నిర్మల్
‘టీచర్’లో కమలం పాగా
వ్యవసాయంలో ఆదర్శం
తానూరు మండలం బోంద్రట్‌కు చెందిన సాయినాథ్ గోఆధారిత, సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. ఉత్తమ రైతు పురస్కారం కూడా అందుకున్నాడు.
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
● అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
నిర్మల్‌ఖిల్లా: బాలికలు అన్నిరంగాలలో రాణించాలని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని స్థానికల సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్ అన్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమ ఆవశ్యకత తెలియజేసేందుకు జిల్లాలోని పలువురు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినులతో సోమవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పరిపాలన విధానం, భవిష్యత్ ప్రణాళిక, మహిళా సాధికారత, బేటీ బచావో బేటీ పడావో ప్రాముఖ్యత తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు నాగలక్ష్మి, సవిత, మిషన్ శక్తిబృందం సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
నిర్మల్/నిర్మల్‌రూరల్: కొన్ని నెలలుగా జిల్లా విద్యాశాఖ ఏదో ఒకరకంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది. అక్రమ డిప్యూటేషన్లు, బదిలీల్లో చేతివాటం, యూబిట్ కాయిన్‌దందాలో టీచర్ల అరెస్టులు, విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఇలా వరుస ఘటనలతో ఆ శాఖ పేరు మసకబారుతోంది. పలు ఆరోపణల నేపథ్యంలో గతంలో పనిచేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులు మారారు. ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చినా జిల్లాలో జాయిన్ కాలేదు. తాజాగా విద్యాశాఖపై బయట నుంచి ఆరోపణలు కాకుండా అంతర్గతంగానే ఉన్నతాధికారికి, కార్యాలయ ఉద్యోగుల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. చివరకు తమ ఉన్నతాధికారిపై కలెక్టర్‌కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది. వరుసగా రెండుసార్లు రాష్ట్రంలోనే టెన్త్ ఫలితాల్లో ప్రథమస్థానంలో నిలిచిన జిల్లాలో పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ఇలాంటి పరిణామం కలవరపెడుతోంది.
అధికారి తీరుపై నిరసన..
విద్యాశాఖలో కొన్నినెలలుగా కోల్డ్‌వార్ కొనసాగుతోంది. రోజురోజుకూ ఉన్నతాధికారి తీరు మారుతోందని, తమపై అనవసర ఒత్తిడి పెంచుతున్నారన్నది ఉద్యోగుల ఆరోపణ. ఇదేక్రమంలో జిల్లా కా ర్యాలయంలో ఒత్తిడి భరించలేకనే ఓ అధికారి వేరే జిల్లాకు బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. మరో అధికారి కూడా రెండు మూడు నెలల్లోనే జిల్లా నుంచి బదిలీ చేయించుకుంటానని చెబుతుండటం గమనార్హం. తమ పనితీరు బాగా లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కానీ.. ఇలా వేధించడం సరికాదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. డీఈవో తీరుతో విసిగి వేసారిన విద్యాశాఖ జిల్లా కార్యాలయ ఉద్యోగులంతా ఏకమై ఇటీవల కలెక్టర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ప్రథమం.. ‘పది’లమేనా..!
చదువులతల్లి సరస్వతీమాత కొలువైన జిల్లా విద్యారంగంలోనూ ఇప్పుడిప్పుడే ముందడుగేస్తోంది. రెండేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ ఏడాది కూడా ఫస్ట్ రావాలని, హ్యాట్రిక్ సాధించాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా కలెక్టర్ సహా సంబంధిత అధికారులు విద్యాశాఖపై దృష్టిపెడుతున్నారు. వరుసగా తనిఖీలు చేస్తూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. మరో 17 రోజుల్లోనే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి తరుణంలో జిల్లా విద్యాశాఖలో ముసలం మొదలవడం కలవరపెడుతోంది. ఈ ప్రభావం పదోతరగతి పరీక్షలపై పడితే స్టేట్ ఫస్ట్ ర్యాంకు వస్తుందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూస్‌రీల్
వరుసగా మరకలు..
జిల్లా విద్యాశాఖపై వరుసగా మరకలు పడుతూనే ఉన్నాయి. జిల్లా ఏర్పడిన మొదట్లో డీఈవోను ఖాతరు చేయకుండా కొంతమంది అధికారులు, ఉద్యోగులు వ్యవహరించిన తీరు అప్పట్లో ఫిర్యాదుల వరకూ వెళ్లింది. చివరకు డీఈవో బదిలీ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన డీఈవో హయాంలోనే జిల్లా వరుసగా రెండుసార్లు పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కానీ సదరు విద్యాశాఖ అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 317 జీవో, టీచర్ల బదిలీలు, డిప్యూటేషన్లు, పదోన్నతులు, డీఎస్సీ పోస్టింగుల్లో ఆరోపణలు వచ్చాయి. ఆయన హయాంలోనే యూబిట్‌కాయిన్ దందాలో వందలమంది ఉపాధ్యాయులు కూరుకుపోయారు. ఏకంగా పలువురు జైలుకు వెళ్లడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఈ దందాలో పలువురు ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్లడంలో డీఈవో తీరూ వివాదాస్పదమైంది. చివరకు ఆయన కూడా బదిలీ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరికీ పోస్టింగ్ ఇచ్చినా జిల్లాలో జాయిన్ కాలేదు. ఇటీవల జిల్లాలో విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపుల ఘటనలు, సంబంధిత అధికారులు స్పందించిన తీరు విద్యాశాఖకు మాయనిమచ్చను తెచ్చాయి. తాజాగా విద్యాశాఖ జిల్లా కార్యాలయ ఉద్యోగులే తమ పైఅధికారిపై ఆరోపణలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా వేధింపులు ఒత్తిడి భరించలేక ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వేధింపులు మరింత పెరిగినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు.
డీఈవో వర్సెస్ ఉద్యోగులు
ఉన్నతాధికారి తీరుపై నిరసన
లిఖితపూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు
పరీక్షలవేళ ఇదేం పరేషాన్..!?
నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment