టూ చంద్రబాబు ► శత్రుదేశం పాకిస్థాన్‌తో చైనా కీలక ఒప్పందాలు ► విదేశీయుల రహస్య పర్యటనలు అడ్డుకొంటాం: ఎమ్మెల్యే ఆర్కే సాక్షి, గుంటూరు : డచ్, పోర్చుగీసు, బ్రిటిష్ దేశస్తుల కానుకలకు ఆశపడి ఆహ్వానించిన సంస్థానాదీశుల చరిత్ర చదువుకున్నామని, ఇప్పుడు చంద్రబాబు రూపంలో చూస్తున్నామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడుతూ, చైనాతో వ్యాపార సంబంధాలకు చంద్రబాబు అర్రులు చాస్తుంటే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మన శత్రుదేశం పాకిస్తాన్‌తో లక్షల కోట్ల ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకోవటం గమనార్హమన్నారు. మన రాజధాని నిర్మాణాన్ని చైనా చేతిలో పెట్టటమంటే...మన సెక్రటేరియట్లో బాంబు పెట్టి రిమోట్ పాకిస్తాన్ చేతికి ఇవ్వటం కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. బాబు చర్యలు జాతీయ భద్రతనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయని, దీన్ని ఓ అంతర్జాతీయ కుట్రగా భావించాల్సి వస్తోందనీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారం పేరిట వచ్చి జాతి సంపద కొల్లగొట్టి వందల ఏళ్ళపాటు భరతజాతిని బానిసలుగా మార్చిన చరిత్ర పునరావృతం అవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ వారికి సైతం తెలియకుండా ఇటీవల సింగపూర్ బృందం రహస్యంగా పర్యటించిందని, ప్రజా ప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విదేశీయులు అధికార పర్యటనలు ఎలా జరుపుతారని ఆయన ప్రశ్నించారు. ‘రాజధాని ప్రణాళిక సింగపూర్‌లో తయారవుతుంది...చైనా కంపెనీలు ఇక్కడ నిర్మాణాలు, నిర్వహణ చేపడతాయి...లాభాల రూపంలో ఆర్థిక వనరులన్నీ వారి చేతిల్లోకి వెళ్ళిపోతాయి...కార్మిక చట్టాల సవరణతో ఇక్కడి ప్రజలంతా వారికి బానిసలుగా మారిపోతారు...’ ఆధునిక తరహా సామ్రాజ్యవాదానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకేముంటుందని ఆయన అన్నారు. వనరుల దోపిడీ, ఆధిపత్య కాంక్షతోనే ఆ రెండు వ్యాపార దేశాలు మనపట్ల కపట ప్రేమ కనబరుస్తున్నాయని ప్రతి ఆంధ్రుడు అర్థం చేసుకోవాలన్నారు. ముందస్తు సమాచారం లేకుండా రాజధాని అంశంపై విదేశీయులు జరిపే పర్యటనలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని తీరుతుందని ఆర్కే హెచ్చరించారు. -
అనధికార లేఅవుట్లపై ఉక్కుపాదం
►పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ ►అమరావతి, తాడికొండ మండలాల్లో అనుమతి లేని లేఅవుట్ల పరిశీలన ►ధ్వంసం చేయాలని అక్కడికక్కడే ఆదేశాలు ►సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించకుండా కొనుగోలు చేయవద్దని సూచన తాడికొండ: రాజధాని లోపల, వెలుపల ఎక్కడ అనధికార లేఅవుట్లు వేసినా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ హెచ్చరించారు. అమరావతి, తాడికొండ మండలాల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన వెంచర్లను శుక్రవారం సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్లు గంధం చంద్రుడు, కన్నబాబు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జేసీ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులతో కలసి పరిశీలించిన మంత్రి అక్కడికక్కడే పొక్లయిన్లతో ధ్వంసం చేయించారు. అమరావతి మండలంలో 87, తాడికొండ మండలంలో 44 అనధికార వెంచర్లను పరిశీలించారు. తాడికొండ మండలంలోని అన్ని వెంచర్ల వివరాలను తహశీల్దారు గడ్డిపాటి అనిల్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 250 ఎకరాల్లో వేసినట్లు చెప్పారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రాత్రికిరాత్రి వెంచర్లు వేసి రోడ్డు మాత్రమే చూపి ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. రాజధాని డిజైన్ రాకముందే వెంచర్లు వేయటం సరికాదని చెప్పారు. రాజధాని జోన్లు వారీగా ఉంటుందన్నారు. ఏ జోను ఎక్కడ వస్తుంది, ఆ జోన్లో ఏఏ సౌకర్యాలు ఉంటాయన్నది తెలియదన్నారు. అందుకనే ఎవరు వెంచర్లు వేయ రాదని ఒకవేళ వేసినా ప్రజలు కొనుగోలు చేయరాదని చెప్పారు. ప్రభుత్వ అనుమతి పొందిన వెంచర్లను సీఆర్డీఏ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రంగుల బ్రోచర్లు చూసి మోసపోవద్దని చెప్పారు. రాష్ర్టంలో అన్ని ప్రాంతాల్లో ఇదే పద్ధతి అమలు చేస్తామని తెలిపారు. తాత్కాలిక రాజధానిపై నివేదిక రావాలి... తాత్కాలిక రాజధానికి కొన్ని స్థలాలను పరిశీలించినట్టు మంత్రి నారాయణ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు పరిధిలో పరిశీలించగా, సీఎం చంద్రబాబు కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చినట్లు చెప్పారు. వాటిని అధికారులతో సర్వే చేయిస్తున్నామని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో డిజైన్ వచ్చే వరకు లేఅవుట్లకు ఎలాంటి అనుమతి ఇవ్వబోమని చెప్పారు. ఇప్పటివరకు కొనుగోలు చేసినవారు నష్టపోక తప్పదని స్పష్టం చేశారు. వారి వెంట జిలా ్లపరిషత్ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు,అధికారులు ఉన్నారు. -
5 వేల ఎకరాలు చాలు!
జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సభ్యుల బృందం రెండురోజులుగా పర్యటిస్తోంది. మంగళగిరి మండలం నిడమర్రులో శనివారం పర్యటించిన బృందం అక్కడి రైతులు,రైతుకూలీలతో మాట్లాడి వారి అభిప్రాయూలను సేకరించింది. మంగళగిరి : ఐదు వేల ఎకరాలలో రాజధానిని ఆధునిక టెక్నాలజీతో అత్యాధునిక యంత్రాంగంతో బ్రహ్మాండమైన బహుళ అంతస్తుల భవనాలను అద్భుతంగా నిర్మించుకోవచ్చని చండీఘడ్ కేపిటల్ సిటీ అడ్మినిస్ట్రేటర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి దేవసహాయం తెలిపారు. మండలంలోని నిడమర్రు గ్రామంలో శనివారం ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక(నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్)సభ్యుల బృందం పర్యటించి రైతు,రైతు కూలీలను అడిగి వివరాలను తెలుసుకుంది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము చండీఘడ్ కేపిటల్ సిటీ తొలిదశ నిర్మాణానికి 15 సంవత్సరాలు పట్టిందని, రెండవ దశ పూర్తి చేయడానికి 20 సంవత్సరాలు సమయం పట్టిందన్నారు. చండీఘడ్‌లో 60 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ పది లక్షల మంది మాత్రమే జీవిస్తున్నారన్నారు. రెండు రోజులుగా రాజధాని గ్రామాల్లో తమ బృందం పర్యటించినప్పుడు భూములు కోల్పోతున్నామనే ఆవేదన రైతుల్లో కనపడిందన్నారు. రాష్ట్రంలో రాజధాని పేరుతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వేల ఎకరాల రైతుల భూములను కబళించేందుకు ప్రయత్నించడం శోచనీయమన్నారు. 100 రకాలు పంటలు పండి దేశంలోని వివిధ ప్రాంతాలకు అనేక పంటలను ఎగుమతి చేస్తున్న భూములను తీసుకోవాలని ప్రభుత్వం చేస్తున్న యత్నాల వల్ల భవిష్యత్తులో ఆహార భద్రతకు తీవ్ర ముప్పువాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రపంచంలో ఏ రాజధానిని చూసినా రెండు మూడు ఎకరాలకు మించి లేదని ఇక్కడ లక్ష ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. అన్ని భూములు ఎందుకో ప్రజలకు తెలియజేసి అప్పుడు భూములను సమీకరించాలన్నారు. ప్రజా ఉద్యమాల జాతీయవేదిక సభ్యుడు రాజారెడ్డి మాట్లాడుతూ రైతుల భూములను తీసుకోవడం వలన ఒక్క రైతుకు మాత్రమే నష్టం కాదని వారితో పాటు రైతు కూలీలు,కౌలు రైతులతో పాటు వ్యవసాయరంగంపై ఆధారపడిన కుటుం బాలన్నీ వీధినపడతాయన్నారు. 80 శాతం మంది రైతులు అంగీకరిస్తేనే భూములను తీసుకోవాలని, చట్టాలను అతిక్రమించేందుకు ప్రభుత్వం సిద్ధమైతే జాతీయస్థాయిలో ఉద్యమం చేసైనా సరే రైతులకు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజా ఉద్యమాల జాతీయవేదిక కన్యీనర్ రామకృష్ణంరాజు, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర సభ్యులు కిరణ్, న్యాయవాదులు మల్లెల శేషగిరిరావు,కలపాల బాబురావు. గ్రామ రైతులు శివరామిరెడ్డి,నాగరాజు,జంగా నాగిరెడ్డి,భీమవరపు కృష్ణారెడ్డి,దండా వీరారెడ్డి,శివ న్నారాయణరెడ్డి,బత్తుల జయమ్మ తదితరులు పాల్గొన్నారు.