
►సవాళ్ల పర్వం: ముఖం చాటేసిన వెలగపూడి
సవాళ్ల పర్వం ముగిసిపోయిందని తాము చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యిందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. వెలగపూడికి ఇచ్చిన గడువు ముగియడంతో వెళ్లిపోయిన ఆయన ఆదివారం సాయిబాబా ఆలయం నుంచి వెళ్లిపోయారు. సాయిబాబా గుడిలో ప్రమాణానికి రావాలని అమర్నాథ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు..
►మా అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం: సుబ్బారెడ్డి
తిరుపతి ఉపఎన్నికపై చర్చించామని వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి ఉపఎన్నికపై వైఎస్సార్‌సీపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఉపఎన్నికపై సమాలోచనలు చేశారు. పూర్తి వివరాలు..
►టీపీసీసీ: కొండా సురేఖకు కీలక పదవి..!?
రాష్ట్ర పార్టీలో మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. త్వరలో జరగనున్న టీపీసీసీ సంస్థాగత మార్పుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు..
►‘అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు’
అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి భూముల కోసం ఉద్యమిస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాలు..
►అంతర్వేది: నూతన రథాన్ని పరిశీలించిన మంత్రి
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన రథాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహంతోనే రథం పూర్తయిందన్నారు. పూర్తి వివరాలు..
►‘మోదీగారు ఇక చాలు, ముచ్చట్లు ఆపండి’
ప్రధాని నరేంద్ర మోదీ 72 వ మన్ కీ బాత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతులు, నెటిజన్ల పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూ రేడియోలో మీరు చెప్తున్నదంతా వినీ వినీ అలసిపోయాం. ఇక చాలు ఆపండి. మా గోడు కూడా వినండి అని రైతులు విమర్శిస్తున్నారు. పూర్తి వివరాలు..
►అమెరికాలో కాల్పులు, ముగ్గురు మృతి
అమెరికాలోని ఇల్లినాయిస్ నగరంలో శనివారం ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. క్రీడా మైదానంలోకి చొరబడి కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడువగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు..
►గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 డిస్కౌంట్
గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మనకు చాలా వరకు పద్ధతులున్నాయి. గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సిలిండర్ బుక్ చేయడం లేదా ఆయిల్ కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. లేదా ఐవీఆర్ఎస్ నెంబర్‌కి కాల్ చేసినా గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. పూర్తి వివరాలు..
►ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రజనీ.. ఆదివారం నాటికి పూర్తిగా కోలుకున్నారు. వైద్యులు పూర్తి స్థాయిలో మరోసారి పరీక్షలు నిర్వహించి.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు..
►రహానే సూపర్ సెంచరీ.. ఆధిక్యంలో టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే సెంచరీతో అదరగొట్టాడు.195 బంతులాడి 11 ఫోర్ల సాయంతో 100 పరుగులు సాధించిన రహానే తన టెస్టు కెరీర్‌లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. పూర్తి వివరాలు..
►రెండు ఫార్మాట్లకు ధోనినే కెప్టెన్!
ఈ దశాబ్దాపు అత్యుత్తమ క్రికెట్ జట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా ప‍్రకటించింది. ఇందులో మెన్స్ విభాగంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఈ దశాబ్దపు అత్యుత్తమ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం దశాబ్దపు జట్లను ఐసీసీ వెల్లడించింది. పూర్తి వివరాలు..
►ఆన్‌లైన్ లోన్ యాప్ కేసు: మరో ముగ్గురి అరెస్ట్
మొబైల్ నుంచి కేవలం ఐదు నిమిషాల్లో లక్షల లోన్ పొందండి అంటూ అమాయకులకు ఎర వేస్తారు. లోన్ తీసుకున్నాక 30 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. అడగకపోయినా అకౌంట్లో డబ్బులు జమ చేసి.. ఆ తర్వాత అధిక వడ్డీలతో వేధింపులకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment