‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: పదో తరగతి పరీక్షల్లో ఈసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో పదో తరగతి పరీక్షల పై గురువారం సమీక్ష నిర్వహించారు. పరీక్షల్లో జి ల్లాలోని ప్రతీ పాఠశాలలో విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించాలన్నారు. రెండేళ్లుగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలుస్తోందని తెలిపారు. ఈసారి కూడా మొదటిస్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. పరీక్షల సన్నద్ధత కోసం ప్రత్యేక టైంటేబుల్ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయం తొలగించాలని సూచించారు. పాఠ్యాంశాలను సులభంగా గుర్తుంచుకునేలా మెలకువలు నేర్పించాలని తెలిపారు. ఉపాధ్యాయులు అధికారులు, ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు శాతానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల ప్రత్యే క అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment