ఆర్జీయూకేటీ అధ్యాపకురాలికి డాక్టరేట్
బాసర: ఆర్జీయూకేటీ బాసరలో ఈసీఈ విభాగంలో అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకురాలు డాక్టర్ ఆర్.పద్మశ్రీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకుంది. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ డాక్టరేట్ పొందిన పద్మశ్రీకి అభినందనలు తెలిపారు. వర్సిటీలో ఇప్పటికే చాలామంది డాక్టరేట్ పొందారని తెలిపారు. దీంతో పరిశోధనా రంగంలోనూ నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పద్మశ్రీ ‘సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఎంఐఎంఓ డిటెక్టర్ల పనితీరు విశ్లేషణ 6 జీహెచ్‌జెడ్/ఎంఎం వేవ్ నెట్‌వర్క్‌లలో అప్‌లింక్ డౌన్‌లింక్‌ను డీకప్లింగ్ చేయడం‘ అనే అంశంపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ అందుకున్నారు. ఈసీఈ విభాగం ప్రొఫెసర్ బి.రాజేందర్‌నాయక్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తిచేశారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పలు పరిశోధనా పత్రాలను ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment