వందశాతం పూర్తి చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఇంటిపన్ను వసూళ్లను వందశాతం పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ, వాణిజ్య పన్నుల వసూలు, శానిటేషన్ తదిత ర అంశాలపై మున్సిపల్ అధికారులతో ఆయన స మావేశం నిర్వహించారు. ఇప్పటివరకు వసూలు చే సిన పన్నులు, బకాయిలకు సంబంధించి మున్సిపాలిటీల వారీగా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో పన్నులు చెల్లించనివారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్షం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులు తప్పనిసరిగా వాణిజ్య లైసెన్స్‌లను పునరుద్ధరించుకునేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ భవన సముదాయాల్లో వ్యా పారం నిర్వహించుకుంటున్న వ్యాపారుల నుంచి వెంటనే అద్దె వసూలు చేయాలని సూచించారు. బ కాయిలు పేరుకుపోయిన దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. శానిటేషన్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. సమావేశంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, రాజేశ్‌కుమార్, జాదవ్ కృష్ణ, మెప్మా పీడీ సుభాష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment