ఇంటిపన్ను వసూలు చేయాలి
లోకేశ్వరం: వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. బుధవారం మండలంలోని మన్మద్, రాజూర గ్రామాల్లోని సెగ్రిగేషన్ షెడ్, నర్సరీ, డ్రైనేజీ లు, రోడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డీ పీవో మాట్లాడుతూ.. నర్సరీలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. ఇంటింటా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని తెలిపారు. సెగ్రిగేషన్ షెడ్‌లో సేంద్రియ ఎరువు తయారు చేయాలని సూచించారు. గ్రా మాల్లో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టాల ని తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించే రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయ న వెంట ఎంపీడీవో వెంకటరమేశ్, ఈవోపీఆర్డీ సోలమాన్‌రాజ్, సెక్రటరీ మహేశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment