సూపర్‌ సే ఊపర్‌..పెద్దాయన స్టెప్స్‌కు నెటిజన్లు ఫిదా! | Uncle dances to Sajna Tere Pyar Mein Viral video | Sakshi
Sakshi News home page

Viral Dance Video: సూపర్‌ సే ఊపర్‌.. నెటిజన్లు ఫిదా!

Published Wed, Jul 21 2021 6:59 PM | Last Updated on Wed, Jul 21 2021 8:56 PM

Uncle dances to Sajna Tere Pyar Mein Viral video - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుర్రకారే డాన్స్‌ చేయాలా? వయసు పైబడితే ఏమి..అంటూ  అదరిపోయే స్టెప్పులతో ఈ మధ్య సోషల్‌ మీడియా సంచలనం రేపుతున్నారు. తాజాగా  ఓ పెద్దాయన ఏజ్‌ ఈజ్ జస్ట్‌ నంబర్‌ అని మరోసారి నిరూపించారు.  యూత్‌ఫుల్‌ బాలీవుడ్ సాంగ్‌కు ఆకట్టుకునే డ్యాన్స్‌తో ఇరగ దీశారు. ఈ  డ్యాన్సింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 

2002 నాటి బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘ క్యా దిల్ నే క‌హా’ లోని  ‘స‌జ్నా తేరే ప్యార్ మే’ సాంగ్‌కు పెద్దాయన  తన  డ్యాన్స్ మూమెంట్స్‌తో  అదరగొట్టేశారు.  దీంతో సూపర్‌సే ఊపర్‌  అని  నెటిజ‌న్లు కామెంట్‌ చేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడిది, డ్యాన్స్‌ చేసిన ఆయన ఎవరు లాంటి వివరాలపై స్పష్టత లేదు. కానీ  ఈ  సరదా సరదా  వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement