Gorakhpur tragedy
-
బంధువులను కలవడానికి కారులో బయలుదేరారు.. అంతలోనే..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మవు జిల్లా లోని దోహ్రిఘాట్ హైవేపై.. కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన.. గత శనివారం (ఆగస్టు7) అర్ధరాత్రి జరిగినట్లు తెలిపారు. డోరిగాట్ ప్రాంతంలోని ఒక కుటుంబం.. గోరఖ్‌పూర్ జిల్లాలోని చుట్బ ప్రాంతంలోని.. తమ బంధువుల ఇంటికి కారులో బయలుదేరారు. కాగా, కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కారు... అతివేగంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న లోయలో పడింది. స్థానికులు సమాచారంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారును క్రేన్ సహయంతో బైటకు తీశారు. కారులో ఉన్న ఐదుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందారని, చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. కాగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని .. స్థానికుల సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి.. మృత దేహలను పోస్ట్‌మార్టం నిర్వహించడానికి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ సంఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని సీఎం యోగి.. వైద్యులకు సూచించారు. -
నా తప్పేంటో తెలీట్లేదు.. యోగి చేతుల్లో నా జీవితం
లక్నో: గోరఖ్‌పూర్ చిన్నారుల మృత్యుఘోష ఉదంతంలో డాక్టర్ కఫీల్ ఖాన్ ఊరట పొందారు. బుధవారం అలహాబాద్ బెయిల్ మంజూరు చేయటం తెలిసిందే. దీంతో శనివారం ఆయన్ని జైలు నుంచి విడుదల చేశారు. బయటకు వచ్చాక భావోద్వేగానికి గురైన ఆయన మీడియా ముందు రోదించారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా ఛానెల్ ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. ‘నేను మానసికంగా చాలా కుంగిపోయాను. నెలల తర్వాత నా కుటుంబాన్ని కలిశాను. నేనేం తప్పు చేశాను? అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? జైల్లో గంటల తరబడి మధన పడేవాడిని. ఓ వైద్యుడిగా.. ఓ భారతీయుడిగా... అంతకు మించి ఓ తండ్రిగా... నేను చేయాల్సింది చేశాను. పిల్లల కోసం ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించాను. కానీ, వారి చావుకు నేను కారణమంటూ నాపై నిందలేయటంతో ప్రాణం పోయినంత పనైయ్యింది... ... నా భవిష్యత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేతుల్లోనే ఉంది. జైల్లో ఉండగా నా విషయంలో ఆయన స్పందించలేదు. కనీసం ఇప్పుడైనా కనికరించి నాపై సస్పెన్షన్ ఎత్తేస్తే.. తిరిగి విధుల్లో చేరి సేవలు కొనసాగిస్తా. లేకుంటే ఏ తప్పు చేయకపోయినా జీవితాంతం నరకం అనుభవించాల్సిందే’ అని కఫీల్ తెలిపారు. పిల్లల మరణాలకు కారకులెవరన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఈ విషయాన్ని ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశానన్నారు. ‘నిధుల నిలిపివేతతో ఆక్సిజన్ సరఫరా కంపెనీకి బకాయిలు చెల్లించలేకపోయామని.. దీంతో సదరు కంపెనీ ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా నిలిపేసిందని, 14 సార్లు సదరు కంపెనీ లేఖలు రాసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో కఫీల్ ఖాన్ భార్య షబిస్తా ఖాన్ కాగా, ఆ లేఖను కఫీల్ జైల్లో ఉండగానే రాయగా.. దానిని కఫీల్ భార్య షబిస్తా మీడియాకు విడుదల చేశారు. తన భర్తకు జైల్లో ఉండగా గుండెపోటు వచ్చినా కూడా జైలు అధికారుల సరైన వైద్యం అందించలేకపోయారని, తన భర్త పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కఫీల్‌పై ఆరోపణలు... గోరఖ్‌పూర్ బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో గతేడాది ఆగస్ట్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందారు. ఆ సమయంలో సొంత డబ్బులతో కఫీల్‌ఖాన్ సిలిండర్లు తెప్పించి చికిత్స అందించటంతో ఆయన్ని హీరోగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. అయితే ఆస్పత్రిలో ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నా.. తనను తాను 'పిల్లల రక్షకుడి'గా చూపించుకునేందుకు ఆయన కల్పిత కథనాలు సృష్టించారని, అసలు పిల్లల మరణానికి కారకుల్లో కఫీల్ కూడా ఒకరని ఆస్పత్రి వర్గాలు దర్యాప్తు బృందానికి నివేదించాయి. గోరఖ్‌పూర్‌లో కఫీల్‌ఖాన్‌కు 50 పడకల ప్రైవేటు పిల్లల ఆస్పత్రి ఉందని, దీనిని డెంటిస్ట్ అయిన కఫీల్ భార్య షబిస్తా ఖాన్ నడుపుతుందంటూ ఆరోపించాయి. ఈ పరిణామాలతో కఫీల్ ఖాన్‌పై వైద్య విభాగం వేటు వేయగా.. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం కఫీల్ కుటుంబసభ్యులు ఆరుసార్లు ప్రయత్నించారు. చివరకు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసినందున కస్టడీలో కఫీల్ ఉండాల్సిన అవసరం లేదని కోర్టు ఆయన్ని విడుదల చేసింది. -
గోరఖ్‌పూర్ ఉదంతం.. ఆ డాక్టర్ అరెస్ట్
సాక్షి, గోరఖ్‌పూర్: ఉత్తర ప్రదేశ్ లో బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 30 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన ఉదంతంలో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వైద్యుడు డాక్టర్ కఫీల్ ఖాన్‌ను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సిలిండర్ల కొరతకు ప్రధాన కారణం కఫీలేనన్న ఆరోపణలు ఉన్నాయి. మెదడువాపు వ్యాధి విభాగాన్ని నోడల్ అధికారిగా ఉన్న కఫీల్ ఖాన్, డెంటిస్ట్ అయిన భార్యతో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రి కోసం బీఆర్డీ ఆస్పత్రి నుంచే సిలిండర్లను తరలించాడని, తద్వారా సిలిండర్ల కొరత ఏర్పడి పిల్లల మరణాలు సంభవించాయని ఆరోపణలు వినిపించాయి. ఇందుకు ఘటన జరిగిన సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ ఆర్కే మిశ్రా కూడా సహకరించాడని విచారణలో తేలింది. సొంత డబ్బులతో పిల్లల కోసం సిలిండర్లు కొంటున్నట్లు కలరింగ్ ఇచ్చి ‘హీరో’గా మీడియాకెక్కిన కఫీల్ తర్వాత అసలు విషయం వెలుగు చూడగా సస్పెన్షన్ కు గురికావటంతోపాటు ఇప్పుడు జైలు పాలయ్యారు. -
యోగి ముందుకు గోరఖ్‌పూర్ నివేదిక
లక్నో: గోరఖ్‌పూర్ పిల్లల మరణాల ఘటనకు సంబంధించి కీలక నివేదిక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ మంగళవారం సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు రిపోర్ట్ సమర్పించారు. ఈ నేపథ్యంలో బీఆర్డీ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌తోపాటు 5 గురు సిబ్బందిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని యోగి ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని హెల్త్ సెక్రటరీ అలోక్ కుమార్, ఆర్థిక కార్యదర్శి ముకేష్ మిట్టల్, సంజయ్ గాంధీ ఆస్పత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ హేమ చంద్ర కమిటీ ఘటనపై విచారణ చేపట్టింది. జిల్లా మేజిస్ట్రేట్ రాజీవ్ రౌతెలా రిపోర్ట్‌తోపాటు తాము అధ్యయనం చేసిన వివరాలను సీఎంకు సమర్పించిన నివేదికలో పొందుపరిచింది. ఆక్సిజన్ కొరత విషయం తెలిసి కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, బకాయిల వ్యవహారం ప్రిన్సిపాల్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదని రెండు కమిటీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆగష్టు 10 నుంచి 11 మధ్య 36 మంది పిల్లలు ఆక్సిజన్ కొరతతో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో మిగతా పిల్లల మరణాల గురించి కూడా ప్రస్తావించిన కమిటీ, మెరుగైన సదుపాయాలు కల్పించాలంటూ ప్రభుత్వానికి సిఫార్సులు కూడా చేసినట్లు తెలుస్తోంది. -
మరో గోరఖ్‌పూర్ ఘటన రిపీట్ కానివ్వొద్దు
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతం. బుందేల్‌ఖండ్ ప్రాంతం ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఒకే ఒక్క ఆస్పత్రి వైపు పరుగులు తీస్తారు. 700 పడకల పెద్ద ఆస్పత్రి అది. అలాంటిది సమస్యలకు మాత్రం నిలయంగా ఉంది. ముఖ్యంగా గోరఖ్‌పూర్ ఘటన తరహా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా లేమి ఇక్కడ కూడా దర్శనమిస్తోంది. బాబా రాఘవ దాస్ ఆస్పత్రి ఉదంతం అనంతరం మహారాణి లక్ష్మి బాయి కాలేజీ ఆస్పత్రి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్డీ ఆస్పత్రి మాదిరిగానే ఇక్కడా ఆస్పత్రి యాజమాన్యం సిలిండర్ల సరఫరా కంపెనీకి బకాయిలు ఉన్నారు. అయితే గోరఖ్‌పూర్ ఉదంతం అనంతరం అప్రమత్తమై రంగంలోకి దిగిన అధికారులు హుటాహుటినా కంపెనీకి రూ. 36 లక్షలను చెల్లించేశారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే... ఆస్పత్రి, కంపెనీ ఒప్పందం ఈ యేడాది మార్చికే పూర్తయిపోయినప్పటికీ వాళ్లు ఇంకా సిలిండర్ల సరఫరాను కొనసాగించటమే. మరోపక్క టెండర్లు నిర్వహించాల్సిన ఆస్పత్రి వర్గాలు కూడా నిబంధనలను పెడ చెవిన పెట్టేశాయి. ఆస్పత్రికి రోజుకు 120 నుంచి 150 సిలిండర్ల అవసరం ఉండగా, కేవలం 25 నుంచి 50 సిలిండర్లను మాత్రమే వాళ్లు సరఫరా చేయగలుగుతున్నారు. సిలిండర్లు సప్లై చేస్తున్న గౌరీ గ్యాస్ కంపెనీ చాలా చిన్నది కావటంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ఇదే ఆస్పత్రిలో సేవలు అందించిన రిటైర్డ్ వైద్యుడు ఒకరు తెలిపారు. ఇలాంటి సమయంలో బీఆర్డీ ఆస్పత్రి మాదిరి జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే తాను 18 ఏళ్లుగా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నానని, ఖరగ్‌పూర్ ఘటన మాదిరి పరిస్థితులు ఇక్కడేం కనిపించలేదని విధులు నిర్వహిస్తున్న మరో వైద్యుడు చెబుతున్నాడు. కానీ, రోగుల అనుభవాలు మాత్రం భయానకంగా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి ఆయింట్ మెంట్ పూయటం తప్ప వేరే చికిత్స చేయకపోవటం, రైలు నుంచి కింద పడి గాయపడ్డ ఓ బాలుడికి స్ట్రెచ్చర్ కూడా అందించకపోవటం లాంటి పరిస్థితులు అక్కడ దర్శనమిచ్చాయి. యూపీతోపాటు మధ్యప్రదేశ్ నుంచి ఏడు జిల్లాల ప్రజలు నిత్యం ఇక్కడకు చికిత్స కోసం వస్తుంటారు. యూపీలో దాదాపు ప్రతీ ఆస్పత్రిలో ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల జాప్యం, అరకోర సిబ్బంది వంటి సమస్యలే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని దూరం చేస్తున్నాయి. కనీసం ఇప్పుడు విమర్శల నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటే గోరఖ్‌పూర్ తరహా మృత్యు ఘోషలు పునరావృతం కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘గోరఖ్‌పూర్’ చెప్పే పాఠం
విశ్లేషణ దేశ రాజకీయాలకు అరోగ్యమే ప్రాతిపదిక కావాలని నా ఆకాంక్ష. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య శాఖల ముందు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాలని నా కామన. పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలో ఆరోగ్య బడ్జెట్లపైనా, ఆరోగ్య విధానాలపైనా పెద్ద ఎత్తున చర్చలు సాగడం నా కోరిక! ఇవన్నీ జరిగి ఉంటే, గోరఖ్‌పూర్ విషాదాన్ని చూడాల్సి వచ్చేదే కాదు. అది జరిగినది ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో కాబట్టి, అంతా ఆయనపైనా, బీజేపీపైనా, యూపీ ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. వారి నిర్లక్ష్యం క్షమార్హం కానిదేగానీ.. అలాంటి ప్రమాదాలు దేశంలోని ఏ ప్రభుత్వ అసుపత్రుల్లోనైనా జరిగే అవకాశం ఉందనేది నిజం. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ‘‘ఆవో బచ్చో తుమే దిఖా ఝాన్కి హిందుస్థాన్ కీ...’’ (రండి పిల్లలూ చూపిస్తా మీకు భారతదేశం అంటే ఏమిటో) అనే పాట రేడియోలో వినవచ్చింది. సరిగ్గా అదే సమయంలో నేను, కేవలం ఆక్సిజన్ లేక పోవడం వల్లనే హిందుస్థాన్‌ను కను విప్పి ఒక్కసారైనా చూడకుండానే ఈ ప్రపంచాన్ని వీడిన గోరఖ్‌పూర్ శిశువుల గురించి అదే పనిగా ఆలోచిస్తున్నాను. ‘‘యే ధర్తీ హై బలిదాన్ కీ!’’ (త్యాగ ధరిత్రి ఇది) అనేది ఆ పాటలోని మరో చరణం. ఈ దేశ రాజకీయాలకు ఆరోగ్యమే ప్రాతిపదిక కావాలని నా ఆకాంక్ష. ప్రభుత్వ ఆసుపత్రుల ముందు, ఆరోగ్య శాఖల ముందు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాలని నా కామన. పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలో ఆరోగ్య బడ్జెట్లపైనా, ఆరోగ్య విధానాలపైనా పెద్ద ఎత్తున చర్చలు సాగడం నా కోరిక! ఇవన్నీ జరిగి ఉంటే, నేడు మనం గోరఖ్‌పూర్ విషాదాన్ని చూడాల్సి వచ్చేదే కాదు. గోరఖ్‌పూర్ విషాదం గురించి చాలానే చెప్పారు. కానీ, మాట్లాడినంత ఎక్కువగా దాని గురించి బహుశా ఆలోచించి ఉండకపోవచ్చు. ఆ విషాదం సంభవించి నది యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో. కాబట్టి, అంతా ఆయనపైనా, బీజేపీపైనా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. వారి నిర్లక్ష్యం క్షమార్హంకానిదేగానీ... అలాంటి ప్రమాదాలు దేశంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైనా జరిగే అవకాశం ఉందనేది నిజం. ఈ ప్రమాదం, మనం ఎదుర్కొంటున్న పెద్ద రుగ్మతకు సంబంధించిన చిన్న లక్షణం మాత్రమే. గోరఖ్‌పూర్ నుంచి మనమేవైనా గుణపాఠాలను నేర్చుకోవాలంటే, చర్చను ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వానికే పరిమితం చేయడానికి బదులు దేశంలోని ప్రజారోగ్య వ్యవస్థ దుస్థితిని గురించి చర్చించడం అవసరం. వైద్య అవసరాలు పెరిగి, ఖర్చులు కొండెక్కి.. ఆసుపత్రి బిల్లులు, డాక్టర్ బిల్లులు నేడు సాధారణ కుటుంబం మెడ మీద కత్తిలా కదలాడుతున్నాయి. చాలా కుటుంబాల విషయంలో కుటుంబ సభ్యులలో ఎవరి కైనా ఏదైనా పెద్ద జబ్బు చేస్తే, ఆ కుటుంబం వెన్ను విరి గిపోవడమే అవుతోంది. కుటుంబ సభ్యులలో ఒకరు ఎవరైనా పెద్ద వ్యా«ధులకు గురికావడం... పేదరిక రేఖకు ఎగువన జీవిస్తున్న కుటుంబాలు పేదరిక రేఖకు దిగువకు దిగజారిపోవడానికి ముఖ్య కారణమని పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వారికి మంచి, చౌక చికిత్సను అందించడమూ లేదు, ప్రైవేటు వైద్యం చేయిం చుకునేవారికి సహాయం చేయడమూ లేదు. ఈ జీవన్మరణ పోరాటంలో పేద కుటుంబాలే కాదు, ఎంతో కొంత మెరుగ్గా ఉన్న కుటుంబాలు సైతం నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సగటు భారతీయుల ఆరోగ్యం మెరుగుపడింది. 1947లో 32 ఏళ్లుగా ఉండిన భారతీయుల సగటు జీవిత కాలం దాదాపు 68 ఏళ్లకు పెరిగింది. శిశు మరణాల సంఖ్య వెయ్యి జననాలకు 146 నుంచి 40కి తగ్గాయి. తల్లుల ప్రసవ కాల మరణాలు సైతం గణనీయంగా తగ్గాయి. ఆరోగ్య సదుపాయాలు సైతం చాలా మెరుగుపడ్డాయనడంలో సందేహం లేదు. డాక్టర్ల సంఖ్య, ఆసుపత్రుల సంఖ్య పది రెట్ల కంటే ఎక్కువే పెరిగింది. అయినా అది అవసరమైనదాని కంటే చాలా తక్కువే. అలాగే ఔషధాల ఉత్పత్తి సదుపాయాలు, వైద్య పరీక్షలు కూడా పెరిగాయి. ప్రభుత్వం తరచుగా తాము సాధించినవాటి గురించి చెప్పుకోవడానికి ఈ గణాంకాలనే ఉపయోగిస్తుంటుంది. కానీ ఇది అర్ధ సత్యం మాత్రమే. సగటు జీవిత కాలం, వైద్య సదుపాయాల విస్తరణ జరిగినా ప్రజలు అనుభవిస్తున్న బాధలు మాత్రం తగ్గలేదు, సరికదా, వాస్తవానికి మరింత పెరిగాయనేది పూర్తి సత్యం. సగటు జీవిత కాలం పెరుగుదల, శిశు మరణాల సంఖ్య తగ్గుదల కారణంగా వైద్యసదుపాయాల అవసరం మునుపెన్నటికంటే ఎక్కువగా పెరి గింది. తిండి, బట్ట, నివాసం వంటి అవసరాలు సమకూరాక విద్య, ఆరోగ్యం జీవితానికి అత్యావశ్యకాలుగా మారాయి. ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండటం వ్యాధులకు చికిత్స చేయించుకోవాలనే కోరికను, తప్పనిసరితనాన్ని కూడా సృష్టిస్తోంది. అంటే, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వల్ల నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సదుపాయాల అవసరం తగ్గలేదు. నిజానికి ఆ అవసరం మరింత పెరిగింది. ప్రభుత్వ శ్రద్ధ లేకనే ప్రైవేటు వైద్యం ఆ అవసరాన్ని తీర్చాలంటే ప్రభుత్వం, ప్రభుత్వరంగ ఆరోగ్య సేవలను భారీ ఎత్తున విస్తరింపజేసి ఉండాల్సింది. కానీ అది జరగలేదు. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో కనీసం 3 శాతాన్ని వైద్య రంగంపై ఖర్చు చేయాలనే డిమాండు గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య రంగంపై చేసే మొత్తం వ్యయం దాదాపుగా జీడీపీలో 1 శాతం వద్ద నిలిచిపోయింది. తాజా గణాంక సమాచారం ప్రకారం మనం ఆరోగ్య రంగంపై చేస్తున్న వ్యయం జీడీపీలో 1.2 శాతం మాత్రమే. కాగా, ఇది చైనాలో 2.9 శాతం, బ్రెజిల్లో 4.1 శాతం, బ్రిటన్‌లో 7.8 శాతం, అమెరికాలాంటి పెట్టుబడిదారీ దేశంలో 8.5 శాతం. ఆరోగ్య రంగంపై చేయాల్సిన కనీసమైన ఖర్చులో కేవలం మూడోవంతు మాత్రమే మన ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నది కఠోర సత్యం. ఆరోగ్యసేవల అవసరం పెరుగుదల, ప్రభుత్వం శ్రద్ధ కనబరచకపోవడం ఫలితమే ఆరోగ్యరంగ ప్రైవేటీకరణ. మహా నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు కొత్త ఆసుపత్రులు, వైద్యశాలలు భారీ ఎత్తున పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గ్రామీణ ప్రాంత రోగులలో 72 శాతం, నగర ప్రాంత రోగులలో 79 శాతం ప్రైవేటు డాక్టర్ వద్దకు వెళ్లాలని కోరుకుంటున్నారు. తీవ్ర వ్యాధుల విషయంలో గ్రామీణ ప్రాంత రైతులలో 58 శాతం, నగర ప్రాంతాల ప్రజలలో 68 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటు ఆసుపత్రులనే ఎంచుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ మందగించిందిగానీ, ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం వర్ధిల్లుతూనే ఉన్నాయి. దీనికితోడు అక్కడి ఫీజులు అసమంజసమైనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఒక సగటు భారతీయ కుటుంబం ఆరోగ్య సదుపాయాల కోసం చేసే ఖర్చు, ఆదాయంలో 7 శాతం మాత్రమే. కొత్త పరీక్షలు, శస్త్రచికిత్సలు, ‘‘సదుపాయాలు’’ ప్రవేశిస్తున్నాయి. అవి తరుచుగా ఈ రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు పెరి గిపోవడానికి కారణం అవుతున్నాయి. ప్రభుత్వ లేదా సొంత ఖర్చుతో సమకూర్చుకునే ఆరోగ్య బీమా సదుపాయం ఉన్నది 18 శాతం ప్రజలకే. మిగతా వారందరివీ దైవాధీనం బతుకులే. రాజకీయం చేస్తే తప్ప సమస్యలు పట్టవు గోరఖ్‌పూర్ ప్రభుత్వరంగ సేవల దుస్థితికి చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వ ఆరోగ్య సేవలను రాజకీయ సమస్యగా మారిస్తే తప్ప ఈ పరిస్థితి మెరుగుపడదు. ఈ సూచనను విని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ‘రాజకీయాలు’ ‘రాజకీయం’ అంటేనే అవి ప్రతి సమస్యకూ మూల కారణమే తప్ప, పరిష్కారాలు కావనిపించేం తగా మనం ఆ పదాలను ప్రతికూలాత్మకమైన అర్థాన్ని ఇచ్చేవిగా చేసేశాం. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక సమస్యను రాజకీయమైనదిగా చేసిన ప్రతిసారీ, ఎన్నికల్లో ఓడిపోతామని రాజకీయవేత్తలు భయపడతారు, ప్రభుత్వాలు ఆ సమస్య పట్ల శ్రద్ధ చూపడం తప్ప గత్యంతరం లేని స్థితి ఏర్పడుతుంది. అది సమస్యను పూర్తిగా పరి ష్కారం చేయదుగానీ, కొంత పురోగతిని సాధిస్తుంది. ఆకలి, ద్రవ్యోల్బణం రాజకీయ సమస్యలుగా మారినప్పుడే దేశవ్యాప్తంగా రేషన్ దుకాణాలను ప్రవేశపెట్టారు. కొన్నేళ్ల క్రితం విద్యుత్ సరఫరాను, రోడ్ల పరిస్థితిని ఎన్నికల సమయంలో రాజకీయం చేశారు. ఫలి తంగా ఆ రెండు సమస్యల విషయంలోనూ గణనీయమైన మెరుగుదల కనిపించింది. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక రైతులు రాజకీయంగా గొంతెత్తడంతో, ఆ రాష్ట్రాల ప్రభుత్వ విధానాలలో పెద్ద మెరుగుదల సంభవించింది. కాబట్టి రాజకీయం చేయడాన్ని నివారించడం కాదు, అందుకు బదులు ప్రతి ప్రధాన సమస్యను రాజకీయాల పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది. మహిళల పట్ల హింసకు, ప్రభుత్వ పాఠశాలలోని విద్య, ప్రభుత్వ ఆసుపత్రులలోని చికిత్స రాజకీయ సమస్యలుగా మారితే తప్ప... ప్రభుత్వం వాటిపట్ల మౌనంగానే ఉండిపోతుంది. పరిస్థితిలో ఏ మార్పూ ఉండదు, గోరఖ్‌పూర్ విషాదం పునరావృతం అవుతూనే ఉంటుంది. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు ‘ మొబైల్ : 98688 88986 -
గోరఖ్‌పూర్ ఘటన నివేదికలో ఏముందంటే...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 72 మంది చిన్నారులను బలితీసుకున్న గోరఖ్‌పూర్ బాబా రాఘవ దాస్ ఆస్పత్రి ఉదంతంపై విచారణ కమిటీ నివేదిక వచ్చింది. కేవలం ఆక్సిజన్ కొరత కారణంగానే 30 మంది చిన్నారులు చనిపోయారంటూ జిల్లా మెజిస్ట్రేట్ రూపొందించిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సుమారు 30 మంది పిల్లలు ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగానే చనిపోయారన్న విమర్శలు రావటంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆగస్టు 12న ఖరగ్‌పూర్ జిల్లా మెజిస్ట్రేట్ రాజీవ్ రౌతెలా నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీ వైద్యులను, ఆస్పత్రి సిబ్బందితోపాటు రోగులను ప్రశ్నించిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది. "బీఆర్డీ ఆస్పత్రిలో ఆగస్టు 10 సాయంత్రం నుంచే ఆక్సిజన్ సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి మరుసటి రోజు అంటే ఆగస్టు 11వ తేదీ వరకు ఆ 48 గంటల్లో 30 మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోయారు" అని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఘటనకు కాలేజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రాదే పూర్తి బాధ్యతని స్పష్టం చేసింది. సిలిండర్ల కొరత విషయం తెలిసి కూడా ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకెళ్లలేదని, కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తత చేయలేకపోయారని తెలిపింది. కనీసం ఆగష్టు 9న యోగి పర్యటన సందర్భంగా అయినా మిశ్రా అసలు విషయం తెలపకుండా సెలవుపై వెళ్లటం గురించి కూడా కమిటీ ప్రస్తావించింది. వీటితోపాటు బకాయిలు చెల్లించలేదన్న కారణంగా సిలిండర్లను సరఫరా నిలిపివేసిన పుష్పలీల సంస్థపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు చికిత్స విషయంలో వైద్యులు కూడా నిర్లక్ష్యం వహించారని నివేదికను రూపొందించారు. వీరితోపాటు ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ కఫిల్ ఖాన్, ఆస్పత్రి వ్యవహారాల కొనుగోలు కమిటీ సభ్యులు డాక్టర్ సతీష్ కుమార్, పారామెడికల్ సిబ్బంది, ఫైనాన్షియల్ క్లర్క్ తదితరులు కూడా బాధ్యులేనని పేర్కొంది. అయితే నివేదిక తమకు అందిన మాట వాస్తవమేనని చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపినప్పటికీ అందులో ఉన్న అంశాలపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
గోరఖ్‌పూర్ గుణపాఠం
సందర్భం గోమాతల సంరక్షణ పేరుతో 40 కోట్ల నిధులు విడుదల చేసిన యూపీ ప్రభుత్వం, పసిపిల్లల ప్రాణాలు లెక్కలోకి తీసుకోలేదు. ఆ నిర్లక్ష్యం ఫలితమే.. 130 మంది పసిపిల్లల బలి. తెలుగు రాష్ట్రాలకూ ఇది హెచ్చరికే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సొంత నియో జకవర్గం గోరఖ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రి బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజీలో దేశ చరిత్ర లోనే కనీవినీ ఎరుగని ఘోరం జరిగింది. కేవలం ఏడు రోజుల్లో 72 మంది పసిమొగ్గల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కార ణం కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పసిపిల్లలకు ప్రాణ వాయువు అందజేయలేకపోవడం, తీవ్రమైన మెదడువాపు వ్యాధితో బాధపడుతున్న 156 మంది పిల్లలకు ఆక్సిజన్ అత్యవసరం కానీ, సరఫరాదారుకు 75 లక్షల రూపాయలు ఆదిత్యనాథ్ సర్కారు బాకీ పడింది. దాంతో ఆ సరఫరా దారు నా డబ్బు చెల్లించనిదే ఆక్సిజన్ సరఫరా చేయలేనని మొత్తుకున్నారు. ఆసుపత్రికి ఆక్సిజన్ అత్యవసరమని వైద్యులు అరచి గీ పెట్టినా ప్రభుత్వం బకాయి చెల్లించడంలో విఫలమైంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. గోమాతల సంరక్షణ అని రూ. 40 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, పసిపిల్లల ప్రాణాలు లెక్కలోకి తీసుకోలేదు. నిర్లక్ష్యం వహించింది. ఏకంగా ఒకేరోజు 38 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతే మరుసటి రోజు మరో 30 మంది కేవలం ఆక్సిజన్ అందక ఆయువులు కోల్పోయారు. ఈ ఘటన జరిగినందుకు కాక దేశవ్యాప్తంగా ఈ ఘటనపై విమర్శలు రావడంతో బిత్తరపోయిన ఆదిత్య నాథ్ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలు పోలేదు. ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేని కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే మిశ్రాను విధుల నుంచి తప్పించి, తప్పు కప్పిపుచ్చు కోవాలని చూసింది. ప్రభుత్వం వైద్యుణ్ని విధుల నుంచి తప్పించిందే కానీ, మరణ మృదంగాన్ని ఆపలేకపోయింది. తన సొంత డబ్బులతో, పరపతితో కొంతమంది పిల్లలకు ఆక్సిజన్ అందించి ప్రాణాలు ప్రసాదించిన వైద్యుడు ఖఫీల్ ఖాన్‌ను నోడల్ అధికారిగా తొలగించి, తన బుర్ర పని చేయనిత నాన్ని చాటి చెప్పుకుంది ప్రభుత్వం. పుండు ఒకరికి ఉంటే, మందు మరొకరికి పెట్టినట్టు వ్యవహరించేసరికి సమస్య జటిలమై మరిన్ని విమర్శలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ రాష్ట్రంలో వివిధ రోగాల బారిన పడుతున్న చిన్నారుల్లో 47 శాతం మెదడువాపుతో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి కారణం పందిని కుట్టిన దోమ పిల్లలకి కుట్టడం. అంటే పందులు, దోమల స్వైర విహారం ఉన్నట్లు శాస్త్రీయ ఆధారాలు ఉంటే, స్వచ్ఛ భారత్ యూపీలో లేదా? నిఖార్సయిన సంఘ్‌పరివార్ వాది సీఎంగా ఉండి స్వచ్ఛ భారత్‌ను ఎందుకు అమలుపర్చడం లేదు? ఎంతసేపూ గోశాలల చుట్టే ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం తిరిగితే మనుషులను ఎవరు పట్టించుకోవాలి? తమ రాష్ట్రంలో వైద్యం అందించలేనప్పుడు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకి పిల్లల్ని తరలించి ప్రాణాలు ఎందుకు కాపాడటం లేదు? అలాగే మెదడు వాపు వ్యాధి తీవ్రంగా ఉన్న ఈ రాష్ట్రంలో, వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రజల నుంచి మీడియా నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం తలకాయ లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నది? ఘోరం జరిగిపోయాక, సుల్తాన్‌పూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల విభాగం ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద రూ.5 కోట్లు కేటాయిస్తానని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హామీ ఇచ్చారు. కాగా, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారుల మరణాలకు అధికారుల లంచగొండితనమే కారణమన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా కోసం ప్రభుత్వం రూ.68 లక్షలు విడుదల చేసినా..ఈ నెల 11 నాటికి అధికారులు కేవలం రూ.11 లక్షలే ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. గోరఖ్‌పూర్‌లోని ఆసుపత్రిలో 60 మందికి పైగా చిన్నారులు మరణించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ చీఫ్ అమిత్ షా తోసిపుచ్చారు. అదొక ప్రమాదమనీ, ఇంత పెద్ద దేశంలో అలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయనీ, ఈ తరహా ఘటన జరగడం ఇది మొదటిసారి కాదని షా వ్యాఖ్యానించారు. ఇంతటి విషాదం జరిగినా సీఎం కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా జరపాలంటూ ఆదేశాలివ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న ఈ ఘటన ప్రభుత్వం మెడకు చుట్టుకున్న పాములాంటిది అని ఒక్క ఉత్తరప్రదేశ్ సర్కార్ అనుకుంటే చాలదు. మన ప్రభుత్వాలూ ఆలో చించాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల్ని ఎలుకలకూ, చీమ లకూ, పందులకూ బలిపెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు సర్కారుకూ ఉంది. ఇటు నిలోఫర్ తదితర ఆసుపత్రుల్లో హైదరాబాద్‌లో సైతం ఎంతోమంది పిల్లలు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం పిల్లల్ని కబళించే అనేక వ్యాధులు కరాళనృత్యం చేస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, యంత్రాంగం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటే, గోరఖ్‌పూర్ ఘోరం మన దగ్గరా జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేగానీ, పిల్లలే కదా అని గాలికి వదిలేస్తే యూపీ ప్రభుత్వంలా మనం కూడా ప్రపంచం ముందు దోషులుగా నిలబడే ప్రమాదం ముంచుకురా వచ్చు. తస్మాత్ జాగ్రత్త. అచ్యుతరావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం ‘ మొబైల్ : 93910 24242 -
గోరఖ్‌పూర్ ఘటన కొత్తేం కాదు!
న్యూఢిల్లీ: గోరఖ్‌పూర్ పిల్లల మరణాల అంశం కొత్తేం కాదని, ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూర్‌లో ఉన్న ఆయన సోమవారం మీడియా మాట్లాడుతూ... చిన్నారుల మరణాలు ఘోర తప్పిదమేనని పేర్కొన్నారు. ఇక రాజీనామాల డిమాండ్ పై కూడా ఆయన స్పందించారు. "గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయటమే వాళ్లకు పనిగా మారిపోయిందని" అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే ఘటన వెనుక నిర్లక్ష్యం ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ముఖ్యమంత్రి కాలపరిమితితో కూడిన విచారణ కమిటీని నియమించారు. విచారణ పూర్తయి నివేదిక వస్తేనే కానీ ఎవరి పైనా పార్టీ చర్యలు తీసుకోదని, నేరం రుజువైతే ఎంత వారినైనా వదిలే ప్రసక్తే లేదని షా తెలిపారు. కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించే అంశంపై స్పందిస్తూ... పిల్లల మరణం ప్రతీ ఒక్కరినీ కదిలించి వేసింది. కానీ, జన్మాష్టమి ప్రభుత్వానికి సంబంధించిన పండుగ కాదని ఆయన వివరణ ఇచ్చారు. నోటీసులు పంపినా నిర్లక్ష్యం బాబా రాఘవ దాస్ ఆస్పత్రిలో ఇప్పటిదాకా 72 మంది చిన్నారులు చనిపోయారు. వీరిలో 23 మంది ఆక్సిజన్ అందకే చనిపోయారని ప్రభుత్వం పేర్కొంది. అయితే గత ఆరు నెలలుగా 14 సార్లు బిల్లు చెల్లింపుల నోటీసులు పంపించినప్పటికీ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం చేశారనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. లక్నోకు చెందిన పుష్ప సేల్స్ హెల్త్ కేర్ సంస్థ ఆస్పత్రికి 2014 నుంచి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో 63.65 లక్షల రూపాయలు ఆస్పత్రి బకాయి పడటంతో, ఈ యేడాది ఫిబ్రవరి నుంచి సదరు కంపెనీ నోటీసులు పంపుతూనే ఉంది." పెషంట్ల ప్రాణాల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉంటారనే అనుకుంటున్నాం. మీ ఆస్పత్రిలో వాళ్లకి ఆక్సిజన్ సరఫరా ఎంత ముఖ్యమైన అంశమో మీకు తెలిసే ఉంటుంది. మీరు మా కంపెనీకి చాలా బకాయి ఉన్నారు. అయినా సప్లైను ఆపలేదు. దయచేసి ఇప్పటికైనా బకాయిలు పూర్తి చేయండి. లేనిపక్షంలో సిలిండర్ల సరఫరా కొనసాగటం కష్టమౌతుంది" అని కంపెనీ న్యాయవాది వివేక్ గుప్తా పంపిన నోటీసులో స్పష్టంగా ఉంది. -
గోరఖ్‌పూర్‌లో పరిస్థితి ఘోరం.. చేజారింది
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ (బీఆర్డీ) ఆస్పత్రిలో చిన్నారుల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రభుత్వం కంటి తుడుపు చర్యలే కనిపిస్తున్నాయి. ఆస్పత్రి చీఫ్ ను తొలగించటంతోపాటు ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీదారుపై విచారణకు ఆదేశించింది. మరోవైపు, కేవలం కొందరు మాత్రమే ఆక్సిజన్ అందక చనిపోయారని స్వయంగా సీఎం యోగి ఆదిత్యానాథే ప్రకటించారు. మృతుల్లో 30మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోయినట్లు హోంశాఖ ప్రకటించగా, 21 మందేనని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఆదివారం ఉదయం మరో చిన్నారి చనిపోవటంతో ఆ సంఖ్య 65కి చేరుకుంది. మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కళ్ల ముందే కన్నపేగు కన్నుమూస్తుంటే నిస్సహాయతతో చూస్తున్న తల్లిదండ్రుల ఆవేదనపై అంతర్జాతీయ మీడియా కూడా స్పందించింది. గోరఖ్‌పూర్‌లో చిన్నారులు ఒకరి తర్వాత ఒకరి చేజారి పోతున్నారంటూ కథనం ప్రచురించింది. ఆగస్టు 7 నుంచి అక్కడ జరుగుతున్న ఘోర కలిని కూలంకషంగా వివరించింది. 'ఇది ముమ్మాటికీ ఆస్పత్రి వర్గాల తప్పే. వారి మూలంగా చిన్నారులు చనిపోతున్నారు. రాత్రి నా కొడుకు బాగానే ఉన్నాడు. తర్వాతే ఏదో జరిగింది, విగతజీవిగా మారిపోయాడు'అని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఇది విషాదం కాదు.. ముమ్మాటికీ మారణకాండే. ఆక్సిజన్ సరఫరాతో అంత మంది కన్నుమూయటం దారుణం' అని బాలలహక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ట్వీట్ చేశారు. మరోపక్క హుటాహుటినా సిలిండర్లు తెప్పించి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు యత్నించినప్పటికీ శనివారం మరో ఇద్దరు చిన్నారులు చనిపోవటంతో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. నేడు సీఎం ఆదిత్యానాథ్‌తోపాటు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డా పరిస్థితిని సమీక్షించేందుకు ఆస్పత్రికి వెళ్లనున్నారు.