
కాంగ్రెస్-సేన: అగ్గిరాజేస్తున్న ఔరంగాబాద్
మహారాష్ట్రంలోని మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఔరంగాబాద్ పేరు మార్చాలని అధికార శివసేన చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పూర్తి వివరాలు..
‘విగ్రహం ధ్వంసం వెనుక చంద్రబాబు పాత్ర’
పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం ఆలయంలోని కోదండ రాముడి విగ్రహం ధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. రామతీర్థంలోని రాముని విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలు..
‘30 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు’
ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు..
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాలు..
వారందరికీ ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో 30.75 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి వివరాలు..
ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి
కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలు..
ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా
జిల్లా కేంద్రంలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన పుట్టిస్తోంది. సమీప బంధువు అంత్యక్రియలకు హాజరైన వీరికి కరోనా వైరస్ సోకింది. పూర్తి వివరాలు..
కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్
కరోనా వైరస్ నివారణకు సంబంధించి కొత్త ఏడాదిలో ప్రజలకు శుభవార్త అందింది. తాజాగా సీరం అభివృద్ధి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతినిచ్చింది. పూర్తి వివరాలు..
కరోనా వైరస్ : చైనా గుడ్‌న్యూస్
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన శుభ తరుణంలోనే మరో శుభవార్తను చైనా వైద్యులు ప్రకటించడం విశేషం. పూర్తి వివరాలు..
కొత్త ఏడాది తొలి రోజూ రికార్డ్స్‌తో బోణీ
కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ వచ్చింది. దీంతో సెన్సెక్స్ 48,000 మైలురాయికి చేరువలో నిలవగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. వెరసి వరుసగా 8వ రోజూ మార్కెట్లు లాభపడగా.. మరోసారి సరికొత్త గరిష్ట రికార్డులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు..
‘రంగ్ దే’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి వివరాలు..
'ఆ మ్యాచ్‌లో నన్ను గెట్ అవుట్ అన్నారు'
మిండియా మాజీ ఆటగాడు.. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఆసీస్ ఆటగాళ్లతో జరిగిన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. తాను అవుట్ కాకున్నా అంపైర్ అవుట్ ఇచ్చాడని.. వెంటనే ఆసీస్ ఆటగాళ్లు తన వద్దకు వచ్చి గెట్ అవుట్ అంటూ సింబల్ చూపించారని గవాస్కర్ తెలిపాడు. పూర్తి వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment