
►ఎన్నికల పద్ధతిలో కాంగ్రెస్‌కు కొత్త చీఫ్!
వరుసగా ఎదురుదెబ్బలు తింటూ, క్షేత్రస్థాయిలో పట్టుకోల్పోతున్న పార్టీని గాడిలో పెట్టేందుకు నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వచ్చే వారం సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు..
►చిల్లర రాజకీయాల కోసమే రామతీర్థానికి చంద్రబాబు
రామతీర్ధం ఘటన ప్రతిపక్షాల కుట్ర అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు ముందు రోజే టీడీపీ ఈ కుట్ర చేసిందని, పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలు..
►పప్పునాయుడు సవాల్‌కు మేం రెడీ..
రామతీర్థం కొండపై జరిగిన దుశ్చర్యకు చంద్రబాబు, లోకేష్, అశోక్‌గజపతిరాజే కారణమని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు..
►విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణుల దాడి
రామతీర్థంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక తమను అడ్డుకున్న పోలీసులపై సైతం టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. పూర్తి వివరాలు..
►సాక్షి స్టింగ్ ఆపరేషన్: కరోనా టెస్టులే లేకుండా సర్టిఫికేట్లు
హైదరాబాద్‌లో ఉన్న ఆస్పత్రులు, క్లీనిక్‌లలో అసలేం జరుగుతోంది? నిజంగా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పేవన్నీ పాజిటివ్ కేసులేనా? నెగెటివ్ రిపోర్టులన్నీ వాస్తవంగా నెగటివ్ కేసులేనా? హైదరాబాద్‌లో కరోనా రిపోర్టుల విషయంలో పెద్ద గోల్‌మాల్ నడుస్తోంది. సాక్షి సీక్రెట్ కెమెరాలో ఆ తతంగం బయటపడింది. పూర్తి వివరాలు..
►తొలి విడతలో 3 కోట్ల మందికి టీకా ఉచితం : కేంద్ర మంత్రి
కరోనా వైరస్ టీకా విషయంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. తొలి విడతలో మూడు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఉచితంగా కరోనా టీకా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. వీరిలో కోటి మంది హెల్త్‌కేర్ వర్కర్లు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఉంటారని వెల్లడించారు. పూర్తి వివరాలు..
►వ్యాక్సిన్: సుబ్రమణియన్ స్వామి కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా అతిత్వరలోనే అందుబాటులోకి రానుందని భావిస్తున్న కరోనా వైరస్ టీకాకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు..
►డబ్బున్నోళ్లకు కోపం వస్తే అంతే!
బాగా డబ్బున్న వాళ్లకు కోపం వస్తే అంతే సంగతులు. ముందూ వెనక ఆలోచించకుండా అనుకున్నది చేస్తారు. మన ఎలాన్ మస్క్ అదే చేశారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న ఆయన ఆస్తి విలువ ‘ఫోర్బ్స్’ కథనం ప్రకారం 153.5 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు కోటీ పదమూడు లక్షల కోట్ల రూపాయలు. పూర్తి వివరాలు..
►ఇక మార్కెట్ల చూపు టీసీఎస్‌వైపు
వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా కోవిడ్-19 వ్యాక్సిన్లు, సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ ప్రకటించనున్న ఫలితాలు నడిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి దేశీయంగానూ వ్యాక్సిన్ల వినియోగం ప్రారంభంకానుండటంతో సెంటిమెంటు మరింత బలపడనున్నట్లు తెలియజేశారు. పూర్తి వివరాలు..
►అనుకొని అతిథి.. షాక్ అయిన సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇంటికి అనుకోని అతిథి వచ్చింది. దీంతో ఆ అతిథిని చూసి షాక్ అయిన అక్కీ ఈ విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ఫోన్ చార్జింగ్ పెట్టుకునేందుకు సాకెట్ దగ్గరికి వెళ్లిన ఆయనకు ఎలక్ట్రిక్ సాకెట్‌లో కప్ప కనిపించింది. పూర్తి వివరాలు..
►'దాదా.. నువ్వు త్వరగా కోలుకోవాలి'
టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం తన ఇంట్లోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో ఆయన విలవిల్లాడిపోయారు. పూర్తి వివరాలు..
►కేంద్ర మాజీ హోం మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్(86) కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా బూటా సింగ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment