ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, భూ సంబంధిత, అటవీ, వ్యవసాయం, డబుల్‌బెడ్ రూమ్, పెన్షన్, రేషన్ కార్డులు వంటి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రజలు అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విధుల్లోకి తీసుకోవాలి
నేను 16 సంవత్సరాలపాటు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఎఫ్‌ఏగా విధులు నిర్వర్తించా. ఏడాదిక్రితం నుంచి అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాలేక పోయా. ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుట పడింది. కావున నాయందు దయతలచి తిరిగి విధుల్లోకి అనుమతించి నా కుటుంబాన్ని ఆదుకోగలరు.
– రాచర్ల రాజేశ్వర్, న్యూబొప్పారం
రిజర్వేషన్ మార్చాలి
మేము సారంగాపూర్ మండలం ఇప్పచెల్మ గ్రామస్తులం. మా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇట్టి పోస్ట్ కోసం గ్రామస్తులం అంతాకలిసి అధికారులను సంప్రదించగా ఇది ఎస్సీకి కేటాయించినట్టు తెలిసింది. కానీ మా గ్రామంలో ఎస్సీ కులస్తులు లేరు. కావున ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయించాలి.
– గూడెం నాగోరావు, ఇప్పచెల్మ గ్రామస్తుడు
ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment