Tamil Nadu: Cm Mk Stalin Attend Presidency College Convocation, His Comments Goes Viral - Sakshi
Sakshi News home page

Tamil Nadu CM MK Stalin: తమ్ముడు నేను సీనియర్‌నే.. సీఎం చమత్కారం!

Published Wed, Jul 6 2022 3:34 PM | Last Updated on Wed, Jul 6 2022 4:21 PM

Tamil Nadu: Cm Mk Stalin Attend Presidency College Convocation - Sakshi

సాక్షి, చెన్నై: రాజధాని కళాశాలలో తాను సీనియర్‌ అని, ప్రస్తుత విద్యార్థులను ఉద్దేశించి సీఎం అన్నారు. చెన్నైలోని రాజధాని కళాశాలలో డిగ్రీల ప్రదానోత్సవం మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు సీఎం స్టాలిన్, ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ గత స్మృతులను నెమర వేసుకున్నారు. తాను కూడా ఇదే కళాశాలలో చదువుకున్నట్లు నాటి రోజులను విద్యార్థుల దృష్టికి తెచ్చారు. పొలిటికల్‌ సైన్స్‌ తాను ఇక్కడే చదువుకున్నట్లు వివరించారు.

అప్పటి మిత్రులను గుర్తు చేసుకుంటూ, ఆ కాలంలో విధించిన ఎమర్జనీ కారణంగా తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తాను ఈ కళాశాలలో సీనియర్‌ అని, అందుకే ఇక్కడున్న విద్యార్థులను సీనియర్‌గా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఇక, ఈ కళాశాలల్లో రెండు వేల మంది విద్యార్థులు కూర్చునేందుక వీలుగా,అ న్ని సౌకర్యాలతో కలైంజర్‌ కరుణానిధి పేరిట ఆడిటోరియం నిర్మించనున్నామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ దయానిధి మారన్, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Tamil Nadu Crime: ఓటీపీ చెప్పలేదని భార్య, పిల్లల ఎదుటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement