భోపాల్ : వరద ఉధృతి నేపథ్యంలో నదుల వద్ద సెల్ఫీలు తీసుకోవడంపై నిషేధం విధిస్తూ మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఓ సెల్ఫీ ఘటనతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి నది మధ్యలోకి వెళ్లి చిక్కుకున్న ఇద్దరు బాలికలను స్థానిక పోలీసులు రక్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం సోమవారం బార్వానీలో 144 సెక్షన్‌ను విధించారు. సమీపంలోని నీటి వనరుల దగ్గర సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేదించింది.
భారీవర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుతం రాష్ట్రంలోని నదులు, కాల్వలు ఉప్పొంగి ప్రవాహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా నదుల వద్ద సెల్ఫీలు తీసుకోవడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు సామూహికంగా ఒకే చోట గుమికూడవద్దని ఆంక్షలు విధించినా 6-8 మంది బాలికలు చింద్వారా జిల్లాలోని పెంచ్ నదికి పిక్నిక్‌కి వెళ్ళడం చర్చనీయాంశమైంది. ఈ నేపథంలోనే వెంటనే స్పందిన అధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టారు. (నదిలో మధ్యలో సెల్ఫీ దిగుదామనుకుంటే..)
Comments
Please login to add a commentAdd a comment