నిర్మల్
ఆర్జీయుకేటీలో ‘కథక్’ శిబిరం
ఆర్జీయుకేటీలో ఐదు రోజుల కథక్ నృత్య శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్తి శంకర్, రచన శిక్షణ ఇవ్వనున్నారు.
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
8లోu
సైబర్ క్రైమ్‌పై
అవగాహన ఉండాలి
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: సైబర్ నేరాలపై మహిళలు కూడా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. సైబర్ మోసగాళ్లు వర్క్‌ఫ్రం హోం అని, ఆకట్టుకునే వేతనాలని, పార్ట్ టైం జాబులు అని, మహిళలు, గృహిణులను ఆకర్షిస్తున్నారని తెలిపారు. యాప్‌లు డౌన్‌లోడ్ చేయించి, ఫోన్లను హ్యాక్ చేస్తారని పేర్కొన్నారు. మహిళల వ్యక్తిగత వివరాలు సేకరించి, వాటిని చూపించి, భయపెట్టి సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని వివరించారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, గూగుల్ అకౌంట్ల వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని సూచించారు. మీ అకౌంట్లకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవాలని తెలిపారు. సైబర్ మోసం బారిన పడితే వెంటనే 1930 నంబర్‌కు కాల్‌చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈనెల 8న మహిళా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఇందులో సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రమణారావు, ఆర్‌ఎస్‌ఐ రవికుమార్ పాల్గొన్నారు.
కడెం: అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి.. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయి. సదర్మట్ చివరి ఆయకట్టు వరకు సాగునీరందక కడెం మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం కనీసం స్పందించడం లేదు. దీంతో నెర్రెలు బారిన పంటను చూసి రైతులు యాసంగిపై ఆశలు వదులుకుంటున్నారు.
వారబందీ పద్ధతిలో..
సదర్మట్ కాలువ ద్వారా కడెం మండలం లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్‌ఎల్లాపూర్, పెత్తర్పు, ధర్మాజీపేట్, కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ, పె ద్దూర్ తండా, వకీల్‌నగర్, చిట్యాల్, తదితర గ్రా మల్లోని 5 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. లక్ష్మ ణాచాంద మండలం వడ్యాల్ వద్ద సరస్వతి కెనాల్ నుంచి సదర్మట్‌కు వారబందీ పద్దతిన 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఖానాపూర్, క డెం మండలాల ఆయకట్టుకు ఈ నీరే అందాలి. అ యితే చివరి వరకు నీరు అందకపోవడంతో పొలా లు ఎండిపోతున్నాయి. కాలువ నీరు రాకపోవడం, వ్యవసాయ బావుల్లో నీళ్లు అడుగంటడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. బావుల్లో నీరు పది నిమి షాలు కూడా మోటార్ నుంచి రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. సదర్మట్ కాలువ ద్వారా వ స్తున్న నీటితో కడెం ప్రాజెక్ట్‌కు ఫీడింగ్ చేయడం, నీ టి పారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతోనే చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
న్యూస్‌రీల్
సదర్మట్ ఆయకట్టుకు అందని సాగునీరు
నెర్రెలు బారుతున్న పొలాలు
పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
ఈచిత్రంలో కనిపిస్తున్న రైతు కడెం మండలం కొత్తమద్దిపడగ గ్రామానికి చెందిన అంకంపేట భూమన్న. సదర్మట్ కాలువ ద్వారా సాగు నీరిస్తామని అధికారులు చెప్పడంతో యాసంగిలో ఎకరంనరలో వరి సాగు చేశాడు. నెల రోజులుగా సాగునీరు అందకపోవడంతో వ్యవసాయ బావి నుంచి కొంతమేర నీరు అందించాడు. ఇప్పుడు బావిలో నీళ్లు కూడా అడుగంటాయి. కాలువ నీళ్లు రాక, బావిలో నీళ్లు లేక పంటపై ఆశలు వదులుకున్నాడు. ఇటీవలే గొర్రెలను మేపాడు.
నిర్మల్
నిర్మల్
నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment