బాధ్యతాయుతంగా విధులు..
మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎస్పీ జానకీషర్మిల తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. అంతేకాకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తాం. మొదటిరోజు విధుల్లో.. బస్టాండు వద్ద పెట్రోలింగ్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేశాం. రోడ్లపై ఉన్న బండ్లను తొలగింపజేశాం. మొదటి రోజు డ్యూటీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. –వజ్రమ్మ, నిర్మల్
పురుషులతో సమానంగా..
మొదటిసారిగా బ్లూకోల్ట్స్, పెట్రోకార్ విధులు నిర్వహించడం సంతోషంగా ఉంది. పురుషులతో సమానంగా విధులు నిర్వహించాం. నిబద్ధతతో పనిచేశాం. మాకు ఈ అవకాశం కల్పించిన ఎస్పీ జానకీషర్మిళ మేడం, ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఎస్సై సుమలతకు కృతజ్ఞతలు.
– శ్రీలత, లక్ష్మణచాంద
‘నారీశక్తి’లో భాగంగా..
మహిళలు ఏరంగంలో అయినా రాణించగలరు. మా మహిళ సిబ్బందిపై పూర్తి నమ్మకంతోనే వారికి పెట్రోకార్ బాధ్యతలు అప్పగించాం. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న ‘నారీశక్తి’ కార్యక్రమాల్లో భాగంగా వారానికోసారి మహిళా కానిస్టేబుళ్లకు పెట్రోకార్ బాధ్యతలను అప్పగిస్తాం. తొలిరోజే డబ్ల్యూపీసీలు అద్భుతంగా పనిచేశారు.
–జానకీషర్మిల, ఎస్పీ
బాధ్యతాయుతంగా విధులు..
బాధ్యతాయుతంగా విధులు..
బాధ్యతాయుతంగా విధులు..
Comments
Please login to add a commentAdd a comment