‘టోల్‌ప్లాజా కార్మికులను కొనసాగించాలి’
సోన్: టోల్‌ప్లాజా కార్మికులందర్నీ కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు. సోమవారం ఫెర్వేజ్ కంపెనీ టోల్ మేనేజర్ సంతోష్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిప్పర్‌వాడ, నేరడిగొండ, గంజాల్ టోల్‌ప్లాజా కార్మికులు 15 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారన్నారు. పాత కంపెనీ రిద్ది సిద్ది ఒక్కో కార్మికుడికి రూ.24వేల నుంచి రూ.29 వేల వేతనం చెల్లించేదన్నారు. పాత జీతాన్ని కొనసాగించాలని, కొత్తవారిని తీసుకోవద్దని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో ఎం.రమేశ్, సందుగారి నవీన్, గంగాధర్, రాజేశ్వర్, శ్రావణ్ రాజకుమార్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment