పకడ్బందీగా ‘బాలశక్తి’ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ‘బాలశక్తి’

Published Wed, Mar 5 2025 1:18 AM | Last Updated on Wed, Mar 5 2025 1:12 AM

పకడ్బందీగా ‘బాలశక్తి’

పకడ్బందీగా ‘బాలశక్తి’

నిర్మల్‌టౌన్‌: బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా కొనసాగించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బాలశక్తి నిర్వహణపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపునకు అమలుపరుస్తున్న బాలశక్తి కార్యక్రమాన్ని మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిరంతరం కొనసాగించాలని వైద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలు నిర్వహించిన విద్యార్థులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలని సూచించారు. అనారోగ్య సమస్యలను గుర్తిస్తే ప్రత్యేక పోషక ఆహారం, మందులను అందించాలని తెలిపారు. పోషకులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్య స్థితిగతుల వివరాలను తెలియజేయాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. పరీక్షలపై భయాన్ని తొలగించేలా, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా మానసిక వైద్య నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా పాఠశాలల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌, డీఈవో రామారావు, డీఎంహెచ్‌వో రాజేందర్‌, గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రామ్‌గోపాల్‌, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement