పెద్దపెద్ద అంగలు వేస్తూ నడుస్తున్న కార్తికేయన్(ఇన్‌సెట్‌లో) కార్తికేయన్
చెన్నై : అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్కపిల్ల కవిత కేదీ కాదు అనర్హం అన్నట్లు.. ప్రపంచ రికార్డు సాధించటానికి కాదేదీ అనర్హం. మనం చేయబోయే పని ఏదైనా అందులో మనమే నెంబర్ అనిపించుకుంటే చాలు. రికార్డు మన సొంతం అయిపోతుంది. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన జవహార్ కార్తికేయన్ పెద్ద పెద్ద అంగలు వేసి నడిచి ప్రపంచ రికార్డు సాధించాడు. 6 గంటల్లో 36,000 అంగలు వేసిన మగవాడిగా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. (వెరైటీ డ్రెస్‌తో 43 ఏళ్ల తర్వాత తండ్రి చెంతకు)
డిసెంబర్ 4వ తేదీన కోయంబత్తూరులోని కల్లపాళియం కొడిస్సియా పారిశ్రామిక వాడలోని రోడ్డుపై నడిచాడు. గతంలో ఉన్న 24 గంటల్లో లక్ష అంగల రికార్డును ఇతడు బ్రేక్ చేశాడు. త్వరలో 24 గంటల పేరిట ఉన్న రికార్డును కూడా బ్రేక్ చేస్తానని అంటున్నాడు కార్తికేయన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( ఆ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోయా : నటి)
Comments
Please login to add a commentAdd a comment