
అమిత్ షా ఎత్తుగడ.. మమతకు మద్దతు!
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు యావత్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య ఇటీవల చెలరేగిన వివాదం దేశ రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్నే రేపి పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. పూర్తి వివరాలు..
దుబ్బాక ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌కు ఫిట్స్
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌కు ఫిట్స్ వచ్చాయని బీజేపీ సీనియర్‌నేత, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ మురళీధర్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు ఎన్నికల జిమ్మిక్కులు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలు..
‘పల్లెల్లోకి వైద్యులు.. సరికొత్త వ్యవస్థ’
కోవిడ్ సెకండ్‌వేవ్ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ‘ఆస్పత్రుల్లో నాడు-నేడు’పై సీఎం సమీక్ష జరిపారు. పూర్తి వివరాలు..
ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యానాథ్ దాస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పూర్తి వివరాలు..
టీడీపీ అక్రమాలు.. నివేదిక సిద్ధం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ పూర్తయింది. టీడీపీ హయాంలో చోటుచేసుకున్న భూ కుంభకోణంపై సుదీర్ఘ విచారణ జరిపిన సిట్.. పెద్ద ఎత్తున భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. పూర్తి వివరాలు..
మీడియాతో డీజీపీ గౌతం సవాంగ్ చిట్‌చాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డీజీపీ గౌతం సవాంగ్ మంగళవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. పలు అంశాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పూర్తి వివరాలు..
బీజేపీ ఎమ్మెల్యేకు సీపీ సజ్జనార్ కౌంటర్..
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. పోలీసులు, డీజీపీపై కామెంట్లు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని ఆయన మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను సీపీ తప్పుబట్టారు. పూర్తి వివరాలు..
అనూహ్యంగా పెరిగిన కరోనా కేసులు
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. వారం రోజుల్లోనే కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజు వారిగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య 64.7 శాతానికి చేరుకుంది. గత సోమవారం వైరస్ బారిన పడుతున్న రోజువారి ప్రజల సరాసరి సంఖ్య 20 వేలు ఉండగా, అది నేటికి 33,500కు చేరుకుంది. పూర్తి వివరాలు..
కోవిడ్ స్ట్రెయిన్ : ఒక్కరోజే లక్షల కోట్లు ఢమాల్
సరికొత్త గరిష్టాలతో దూకుడుమీద ఉన్న దేశీయ స్టాక్‌మార్కెట్లకు కోవిడ్ స్ట్రెయిన్ దెబ్బ భారీగా తగిలింది. మరో ప్రాణాంతకమైనకొత్త వైరస్‌ను గుర్తించామంటూ యూకే ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస‍్టర్ల సంపద ఒక్కరోజులో పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది. పూర్తి వివరాలు..
రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా పాజిటివ్
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంగళవారం ఆమే స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘నేను కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. పూర్తి వివరాలు..
రైనా, టాప్ హీరో మాజీ భార్య అరెస్ట్
టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్‌ఫ్లై క్లబ్‌లో జరిగిన దాడుల్లో రైనాతో పాటు గాయకుడు గురు రాంధవాతో అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్నే ఖాన్ సహా మరికొందరు సెలబ్రిటీలు ఉన్నారు. పూర్తి వివరాలు..