![Uttar Pradesh: 5 Dead Including 3 Children As Car Falls Into Gorge - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/8/car_0.jpg.webp?itok=aGbEWT5l)
ప్రమాదంలో ధ్వంసమైన కారు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మవు జిల్లా లోని దోహ్రిఘాట్ హైవేపై.. కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన.. గత శనివారం (ఆగస్టు7) అర్ధరాత్రి జరిగినట్లు తెలిపారు. డోరిగాట్ ప్రాంతంలోని ఒక కుటుంబం.. గోరఖ్‌పూర్ జిల్లాలోని చుట్బ ప్రాంతంలోని.. తమ బంధువుల ఇంటికి కారులో బయలుదేరారు. కాగా, కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కారు... అతివేగంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న లోయలో పడింది.
స్థానికులు సమాచారంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారును క్రేన్ సహయంతో బైటకు తీశారు. కారులో ఉన్న ఐదుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందారని, చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. కాగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని .. స్థానికుల సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి.. మృత దేహలను పోస్ట్‌మార్టం నిర్వహించడానికి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ సంఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని సీఎం యోగి.. వైద్యులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment