
సేలం : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మాతృవియోగం కలిగింది. సీఎం తల్లి తవుసాయమ్మల్ (93) సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తమిళనాడు సేలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పొందుతున్నారు. అయితే ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు, జిల్లాల పర్యటనలను రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పళనీస్వామి స్వగ్రామమైన సిలువంపాలయంలో అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి తల్లి మృతిపై మంత్రులు కెపి అన్బలగన్, స్పీ వేలుమణి, పి తంగమణి, సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్, నటుడు రజినీకాంత్ ఫోన్ ద్వారా పళనిస్వామికి సంతాపం తెలిపారు. (బీజేపీలోకి కుష్బూ )
Comments
Please login to add a commentAdd a comment