
జైపూర్: భూమిపై ఉండే అన్ని బంధాలలో తండ్రి, కూతుళ్ల బంధం చాలా ప్రత్యేకమైంది. ఈ బంధంలో సరదాలు, భావోద్వేగాలు నిండి ఉంటాయి. తండ్రి కూతురు స్నేహితుల్లా ప్రతి విషయాన్ని పంచుకోవడం సరదాగా ఉండటం మాత్రం సినిమాల్లో ఎక్కువగా చూస్తాము. నిజ జీవితంలో ఇలాంటి తండ్రి కూతుళ్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే రాజస్తాన్‌కు చెందిన ఈ తండ్రికూతుళ్ల బంధం ఎంత సరదాగా ఉందో తాజా సంఘటన చూస్తే తెలుస్తోంది.
రాజస్థాన్‌కు చెందిన రూపశ్రీ తన బర్త్ డే సందర్భంగా ఆమె తండ్రి వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపిన వాట్సప్ చాట్‌ను గురువారం ట్విటర్‌లో పంచుకుంది. దీనికి ‘కూతురిగా నాకు అర్హత లేదు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె 21వ పుట్టిన రోజున తన తండ్రి ‘హ్యాపీ బర్త్ డే మను బేటా. ఈ రోజు ఉదయం నువ్వు ఏడవడం చుశాను. ఇకపై అర్హత లేని వ్యక్తులం ఏడవం ఆపేస్తావని ఆశిస్తున్నాను. నీకు ఇప్పుడు 21 సంవత్సరాలు, నీ విలువ నీకు తెలుసు. మన జీవితంలో మనుషులు వస్తుంటారు, పోతుంటారు. నువ్వు దాన్ని మార్చలేవు కాబట్టి నీ విలువ తెలుసుకో అలాగే ఇక నుంచి అర్హత లేని వారి కోసం ఏడవడం మానేయి’ అంటూ ఆమె తండ్రి బర్త్‌డే విషెస్ చెప్పాడు. (చదవండి: ‘సోషల్’ కూత.. టీఆర్‌ఎస్ జోరు)
I don't deserve my parents. pic.twitter.com/8tkf3ONSXz
— Rupashree//Raj stan acct (@jstalittleextra) September 15, 2020
అంతేగాక తన డైట్‌పై కూడా సరదాగా కామెంటు చేస్తూ స్నేహితుడిలా సలహా ఇచ్చిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ‘‘రోజు రోజుకు ఏనుగు పిల్లలా అవుతున్నావు. నువ్వు నీ డైట్‌ను మార్చుకోవాలి. అయినా అర్హత లేని మనుషుల కోసం ఏడవడం కంటే బిర్యానీ కోసం ఏడవడం మేలు. ఇక ప్రశాంత కోసం హనుమాన్ చాలిసా చదవమని నీకు చాలా సార్లు చెప్పాను. అంతేకాదు నిన్ను వేధించడానికి ప్రయత్నించిన వారి ఎముకలు విరగగోట్టే అంత ధైర్యవంతురాలిలా ఉండాలి’’ అంటూ తన కూతురికి ఆ తండ్రి సలహా ఇచ్చాడు. ఈ ట్వీట్‌కు ఇప్పటి వరకు వేలల్లో లైక్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ తండ్రికూతుళ్ల మధ్య ఉన్న సన్నిహిత్యానికి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ‘ఆయన ఎంత మంచి తండ్రో ఆ ఏనుగు ఉదాహరణ చూస్తే అర్థం అవుతోంది. మీరు చాలా గొప్ప తండ్రి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: దొంగ కోతి: ఫోన్ ఎత్తుకెళ్లి సెల్ఫీలు)
Comments
Please login to add a commentAdd a comment