చెన్నై : దేశంలో మహారాష్ర్ట తర్వాత తమిళనాడులో అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువరు రాజకీయ నేతలు సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ రాష్ర్ట రవాణాశాఖ మంత్రి విజయ భాస్కర్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు భార్య, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వీరంతా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రాష్ర్ట వ్యాప్తంగా కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 6000 మార్క్‌ను దాటేసింది. ఇందులో గడిచిన 24 గంటల్లోనే 121 మంది మరణించారు. కొత్తగా 5709 కరోనా కేసులు నమోదవగా, వీటిలో చెన్నైలోనే 1,182 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు తమిళనాడు వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులసంఖ్య 3,49,654కు చేరింది. (జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment