ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నిర్మల్ రూరల్: జిల్లాలో బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఈసారి విద్యార్థులకు ఐదు నిమిషాలు వెసులుబాటు కల్పించినా దాదాపు గంట ముందే పరీక్షాకేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,944 మంది విద్యార్థులకు గాను 6,510 మంది హాజరయ్యారు. 434మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 621మంది విద్యార్థులకు 539 మంది హాజరయ్యారు. 82మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 6,323 మంది విద్యార్థులకు గాను 5,971 మంది హాజరయ్యారు. 352 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో పరశురాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికలు, బాలుర పరీక్షా కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినవ్, ఏఎస్పీ ఉపేందర్‌రెడ్డి వేర్వేరుగా పరిశీలించారు. గురువారం నుంచి సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థిని సెంటర్‌కు చేర్చిన ఎస్సై
ముధోల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రంలో ఇంటర్ పరీక్షలకు హాజరు కావాల్సిన ఓ విద్యార్థి పొరపాటున గురుకుల పాఠశాలకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక పొరపాటు తెలుసుకుని జూనియర్ కళాశాలకు వెళ్లేందుకు పరుగులు పెట్టాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న స్థానిక ఎస్సై సంజీవ్ గమనించి ఆ విద్యార్థిని తన వాహనంలో సకాలంలో సెంటర్‌కు చేర్చాడు. దీంతో ఎస్సైని పలువురు అభినందించారు.
6,944 మంది విద్యార్థులకు 6,510 మంది హాజరు
పరీక్షాకేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment