తోడేలులా ప్రవర్తిస్తున్న యువకుడు | Wolf Jackal and Dog the Man Created Terror | Sakshi
Sakshi News home page

తోడేలులా ప్రవర్తిస్తున్న యువకుడు

Published Wed, Sep 4 2024 1:26 PM | Last Updated on Wed, Sep 4 2024 1:26 PM

Wolf Jackal and Dog the Man Created Terror

ముజఫర్‌నగర్‌: యూపీలోని బహ్రయిచ్‌ తోడేళ్ల దాడులతో వణికిపోతోంది. తాజాగా ముజఫర్‌ నగర్‌లోనూ ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. అయితే ఇక్కడ దాడులకు పాల్పడుతున్నది ఏ తోడేలో, కుక్కనో కాదు.. ఒక యువకుడు. వినడానికి విస్తుపోయేలా ఉన్నా  ఇది నిజం.

వివరాల్లోకి వెళితే యూపీలోని ముజఫర్‌నగర్‌లో  ఓ యువకుడు నరమాంస భక్షకునిగా మారి, పలువురిని కరుస్తునాడు. అతను సృష్టిస్తున్న భీభత్సానికి స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. ఆ యువకుడు ఓ మహిళతో పాటు ఓ బాలికను  గట్టిగా కరిచాడు. అతని దాడి నుంచి బాధిత మహిళను బాలికను ఆ దారినపోతున్నవారు అతికష్టం మీద కాపాడారు.

ఆ యువకుడు కుక్కల వెంట పరిగెడుతూ, వాటిని భయపెట్టడంతో పాటు దారినపోయినవారిని కొరుకుతూ గాయపరుస్తున్నాడు. ఈ నేపధ్యంలో ‍స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని, తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement