మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిబిరంలో మహిళల సాధారణ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన చికిత్స అందించనున్నట్లు తెలిపారు. అనంతరం వైద్యులు కలెక్టర్‌కు బీపీ, రక్త పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: మహిళలు క్రీడా పోటీలలో పాల్గొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కొండాపూర్ సమీపంలోని నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ మహిళ తన సామర్థ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించాలన్నారు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు క్రీడలు మేలుచేస్తాయన్నారు. అనంతరం మహిళలతో కలిసి చెస్, క్యారం, టెన్నిస్ ఆడారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి రమణ, తదితరులు పాల్గొన్నారు.
బాలశక్తితో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బాలశక్తి కార్యక్రమం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో బాలశక్తి కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్ విజన్ కంటి ఆస్పత్రి వైద్యులు హర్షవర్ధన్‌రెడ్డి అందించిన వాహనాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో పీ.రామారావు, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, డీఆర్డీవో విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
Comments
Please login to add a commentAdd a comment