Edappadi Palaniswamy
-
మోదీతో ఓపీఎస్, ఈపీఎస్ భేటీ: చిన్నమ్మ గురించే చర్చ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారం కోల్పొయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. జయ మరణం తరువాత పార్టీకి ‘పెద్ద’దిక్కుగా మారిన ప్రధాని నరేంద్రమోదీతో ఆ పార్టీ రథసారధులు అనేక సమస్యలపై మొరపెట్టుకున్నారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు, మాజీ మంత్రుల ఇళ్లపై ఏసీబీ దాడులు, ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి సవాలుగా మారాయి. ఈ సవాళ్లను ఎదుర్కొవడంపై సీనియర్ నేతల మధ్య సయోధ్య కరువైంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి ఆదివారం ఉదయం, రాత్రి వేర్వేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకే వారిద్దరూ ఢిల్లీకి వెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. పన్నీర్‌సెల్వం కుమారుడు, తేనీ లోక్‌సభ సభ్యుడు రవీంద్రనాథ్‌కు కేంద్రం కేటాయించిన వసతి గృహంలో సోమవారం ఉదయం జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి ఓపీఎస్, ఈపీఎస్ సహా పలువురు మాజీ మంత్రులు హాజరయ్యారు. అక్కడి నుంచి ఒకే కారులో ఓపీఎస్, ఈపీఎస్ ప్రధాని ఇంటికి చేరుకున్నారు. తమిళనాడులో మారిన రాజకీయ పరిణామాలు, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పనితీరు, కేంద్ర క్యాబినెట్లో అన్నాడీఎంకేకు చోటు, స్థానిక సంస్థల ఎన్నికలు, అన్నాడీఎంకే మాజీ మంత్రుల ఇళ్లలో ఎసీబీ తనిఖీలు, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి వ్యవహారం తదితర అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. తమిళనాడులో మూడు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీకానున్నాయి. తమిళనాడు నుంచి కేంద్రమంత్రిగా మారిన ఎల్ మురుగన్ ఆరునెలల్లోగా ఎంపీగా ఎన్నికకావడం అవశ్యంగా మారింది. ఇందుకు సంబంధించి సైతం ప్రధాని, ఓపీఎస్, ఈపీఎస్ మధ్య చర్చకు వచ్చిందని చెబుతున్నారు. చిన్నమ్మ గురించే చర్చ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 66 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. రాజకీయాలకు స్వస్థి పలికినట్లు ఎన్నికల ముందు ప్రకటించిన శశికళ మళ్లీ అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదపుతున్నారు. ప్రధానిని కలిసిన సమయంలో అన్నిటి కంటే శశికళ సాగిస్తున్న తెరవెనుక రాజకీయాలపైనే ప్రధానంగా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. శశికళ సహకారం లేకుండానే 66 స్థానాల్లో గెలుపొందిన అన్నాడీఎంకేను తన చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు శశికళ చేస్తున్న ప్రయత్నాలను ఎడపాడి పళనిస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శశికళ పార్టీలోకి మళ్లీరాకుండా చేయాలని సీనియర్ నేతలతో ఎడపాడి చెబుతూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో పన్నీర్‌సెల్వం వైఖరి భిన్నంగా ఉంది. శశికళను అన్నాడీఎంకేలోకి ఆహ్వానిస్తే ఆమెకున్న 5శాతం ఓటు బ్యాంకుతో పార్టీని బలోపేతం చేయవచ్చని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని ఓపీఎస్ వాదిస్తున్నారు. శశికళ గురించి ఏకాభిప్రాయం కుదరకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, ఓపీఎస్, ఈపీఎస్ ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించారు. కావేరీ నదీజలాలకు అడ్డుగా మేఘదాతు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న ఆనకట్ట, నీట్ ప్రవేశ పరీక్ష రద్దు, కేంద్రం నుంచి వ్యాక్సిన్ సరఫరాలో నెలకొన్న ఇబ్బందులు, మధురైలో ఎయిమ్స్ స్థాపనపై ఏర్పడిన జాప్యం తదితర అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు. ఓపీఎస్, ఈపీఎస్‌లు సోమవారం ఉదయం 11 గంటల నుంచి సుమారు గంటపాటు మోదీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కూడా కలిశారు. -
తమిళనాడు ముఖ్యమంత్రికి మాతృవియోగం
సేలం : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మాతృవియోగం కలిగింది. సీఎం తల్లి తవుసాయమ్మల్ (93) సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తమిళనాడు సేలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పొందుతున్నారు. అయితే ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు, జిల్లాల పర్యటనలను రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పళనీస్వామి స్వగ్రామమైన సిలువంపాలయంలో అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి తల్లి మృతిపై మంత్రులు కెపి అన్బలగన్, స్పీ వేలుమణి, పి తంగమణి, సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్, నటుడు రజినీకాంత్ ఫోన్ ద్వారా పళనిస్వామికి సంతాపం తెలిపారు. (బీజేపీలోకి కుష్బూ ) -
పళని అనుకున్నదొకటి.. అయిందొకటి..!
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, కలైంగర్ కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. అశేష అభిమాన సంద్రం మెరినా బీచ్‌లో ఆయనకు బుధవారం సాయంత్రం కడసారి వీడ్కోలు పలికింది. అయితే నిబంధనలు, కోర్టులో పిటిషన్లను సాకుగా చూపుతూ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డుపుల్ల వేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా, రాజకీయ లబ్ది కోసం ముఖ్యమంత్రి పళనిస్వామి తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టిందనని ఆ పార్టీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐఏడీఎండీకేలో తన నాయకత్వంపై అయిష్టంగా ఉన్న పార్టీ క్యాడర్ టీటీవీ దినకరన్ వైపు చూస్తుండడంపై కలవరపడిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, పళని నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు, ప్రముఖులు, సినీ తారలు కరుణ మృతిపట్ల సంతాపం ప్రకటిస్తుంటే.. ఏఐఏడీఎంకే రాజకీయాలు చేస్తోందనే వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై అన్ని పార్టీలు డీఎంకేకు మద్దతుగా నిలవగా.. ఏ ఒక్క పార్టీ కూడా ఏఐడీఎంకే అనుకూలంగా మట్లాడలేదు. టీటీవీ దినకరన్ కూడా ‘కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడలేను’అని తప్పించుకున్నారు. దినకరన్‌వైపు చూస్తోన్న పార్టీ క్యాడర్‌ను మచ్చిక చేసుకుందామనుకున్న పళని ప్రభుత్వానికి ఇంటా బయటా మద్దతు లభించలేదు. చివరికి కోర్టులో ఉన్న పిటిషన్ల ఉపసంహరణతో మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు లైన్‌క్లియర్ అయింది. అక్కడ కరుణానిధి అంత్యక్రియలకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. కొసమెరుపు.. పటిషన్ల ఉపసంహరణతో కోర్టు నిర్ణయానికంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కరుణ అంత్యక్రియలకు ఓకే చెప్పింది. కానీ, అప్పటికే ఆ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో అనవసర వివాదానికి తెరలేపిన పళని స్వామి సెల్ఫ్ గోల్ చేసినట్లయింది. -
ఎట్టకేలకు ఓకే!
► నేటి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి లైన్‌క్లియర్ ► బెంగళూరు, మద్రాసు హై కోర్టుల భిన్నమైన తీర్పులతో సందిగ్ధత ► మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ తీర్పుతో మార్గం సుగమం ► ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ప్రకటించిన దినకరన్ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం తలపెట్టిన అన్నాడీఎంకేసర్వసభ్య సమావేశానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. మద్రాసు,బెంగళూరు కోర్టులు భిన్నమైన తీర్పును చెప్పడంతో కొన్నిగంటలపాటూ నెలకొన్న సందిగ్ధతపై సోమవారం రాత్రి 9.30 గంటలకు స్పష్టత చేకూరింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీ, ప్రభుత్వాలకు తలనొప్పిగా తయారైన టీటీవీ దినకరన్‌ను వదిలించుకోవాలని సీఎం ఎడపాడి తీర్మానించుకున్నారు. ఈనెల 12వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి శశికళ స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటే ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా దినకరన్ కూడా దెబ్బతీయవచ్చని ఎడపాడి అంచనావేశారు. సర్వసభ్య సమావేశానికి అవసరమైన 3,200 మంది కార్యవర్గ సభ్యుల బలాన్ని కూడగట్టారు. ఇదిలా ఉండగా పార్టీ సమావేశం జరపకుండా స్టే విధించాలని కోరుతూ దినకరన్ వర్గ పెరంబూరు ఎమ్మెల్యే వెట్రివేల్ మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి సీవీ కార్తికేయన్ ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. పార్టీ సమావేశం ఏర్పాటుకు ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న దినకరన్‌కు మాత్రమే అధికారం ఉందని వెట్రివేల్ తరపు న్యాయవాది టీవీ రామానుజం వాదించారు. న్యాయమూర్తి స్పందిస్తూ వెట్రివేల్ తన పిటిషన్‌ను ఎమ్మెల్యే హోదాలో వేయలేదని, పైగా దినకరన్‌ను కూడా ఇందులో చేర్చారని అన్నారు. అంతేగాక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పిటిషన్ వేసినట్లు కూడా ఆయన అంగీకరించినందున ఇటువంటి చర్యలను కోర్టు ఉపేక్షించదని చెప్పారు. ‘‘ఇష్టమైతే మీరు పార్టీ సమావేశంలో పాల్గొనవచ్చు, లేకుంటే మధ్యలోనే లేచివెళ్లిపోయి భోజనం చేయవచ్చు, అదీ ఇష్టకాకుంటే హాయిగా ఇంటిలోనే కూర్చుండిపోవచ్చు..’’ అంటూ చమత్కారంగా మాట్లాడిన న్యాయమూర్తి స్టే కోరుతూ వేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. అంతేగాక అవగాహన లేని పిటిషన్ వేసి కోర్టు సమయం వృధా చేశారన్న విమర్శతో వెట్రివేల్‌కు రూ.1లక్షల జరిమానా విధించారు. అయితే ఈతీర్పుపై మద్రాసు హైకోర్టులోనే ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కు వెట్రివేల్ అప్పీలు చేసుకున్నారు. అప్పీలు పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు రాత్రి 7.15 తీర్పు చెబుతానని వెల్లడించింది. మరో 24 గంటల్లో సర్వసభ్య సమావేశం జరుగనుండగా బెంగళూరు కోర్టు స్టే ఇస్తూ సోమవారం రాత్రి ఇచ్చిన తీర్పుతో ఎడపాడి వర్గీయుల్లో మరో బాంబు పేలింది. వెట్రివేల్ అప్పీలు పిటిషన్‌పై ఎటువంటి తీర్పు వెలువడుతుందో అనే ఉత్కంఠ బయలుదేరింది. గంటకోసారి మారుతున్న పరిణామాలపై సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సోమవారం రాత్రి తన వర్గంతో సమావేశమయ్యారు. అయితే అన్నాడీఎంకే (అమ్మ) వర్గం, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ వర్గం కలిసి చెన్నైలో నిర్వహించే సర్వసభ్య సమావేశానికి స్టే విధించే అధికారం బెంగళూరు కోర్టుకు లేదని ఎడపాడి వర్గ పార్లమెంటు సభ్యులు అన్వర్‌రాజా వాదన లేవనెత్తారు. నిర్ణయించిన ప్రకారం మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగితీరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎట్టకేలకు ఎడపాడికి అనుకూలం సోమవారం రాత్రి 9.30 గంటలకు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ఎట్టకేలకూ ఎడపాడికి అనుకూలంగా వెలువడింది. ఏకసభ్య బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును కొట్టివేయలేమని, స్టే మంజూరు కుదరదని న్యాయమూర్తులు రాజీవ్ అక్తర్, అబ్దుల్ ఖుద్దూస్ స్పష్టం చేశారు. అయితే అప్పీల్ పిటిషన్‌లోని అంశాలపై సమగ్ర విచారణ కోసం ఈనెల 24వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఎడపాడి వర్గం ఊపిరి పీల్చుకుంది. మారుస్తా.. లేకుంటే కూలుస్తా : దినకరన్ తమ వల్ల సీఎం అయిన ఎడపాడిని ఆ పదవి నుంచి దింపివేసి మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని, వీలుకాని పక్షంలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. మదురైలో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, మీకే ద్రోహం చేసిన వారిని మాకు ఏం మేలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ధర్మ యుద్ధమని డిప్యూటీ సీఎం పదవిని తీసుకున్నారు పన్నీర్‌సెల్వం, ఆయనకు పదవి లేకుంటే ఊపిరి ఆడదని ఎద్దేవా చేశారు. గతంలో తమ వల్ల ప్రభుత్వానికి ముప్పులేదని చెబుతూ వచ్చిన దినకరన్ నేడు స్పష్టంగా కూల్చివేస్తామని ప్రకటించారు. -
రెండాకులు దక్కేనా?
-
రెండాకులు దక్కేనా?
► అదనపు ఆధారాలు కోరిన ఎన్నికల కమిషన్ ► జూన్ 16 వరకు గడువు వైరివర్గాల పోరుతో తాత్కాలిక నిషేధానికి గురైన రెండాకుల చిహ్నం చివరికి ఎవరికైనా దక్కేనా ఎన్నికల కమిషన్ చేతుల్లో శాశ్వతంగా ఎండిపోయేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. రెండాకుల చిహ్నం పొందడంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన రెండునెలల గడువు సద్వినియోగం చేసుకోకుంటే గతేమిటని ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాల్లో భయం ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి, రెండాకుల చిహ్నంకు రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉంది. రెండాకుల చిహ్నం చూడగానే ప్రజల కళ్ల ముందు ఎంజీఆర్, జయలలిత కదలాడుతారు. అంతే పూనకం వచ్చినట్లుగా బ్యాలెట్ పేపరు మీదున్న రెండాకుల గుర్తుపై ఓటు ముద్రవేస్తారు. ఏదో బలమైన తప్పుచేసినపుడు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఓడించారు, లేకుంటే శాశ్వతంగా అధికారంలో ఉండగల సత్తా ఆ పార్టీకి ఉందని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడు. అమ్మ మరణం తరువాత ఆ పార్టీపై అజమాయిషీ కోసం శశికళ, పన్నీర్‌సెల్వం రాజకీయ పోరాటానికి దిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదనే వాదనతో జాతీయ ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు విచారణలో ఉండగానే ఆర్కేనగర్ ఎన్నికలు వచ్చాయి. శశికళ ఎంపిక విచారణను పక్కనపెట్టిన ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నం ఏ వర్గానికి ఇవ్వాలనే అంశంపై దృష్టి పెట్టింది. చివరకు మధ్యే మార్గంగా అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని, ఇరువర్గాలూ వాడకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామాన్ని ఊహించని శశికళ వర్గం కుదేలైపోయింది. టోపీ గుర్తుపై పోటీ చేయడం ద్వారా ప్రజల నుంచి నిరసన సెగలను ఎదుర్కొంది. రెండాకుల చిహ్నం స్థానంలో డబ్బును వెదజల్లడం ద్వారా గెలుపొందాలని దినకరన్ చేసిన ప్రయత్నం మొత్తం ఎన్నికల రద్దుకే దారితీసింది. ఇక లాభం లేదనుకున్న దినకరన్ రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవడం కోసం రూ.50 కోట్లు ఎరవేసేందుకు ప్రయత్నించి ఢిల్లీ పోలీసులకు చిక్కారు. పార్టీ, చిహ్నంపై ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఈనెల 17న విచారణకు సిద్ధమవుతున్న తరుణంలోనే దినకరన్ ఉదంతం బట్టబయలై విచారణ వాయిదాకు దారితీసింది. అన్నాడీఎంకే వ్యవహారం ఎన్నికల కమిషన్‌కు తలనొప్పిగా మారగా వీలయినంత త్వరగా ఈ శిరోభారాన్ని దించుకునేందుకు సిద్ధమైంది. చిహ్నం కోసం జూన్ 16వ తేదీలోగా అదనపు ఆధారాలను సమర్పించాల్సిందిగా అన్నాడీఎంకేలోని ఇరువర్గాలను ఎన్నికల కమిషన్ శుక్రవారం ఆదేశించింది. విలీనం ద్వారా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఎడపాడి, పన్నీర్‌వర్గాలకు ఆధారాలపై గడువు విధించడం ద్వారా ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఇరువర్గాల నేతలు ఆధారాలతో ముందు కెళతారా, వీలీనానికి ప్రాధాన్యం ఇస్తారా లేకుంటే రెండాకుల చిహ్నాన్ని చేజార్చుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
రెండాకులు దక్కేనా?
► అదనపు ఆధారాలు కోరిన ఎన్నికల కమిషన్ ► జూన్ 16 వరకు గడువు వైరివర్గాల పోరుతో తాత్కాలిక నిషేధానికి గురైన రెండాకుల చిహ్నం చివరికి ఎవరికైనా దక్కేనా ఎన్నికల కమిషన్ చేతుల్లో శాశ్వతంగా ఎండిపోయేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. రెండాకుల చిహ్నం పొందడంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన రెండునెలల గడువు సద్వినియోగం చేసుకోకుంటే గతేమిటని ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాల్లో భయం ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి, రెండాకుల చిహ్నంకు రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉంది. రెండాకుల చిహ్నం చూడగానే ప్రజల కళ్ల ముందు ఎంజీఆర్, జయలలిత కదలాడుతారు. అంతే పూనకం వచ్చినట్లుగా బ్యాలెట్ పేపరు మీదున్న రెండాకుల గుర్తుపై ఓటు ముద్రవేస్తారు. ఏదో బలమైన తప్పుచేసినపుడు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఓడించారు, లేకుంటే శాశ్వతంగా అధికారంలో ఉండగల సత్తా ఆ పార్టీకి ఉందని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడు. అమ్మ మరణం తరువాత ఆ పార్టీపై అజమాయిషీ కోసం శశికళ, పన్నీర్‌సెల్వం రాజకీయ పోరాటానికి దిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదనే వాదనతో జాతీయ ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు విచారణలో ఉండగానే ఆర్కేనగర్ ఎన్నికలు వచ్చాయి. శశికళ ఎంపిక విచారణను పక్కనపెట్టిన ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నం ఏ వర్గానికి ఇవ్వాలనే అంశంపై దృష్టి పెట్టింది. చివరకు మధ్యే మార్గంగా అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని, ఇరువర్గాలూ వాడకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామాన్ని ఊహించని శశికళ వర్గం కుదేలైపోయింది. టోపీ గుర్తుపై పోటీ చేయడం ద్వారా ప్రజల నుంచి నిరసన సెగలను ఎదుర్కొంది. రెండాకుల చిహ్నం స్థానంలో డబ్బును వెదజల్లడం ద్వారా గెలుపొందాలని దినకరన్ చేసిన ప్రయత్నం మొత్తం ఎన్నికల రద్దుకే దారితీసింది. ఇక లాభం లేదనుకున్న దినకరన్ రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవడం కోసం రూ.50 కోట్లు ఎరవేసేందుకు ప్రయత్నించి ఢిల్లీ పోలీసులకు చిక్కారు. పార్టీ, చిహ్నంపై ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఈనెల 17న విచారణకు సిద్ధమవుతున్న తరుణంలోనే దినకరన్ ఉదంతం బట్టబయలై విచారణ వాయిదాకు దారితీసింది. అన్నాడీఎంకే వ్యవహారం ఎన్నికల కమిషన్‌కు తలనొప్పిగా మారగా వీలయినంత త్వరగా ఈ శిరోభారాన్ని దించుకునేందుకు సిద్ధమైంది. చిహ్నం కోసం జూన్ 16వ తేదీలోగా అదనపు ఆధారాలను సమర్పించాల్సిందిగా అన్నాడీఎంకేలోని ఇరువర్గాలను ఎన్నికల కమిషన్ శుక్రవారం ఆదేశించింది. విలీనం ద్వారా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఎడపాడి, పన్నీర్‌వర్గాలకు ఆధారాలపై గడువు విధించడం ద్వారా ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఇరువర్గాల నేతలు ఆధారాలతో ముందు కెళతారా, వీలీనానికి ప్రాధాన్యం ఇస్తారా లేకుంటే రెండాకుల చిహ్నాన్ని చేజార్చుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
బుగ్గ తీశారు!
► స్వయంగా తొలగించిన సీఎం ఎడపాడి పళనిస్వామి ► అదే బాటలో మంత్రులు ► అందరికీ ఆదేశాలు ► సచివాలయంలో పళని బిజీ ► నీట్ మినహాయింపునకు లేఖ బుగ్గల సంస్కృతికి స్వస్తి పలుకుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తన వాహనంపై ఉన్న సైరన్‌ను స్వయంగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి తొలగించారు. మంత్రులు అదే బాటలో ముందుకు సాగారు. అధికారులందరి వాహనాల్లో త్వరితగతిన తొలగించాలన్న ఆదేశాలను సీఎం జారీ చేశారు. ఇక, సీఎంగా పగ్గాలు చేపట్టి గురువారంతో రెండు నెలలు కావడంతో సచివాలయంలో పళనిస్వామి బిజీ అయ్యారు. సాక్షి, చెన్నై: ప్రజాస్వామ్య దేశంలో ఇక వీఐపీ, వీవీఐపీ అన్న సంస్కృతికి చోటు లేదన్నట్టుగా కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీఐపీ సంస్కృతిని సూచించే రీతిలో వాహనాల్లో ఉండే ఎర్ర బుగ్గలు(సైరన్) మే ఒకటి నుంచి ఉండబోవని కేంద్రం చేసిన ప్రకటనతో తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి తక్షణం స్పందించారు. గురువారం ఉదయం సచివాలయంలోకి రాగానే, తన వాహనంపై ఉన్న బుగ్గను సీఎం తొలగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తాను స్పందించానని పేర్కొన్నారు. తన మంత్రులు వారి వారి వాహనాలపై బుగ్గలను తొలగించేందుకు నిర్ణయించారని, కొందరు తొలగించేశారని, మిగిలిన వారు త్వరితగతిన తొలగిస్తారని వివరించారు. అధికారులు అందరూ త్వరితగతిన తమ తమ వాహనాలపై బుగ్గలను తొలగించాలన్న ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నా, తమఅమ్మ, దివంగత సీఎం జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఎర్రబుగ్గ సైరన్ వాహనాన్ని ఉపయోగించ లేదన్న విషయాన్ని గుర్తెరగాల్సిన అవసరం ఉందని ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. సీఎం బిజీ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి గురువారంతో పళనిస్వామికి రెండు నెలలు అయింది. అందుకే కాబోలు సచివాలయంలో బిజిబిజీ అయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు తదుపరి సచివాలయం వైపుగా సీఎం పెద్దగా దృష్టి పెట్టలేదు. అడపాదడపా కార్యక్రమాలకు హాజరైనా, తాజాగా మాత్రం రోజంతా బిజీగానే ఉండడం గమనార్హం. బల నిరూపణలో నెగ్గిన అనంతరం ఫిబ్రవరి 20వ తేదీన పళనిస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు. తొలి సంతకంగా 500 టాస్మాక్‌ల మూత, అమ్మ పథకాల అమలు మీద దృష్టి పెట్టారు. ఈ రెండు నెలల కాలంలో మొత్తంగా ఆయన 1,520 ఫైల్స్ మీద సంతకాలు పెట్టినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నట్టు, ఆరు వందల వరకు గతంలో ఉన్న పెండింగ్ ఫైల్స్ కూడా ఉండడం గమనార్హం. ఈ రెండు నెలల కాలంలో ప్రభుత్వ వ్యవహారాల మీద తొలి వారం పది రోజుల్లో తీవ్ర దృష్టి పెట్టినా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల నగారాతో ఆయన పనితీరు కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అందుకే పాలనా పరంగా ప్రభుత్వం విఫలమైందంటూ ప్రధాన ప్రతి పక్షం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. సీఎం సాయం : మంత్రులు, అధికారులతో వారి వారి శాఖల్లోని కేటాయింపులు, పనుల గురించి సీఎం సుదీర్ఘంగానే చర్చల్లో మునిగారు. తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు జరిగిన కేటాయింపులు, సాగుతున్న పనుల్ని సమీక్షించారు. అలాగే, వివిధ కారణాలు, ప్రమాదాల్లో మరణించిన విధి నిర్వహణలో ఉన్న పోలీసులు 14 మంది కుటుంబాల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారు. తలా రూ. మూడు లక్షలు చొప్పున సాయం ప్రకటించారు. అలాగే, ఆర్మీలో సేవల్ని అందిస్తూ, వాహన ప్రమాదంలో మరణించిన తూత్తుకుడి జిల్లా ములక్కాడుకు చెందిన గుణశేఖరన్ కుమారుడు ముత్తుచందన్ మృతికి తన సంతాపం తెలియజేశారు. ఆకుటుంబానికి సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వ సాయంగా రూ.20 లక్షలు ప్రకటించి, తక్షణం అందించేందుకు చర్యలు తీసుకోవడం విశేషం. ఇక, నీట్ పరీక్షా సమయం ఆసన్నం అవుతుండడం, తమిళ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆందోళనను పరిగణలోకి తీసుకుని విద్యాశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇక పలువురు వీఐపీల అపాయింట్మెంట్లతో సీఎం బిజీ అయ్యారు. ఇందులో పారాలింపిక్ విజేత మారియప్పన్ తంగవేల్ సీఎంను కలిసి తనకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ బిరుదును సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కాగా ‘నీతి ఆయోగ్’లో పాల్గొనేందుకు తగ్గ పర్యటన కసరత్తులు సాగాయి. ఆమేరకు శనివారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.